Home  »  TGPSC 2022-23  »  Indian Polity-1

Indian Polity-1 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది వాటిలో ఏ అంశాలు సామాజిక జవాబుదారీ కార్యక్రమాలుగా పరిగణించబడతాయి?
ఎ. కేంద్రీకృత బ్యూరోక్రాటిక్ ప్రణాళిక మరియు విధాన రూపకల్పన.
బి. పౌరసత్వ చార్టర్లు.
సి. కమ్యూనిటీ స్కోర్ కార్డులు.
డి. భాగస్వామ్య వ్యయం ట్రాకింగ్.
సరైన జవాబుని ఎంచుకోండి:

  1. ఎ, బి & సి మాత్రమే
  2. బి, సి & డి మాత్రమే
  3. ఎ, బి & డి మాత్రమే
  4. ఎ, బి, సి & డి మాత్రమే
View Answer

Answer: 2

బి, సి & డి మాత్రమే

Explanation:

  • సామాజిక జవాబుదారీతనం అనేది పౌరులు, సంఘాలు, స్వతంత్ర మీడియా మరియు పౌర సమాజ సంస్థలు ప్రభుత్వ అధికారులను జవాబుదారీగా ఉంచడానికి ఉపయోగించే అనేక రకాల చర్యలు మరియు యంత్రాంగాలను సూచిస్తుంది.
  • భారత దేశంలో సామాజిక జవాబుదారీ కార్యక్రమాలకు ఉదాహరణలు :
  • భాగస్వామ్య ప్రణాళిక  మరియు విధాన రూపకల్పన  (కేరళ)
  • భాగస్వామ్య బడ్జెట్ విశ్లేషణ (గుజరాత్)
  • భాగస్వామ్య వ్యయం  ట్రాకింగ్ సిస్టమ్ (ఢిల్లీ, రాజస్థాన్)
  • పౌరుల సర్వేలు/సిటిజన్ రిపోర్ట్ కార్డ్‌లు (బెంగళూరు, మహారాష్ట్ర)
  • సిటిజన్(పౌరుల) చార్టర్స్ (ఆంధ్రప్రదేశ్, కర్ణాటక)
  • కమ్యూనిటీ స్కోర్‌కార్డులు (మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్)

Question: 7

2020లో పార్లమెంటు ఆమోదించిన క్రింది బిల్లులు / సవరణలను వాటి సంబంధిత మంత్రిత్వ శాఖలతో సరిపోల్చండి:
బిల్లులు/సవరణలు
ఎ. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితులు కోడ్, 2020.
బి. జాతీయ కమిషన్ శాఖ మంత్రిత్వ శాఖ అనుబంధ మరియు ఆరోగ్య సంరక్షణ కోసం ప్రొఫెషన్స్ బిల్లు, 2020.

సి. దివాలా మరియు దివాలా కోడ్ (రెండవ సవరణ) బిల్లు, 2020.

డి. కంపెనీలు (సవరణ) బిల్లు, 2020

మంత్రిత్వ శాఖ
1. ఆర్ధిక మంత్రిత్వ శాఖ.
2. కార్మిక, ఉపాధి మంత్రిత్వ .
3. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ.

4. ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ.

5. కార్పొరేట్ వ్యవహారాలు.

సరైన జవాబుని ఎంచుకోండి :

  1. ఎ-2, బి-4, సి-1, డి-5
  2. ఎ-3, బి-2, సి-5, డి-1
  3. ఎ-4, బి-3, సి-5, డి-1
  4. ఎ-4, బి-2, సి-1, డి-5
View Answer

Answer: 1

ఎ-2, బి-4, సి-1, డి-5

Explanation:

  • వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితులు కోడ్,  2020 అనేది ఒక వ్యవస్థలో పనిచేసే వ్యక్తుల వృత్తిపరమైన భద్రత మరియు ఆరోగ్యం మరియు పని పరిస్థితులను నియంత్రించే చట్టాలను ఏకీకృతం చేయడానికి మరియు సవరించడానికి బిల్లు. ఈ బిల్లు ఉభయసభల మరియు రాష్ట్రపతి  ఆమోదం పొంది చట్టంగా మారింది. కానీ ఇంకా అమలులోకి రాలేదు. 13 పాత కేంద్ర కార్మిక చట్టాలను ఈ చట్టం భర్తీ చేస్తుంది. కార్మిక ఉపాధి శాఖ పరిధిలోకి వస్తుంది.
  • జాతీయ కమీషన్ శాఖ మంత్రిత్వ శాఖ అనుబంధ మరియు ఆరోగ్య సంరక్షణ కోసం ప్రొఫెషన్స్ బిల్లు, 2020. ఆరోగ్య సంరక్షణ మరియు దాని అనుబంధ రంగాల నిపుణుల విద్య మరియు అభ్యాసాన్ని ప్రామాణీకరించడానికి తద్వారా సమాజంలో  వారి గౌరవం పెంచడానికి కేంద్రప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది. 2021లో ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఈ బిల్లు ఆరోగ్య & కుటుంబ సంక్షేమ  శాఖ పరిధిలోది.
  • దివాలా మరియు దివాలా కోడ్ (రెండవ సవరణ) బిల్లు, 2020(Insolvency and Bankruptcy bill). ఇది దివాలా మరియు దివాలా కోడ్, 2016ను సవరిస్తుంది. కంపెనీలలో మరియు వ్యక్తుల దివాలాను పరిష్కరించడానికి ఈ కోడ్  ఒక నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రక్రియను అందిస్తుంది. ఈ బిల్లు ఆర్థిక శాఖకు సంబంధించింది.
  • కంపెనీల (సవరణ) బిల్లు, 2020, కంపెనీల చట్టం, 2013లోని కొన్ని నిబంధనలను నేరరహితం చేయడం, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో మార్పులు వంటివి లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కార్పొరేట్ వ్యవహారాల పరిధిలోది.

Question: 8

కేంద్ర ప్రభుత్వం యొక్క అవినీతి నిరోధక చర్యలు వేటికి బాధ్యత వహిస్తాయి:
ఎ. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్

బి. అడ్మినిస్ట్రేటివ్ విజిలెన్స్ విభాగం (AVD) డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్
సి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CID)

డి. ఇంటెలిజెన్స్ బ్యూరో [1B)

సరైన జవాబుని ఎంచుకోండి :

  1. ఎ, బి & సి మాత్రమే
  2. ఎ & బి మాత్రమే
  3. ఎ,బి & డి మాత్రమే
  4. సి & డి మాత్రమే
View Answer

Answer: 1 

ఎ, బి & సి మాత్రమే

Explanation:

  • కేంద్ర ప్రభుత్వ అవినీతి నిరోధక చర్యలను ముందుకు తీసుకుపోయే విభాగాలు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(CVC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI), అడ్మినిస్ట్రేటివ్ విజిలెన్స్ డివిజన్(AVD, డిపార్టుమెంటు ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్).
  • CVC & CBI రెండూ కూడా k సంతానం కమిటీ సూచనల ఆధారంగా ఏర్పాటు చేయబడ్డాయి.
  • 1962లో కేంద్రప్రభుత్వం అవినీతి నిరోధంపై ఏర్పాటు చేసిన కమిటీ సంతానం కమిటీ (1962-1964). అప్పటి పార్లమెంట్ సభ్యుడు  K సంతానం చైర్మన్ గా నలుగురు ఇతర ఎంపీలు , ఇద్దరు సీనియర్ అధికారులు సభ్యులుగా ఈ కమిటీ ఏర్పడింది.
  • CVC 1964లో ఏర్పాటయింది. ఇది కేంద్ర ప్రభుత్వంలో అవినీతిని అరికట్టే ప్రధాన ఏజెన్సీ. దీనిలో ఒక ప్రధాన కమిషనర్ (చైర్మన్, CVC), ఇద్దరికి మించకుండా కమిషనర్లు ఉంటారు. వీరి పదవీ కాలం 4 సం,,లు లేదా 65 సం,, ల వయసు మించకూడదు.
  • సీబీఐ 1963లో ఢిల్లీ ప్రత్యేక పోలీసు స్థాపన చట్టం,1946 ద్వారా ఏర్పాటు అయింది. ఇది భారతదేశంలోని దేశీయ నేర పరిశోధనా సంస్థ. ఇది పర్సనల్ అండ్ ట్రైనింగ్ , పబ్లిక్ గ్రీవెన్స్ మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది.  సీబీఐకి అధిపతి దాని డైరెక్టర్ . CBI  డైరెక్టర్ పదవికాలం 2 సం,,లు. సమాచార హక్కు చట్టంలోని నిబంధనల నుండి CBIకి మినహాయింపు ఉంది. ఇంటర్‌పోల్‌(INTERPOL) తో అనుసంధానం కోసం భారతదేశం అధికారికంగా నియమించిన ఏకైక సంస్థ CBI.
  • INTERPOL (International Criminal Police organization) అనేది ప్రపంచవ్యాప్త నేర నియంత్రణ లో వివిధ దేశాల పోలీసుల సహకారం మరియు సమన్వయం కోసం ఏర్పడ్డ సంస్థ. నేర నియంత్రణను సులభతరం చేసే ఒక అంతర్జాతీయ సంస్థ. ఇంటర్ పోల్ హెడ్ క్వార్టేర్స్  ల్యోన్(Lyon), France లో కలదు. ఇండియా 1949లో ఇంటర్పోల్ లో చేరింది. ఇటీవల 90వ ఇంటర్పోల్ అంతర్జాతీయ సదస్సు 2022లో డిల్లీలో జరిగింది.
  • ప్రస్తుత సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ – ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ
  • ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ – ప్రవీణ్ సూద్ ( as on July,2024)

Question: 9

PM-KUSUM పథకాన్ని 2019లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇది కింది ఏ మంత్రిత్వ శాఖలో భాగం?

  1. కొత్త & పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ
  2. కుటుంబ & శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ
  3. సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ
  4. అటవీ, పర్యావరణం మరియు వాతావరణమార్పు మంత్రిత్వ శాఖ
View Answer

Answer: 1

కొత్త & పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ

Explanation:

  • PM KUSUM పూర్తి రూపం Pradhan Mantri Kisan Urja Suraksha evam Utthaan Mahabhiyan (ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా ఎవం ఉత్తాన్ మహా అభియాన్). ఈ పథకం లక్ష్యం సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం మరియు సౌరశక్తితో నడిచే వ్యవసాయ పంపుల స్థాపనకు,  ఆర్థిక మరియు విధాన మద్దతును అందించడం.
  • ఇప్పటికే ఉన్న గ్రిడ్-కనెక్ట్(Grid-Connect) చేయబడిన వ్యవసాయ పంపుల సోలారైజేషన్ కోసం రైతుల ఆదాయాన్ని పెంచడం కూడా దీని లక్ష్యం.
  • ఈ పథకం కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోనిది.
  • ప్రస్తుత కేంద్ర కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖామాత్యులు – ప్రల్హాద్ జోషి
  • కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖామాత్యులు – అన్నపూర్ణ దేవి
  • కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖామాత్యులు –  వీరేంద్ర కుమార్ ఖతిక్కేం
  • ద్ర అటవీ, పర్యావరణం మరియు వాతావరణమార్పు శాఖామాత్యులు – భూపేందర్ యాదవ్ 
  • తెలంగాణ రాష్ట్ర శాఖలు – మాత్యులు
  • మహిళా మరియు శిశు సంక్షేమ శాఖామాత్యులు (పంచాయతీ రాజ్ , రూరల్ డెవలప్మెంట్) – D. అనసూయ సీతక్క
  • అటవీ, పర్యావరణం(దేవాదాయ శాఖ )  – కొండా సురేఖ

Question: 10

అధికార దుర్వినియోగాన్ని నిరోధించడానికి మరియు పరిష్కరించడానికి ఈ క్రింది వాటిలో ఏవి మార్గాలుగా పరిగణించబడతాయి?

ఎ. అధికారాన్ని ఆంక్షల ముప్పుకు గురి చేయడం.

బి. దానిని పారదర్శకంగా అమలు చేయవలసి ఉంటుంది.

సి. తన చర్యలను సమర్ధించుకోవడానికి శక్తిని బలవంతం చేయడం.
డి. నిర్ణయ/విధాన రూపకల్పన సమావేశాలలోకి మీడియాను అనుమతించడం.

సరైన జవాబుని ఎంచుకోండి :

  1. ఎ & బి మాత్రమే
  2. సి & డి మాత్రమే
  3. ఎ, బి & సి మాత్రమే
  4. బి, సి & డి మాత్రమే
View Answer

Answer: 4

బి, సి & డి మాత్రమే

Explanation:

  • ఒక వ్యక్తి లేదా వ్యవస్థ తనకు ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని లేదా వాడుకొని  స్వలాభాన్ని పొందడమే (ఉదా :అక్రమ ధనార్జన) అధికార దుర్వినియోగం.
  • అధికార దుర్వినియోగాన్ని నిరోధించడానికి మార్గాలు :
  • పారదర్శకత (నిర్ణయ/విధాన రూపకల్పన సమావేశాలలోకి మీడియాను అనుమతించడం, విధానాలను నిష్పాక్షికంగా అమలుపరచడం)
Recent Articles