Home  »  TGPSC 2022-23  »  Indian Polity-1

Indian Polity-1 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన యొక్క ప్రభావాలు:
ఎ. కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక అధికారాలు పొడిగింపు,

బి. పార్లమెంట్ చట్టాలను రూపొందించే అధికారాలను పొడిగించడం,

సి. రాజ్యాంగంలోని సమాఖ్య నిబంధనలు పని చేస్తూనే ఉంటాయి.

డి. రాజ్యాంగంలో హామీ ఇవ్వబడిన ప్రాథమిక స్వేచ్ఛలపై పరిమితి.

సరైన జవాబుని ఎంచుకోండి :

  1. ఎ & బి మాత్రమే
  2. ఎ & సి మాత్రమే
  3. ఎ, బి & సి మాత్రమే
  4. ఎ, బి & డి మాత్రమే
View Answer

Answer: 4

ఎ, బి & డి మాత్రమే

Explanation: 

  • రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధనలు ఆర్టికల్స్ 352 – 360 (పార్ట్ XVIII, భాగం-18) లో పొందుపరిచారు. 3 రకాల అత్యవసర పరిస్ధితులు రాజ్యాంగంలో పేర్కొన్నారు.
  1. జాతీయ అత్యవసర పరిస్థితి (ఆర్టికల్ 352)
  2. రాష్ట్రపతిపాలన (రాష్ట్ర అత్యవసర పరిస్థితి) (ఆర్టికల్ 356)
  3. ఆర్థిక అత్యవసర పరిస్థితి ( ఆర్టికల్ 360)
  • జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్రం యొక్క కార్యనిర్వహణ అధికారాలు పెరుగుతాయి. రాష్ట్రప్రభుత్వాలు పూర్తిగా కేంద్రం అధీనంలోకి తేబడుతాయి.
  • అంతేకాకుండా రాష్ట్రజాబితాలలోని అంశాలపై కూడా పార్లమెంటు చట్టాలు చేస్తుంది. అంటే పార్లమెంట్ చేసే చట్టాల పరిధి పెరుగుతుంది.
  1. కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల విభజనను మార్చే అధికారం రాష్ట్రపతికి కలదు. అంటే కేంద్రం నుండి రాష్ట్రాలకు వెళ్ళే వాటాలను తగ్గించవచ్చు లేదా పూర్తిగా నిలిపివేయొచ్చు.
  2. ప్రాథమిక హక్కులపై పరిమితి ఉంటుంది. (Limitation on Fundamental rights)
  3. అత్యవసర పరిస్థితిలో పాలన విధానం సమాఖ్య నుండి పూర్తిగా ఏకీకృతంగా (Federal to Unitary) మారుతుంది.

Question: 17

కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై జస్టిస్ RS సర్కారియా కమిషన్ లోని ఇతర సభ్యులు ఎవరు?

  1. బి. శివరామన్ & డాక్టర్. SR సేన్.
  2. MM పుంచి & VK దుగ్గల్.
  3. ధీరేంద్ర సింగ్ & NR మాధవన్.
  4. VK దుగ్గల్, విజయ శంకర్ & NR మాధవన్.
View Answer

Answer: 1

బి. శివరామన్ & డాక్టర్. SR సేన్.

Explanation:

  • సర్కారియా కమీషన్‌ను జూన్ 1983లో భారత  ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను మరియు అధికార సమతుల్యతను పరిశీలించడం దీని ఉద్దేశ్యం.
  • ఈ కమిషన్‌కు భారత సుప్రీం కోర్టు విశ్రాంత(retired) న్యాయమూర్తి రాజిందర్ సింగ్ సర్కారియా నేతృత్వం వహిస్తారు.
  • ఇందులో సభ్యులు B శివరామన్ & S R సేన్. ఈ కమీషన్ తన రిపోర్టును 1988లో సమర్పించింది. ఈ కమీషన్ మొత్తం 247 సూచనలు చేసింది.
  • ఈ కమీషన్ అంతర్రాష్ట్ర మండలి పై పలు కీలక సలహాలు ఇచ్చింది.
  • ఒక రాష్ట్రానికి గవర్నర్ ను నియమించెప్పుడు ఆ వ్యక్తి ఆ రాష్ట్రం బయటివాడు అయి ఉండాలి మరియు అధికార పార్టీ సభ్యుడై ఉండకూడదని ఈ కమీషన్ సూచించింది.

Question: 18

మంత్రివర్గ బాధ్యత సూత్రాలకు సంబంధించిన ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి:
ఎ. మంత్రి మండలి లోక్ సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది.

బి. మంత్రి మండలి కనీసం నెలకు ఒకసారి సమావేశమవుతుంది.

సి. మంత్రిత్వ శాఖ లోక్ సభకు విశ్వాసాన్ని కోల్పోయిన వెంటనే రాజీనామా చేయాలి.
డి. రాష్ట్రపతి సంతోషం ఉన్న సమయంలో మంత్రులు పదవీ బాధ్యతలు నిర్వహిస్తారు.
సరైన జవాబుని ఎంచుకోండి :

  1. ఎ, బి & సి మాత్రమే
  2. బి, సి & డి మాత్రమే
  3. ఎ, బి & డి మాత్రమే
  4. ఎ, సి & డి మాత్రమే
View Answer

Answer: 4

ఎ, సి & డి మాత్రమే

Explanation:

ఆర్టికల్ 75 :

  1. ప్రధాన మంత్రి రాష్ట్రపతిచే నియమింపబడతారు మరియు ఇతర మంత్రులు ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతి చేతనే నియమింపబడతారు.
  2. మంత్రులు రాష్ట్రపతి ఆమోదం(Pleasure of the President) ఉన్నంతవరకే వారి పదవుల్లో కొనసాగుతారు.
  3. మంత్రిమండలి లోక్ సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. ( లోక్ సభలో మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానం నెగ్గితే అందరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలి( ఆ మంత్రులు రాజ్య సభ సభ్యులు అయిన కూడా లోక్ సభ లో అవిశ్వాస తీర్మానం నెగ్గితే రాజీనామా చేయవల్సిందే)
  4. ప్రధాన మంత్రిని కలుపుకొనే మొత్తం మంత్రుల సంఖ్య లోక్ సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకూడదు. ఈ  నిబంధన 91వ సవరణ చట్టం, 2003 ద్వారా రాజ్యాంగంలో చేర్చబడింది.
  5. మంత్రుల జీతభత్యాలు పార్లమెంట్ చే నిర్ణయించబడతాయి

Question: 19

భారత రాజ్యాంగంలోని 2, 3 అధికరణల్లో పొందుపరిచిన అధికారాలను ఉపయోగించి పార్లమెంటు కిందివాటిలో దేనిని చేయగలదు?
ఎ. కొత్త భూ భాగాలను భారతదేశం యొక్క కొత్త రాష్ట్రంగా అంగీకరించడం
బి. ప్రస్తుతం ఉన్న భారతీయ రాష్ట్రాలను విభజించడం లేదా విలీనం చేయడం
సి. పొరుగు దేశాలకు భూభాగాల బదలాయింపు, మార్పిడి.
డి. ప్రస్తుతం ఉన్న భారతీయ రాష్ట్రాల పేర్లు మరియు సరిహద్దులను మార్చడం.
సరైన ఎంపికను ఎంచుకోండి:

  1. ఎ, బి & సి మాత్రమే
  2. ఎ, బి & డి మాత్రమే
  3. ఎ, సి & డి మాత్రమే
  4. ఎ, బి, సి & డి
View Answer

Answer: 2

ఎ, బి & డి మాత్రమే

Explanation:

  • ఆర్టికల్స్ (1 – 4) :  – పార్ట్ I  – కేంద్రం మరియు దాని భూభాగాలు (Union and its Territory)
  • ఆర్టికల్ 1 :  భారతదేశం మరియు దాని భూభాగ నిర్వచనం
  • ఆర్టికల్ 2 : యూనియన్ ఆఫ్ ఇండియా లో భాగంకాని రాష్ట్రాలను భారతదేశంలో భాగం చెయ్యడానికి పార్లమెంట్కు అధికారం కలదు
  • ఆర్టికల్ 3: దీని ప్రకారం పార్లమెంట్ కు ఈ దిగువ అధికారాలు రాజ్యాంగం కల్పించింది
  • భారతదేశంలో ఇప్పటికే ఉన్న రాష్ట్రాల సరిహద్దు మార్పులకు
  • ఏదేని ఒక రాష్ట్రంలోని కొంత భాగాన్ని వేరుచేసి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం లేదా వేరు వేరు రాష్ట్రాలలోని కొన్ని భూభాగాలను తీసుకొని ఒక కొత్త రాష్ట్రంగా చెయ్యడం
    • ఏదైనా రాష్ట్రం వైశాల్యాన్ని పెంచడం లేదా తగ్గించడం
    • ఏదైనా రాష్ట్రం యొక్క సరిహద్దులను మార్చడం
    • రాష్ట్రాల పేరు మార్చివేయడం
  • ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 3  అవకాశం కల్పించింది.
  • భారత భూభాగాన్ని వేరే దేశానికి బదలయించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. బేరుబారి యూనియన్ ను పాకిస్తాన్ కు ఇవ్వడానికి 9వ రాజ్యాంగ సవరణ చట్టం 1960 చేశారు.

Question: 20

ఈ క్రింది వాటిలో గవర్నర్ గా నియామకానికి అవసరమైన అర్హత కానిది ఏది?

  1. అతడు/ఆమె శాసనసభ లేదా పార్లమెంటు సభ్యుడు కాకూడదు.
  2. అతడు/ఆమె భారత పౌరుడు అయి ఉండాలి మరియు 35 సంవత్సరాలు నిండి ఉండాలి
  3. అతడు/ఆమె నియమించబడుతున్న రాష్ట్రం యొక్క నివాసాన్ని కలిగి ఉండాలి.
  4. అతడు/ఆమె కేంద్ర, రాష్ట్ర లేదా స్థానిక ప్రభుత్వం కింద లాభదాయకమైన ఏ పదవిని నిర్వహించరాదు.
View Answer

Answer: 3

అతడు/ఆమె నియమించబడుతున్న రాష్ట్రం యొక్క నివాసాన్ని కలిగి ఉండాలి.

Explanation: 

  • భారతదేశంలో గవర్నర్ లను నియమించే పద్ధతి కెనడియన్ మోడల్ (కెనడా రాజ్యాంగం నుండి తీసుకోబడింది)
  • రాజ్యాంగంలో తెలిపిన గవర్నర్ నియామకానికి కావాల్సిన అర్హతలు
  1. గవర్నర్ గా నియమింపబడే వ్యక్తి భారత పౌరుడై/పౌరురాలై ఉండాలి.
  2. 35 సం.ల వయస్సు నిండి ఉండాలి.
  3. ఏ సభలో సభ్యుడు అయి ఉండకూడదు (పార్లమెంట్ మరియు ఏదేని రాష్ట్ర సభలు)
  4. లాభదాయకమైన ఏ పదవి నిర్వహణలో ఉండకూడదు.
  5. కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాలలో ఏ పదవి కలిగి ఉండకూడదు
  • కాలానుగుణంగా మారిన పరిస్థితుల దృష్ట్యా మరికొన్ని నియమాలు (ఇవి రాజ్యాంగంలో పేర్కొననివి)
  • గవర్నరుగా నియమింపబడే వ్యక్తి ఆ రాష్ట్రానికి చెందిన వారై ఉండకూడదు.
  • రాష్ట్రపతి గవర్నర్ ను నియమించే ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి
Recent Articles