Home  »  TGPSC 2022-23  »  Indian Polity-10

Indian Polity-10 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పంచాయతీ ఆర్థిక పరిస్థితులను ఎవరు సమీక్షించాలి?

  1. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా
  2. రాష్ట్ర ఆర్థిక సంఘం
  3. కంప్టోలర్ మరియు ఆడిటర్ జనరల్
  4. రాష్ట్ర రెవెన్యూ శాఖ
View Answer

Answer: 2

రాష్ట్ర ఆర్థిక సంఘం

Explanation:

243 (I) అధికరణ- రాష్ట్ర ఆర్థిక సంఘం

  •  పంచాయితీరాజ్ సంస్థలు సమర్థంగా పనిచేయుటకు గానూ, ఆర్థిక వనరులను సమకూర్చుకోవటంలో తగిన సూచనలు, సలహాలను అందించుటకు రాష్ట్ర స్థాయిలో ఫైనాన్స్ కమీషన్లు ఏర్పాటు చేయాలి.
  • ఫైనాన్స్ కమీషన్ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలకు మంజూరు చేయాల్సిన నిధులను గురించి మార్గదర్శ కాలను రూపొందిస్తుంది. కేంద్రం నుండి నిధుల మంజూరు కోసం కేంద్ర ఫైనాన్స్ కమీషన్కు గవర్నర్ ద్వారా రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను చేస్తుంది.

Question: 12

73, 74వ రాజ్యాంగ సవరణ చట్టం తర్వాత …… ఊరట లభించింది.

  1. స్థానిక ప్రభుత్వం
  2. రాష్ట్ర శాసన మండలి
  3. జాతీయ మానవ హక్కుల కమిషన్
  4. రాష్ట్ర సంక్షేమ సామాజిక శాఖ
View Answer

Answer: 1

స్థానిక ప్రభుత్వం

Explanation:

  • భారత దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ గురించి 5 వ భాగం లో ఆర్టికల్ 124-147 వరకు పేర్కొన్నారు

న్యాయమూర్తుల నియామకం – అర్హతలు

  •  రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించేటపుడు క్రింద పేర్కొన్న అర్హతలను పరిగణిస్తారు.
  • భారత పౌరులై ఉండాలి.
  • హైకోర్టు స్థాయికి కనీసం 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసిన వారై ఉండాలి
  • హైకోర్టు స్థాయికి తగ్గకుండా కనీసం 10 సంవత్సరాలు న్యాయవాదిగా చేసి ఉండాలి
  • రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయకోవిదులై ఉండాలి
  • న్యాయమూర్తుల నియామకం సందర్భంగా కనీస వయస్సు నిర్ణయించబడలేదు.
  • న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు.

Question: 13

భారతదేశంలో న్యాయమూర్తుల పదవీకాలం ఎంత?

  1. 60 సంవత్సరాల వయస్సు వరకు
  2. 62 సంవత్సరాల వయస్సు వరకు
  3. 65 సంవత్సరాల వయస్సు వరకు
  4. 70 సంవత్సరాల వయస్సు వరకు
View Answer

Answer: 3

65 సంవత్సరాల వయస్సు వరకు

Explanation:

  • రాష్ట్ర సరిహద్దు లోపల ఉన్న వ్యక్తులకు, సంస్థలకు ప్రాథమిక హక్కుల పరిరక్షణకు వివిధ రిట్లను జారీ చేస్తుంది. రిట్లు జారీ చేసే అధికారాల విషయంలో సుప్రీంకోర్టు కు ఉన్న అధికారాల కంటే హైకోర్టుకు ఉన్న అధికారాలే ఎక్కువ. హైకోర్టులు ప్రాథమిక హక్కుల రక్షణకే కాక ఇతర అంశాలకు సంబంధించి కూడా రిట్లు జారీ చేయవచ్చు.
  • రిట్లు జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు (ప్రకరణ 32), హైకోర్టుకు (ప్రకరణ 226) కల్పించారు.5 రకాలు హెబియస్ కార్పస్,మాండమస్ ,ప్రొహిబిషన్, సెర్షియోరారీ ,కో వారేంటో .
  1. హెబియస్ కార్పస్ (బందీ ప్రత్యక్ష)
  • బందీ ప్రత్యక్ష, ‘శరీరాన్ని కలిగి ఉండుట’ అని పేర్కొనబడే ఆజ్ఞ ఇది.
  • ఒక వ్యక్తి యొక్క అరెస్టు చట్టబద్ధమా? కాదా? అనేది నిర్ణయించుటకు ఉన్నత న్యాయస్థానాలు ఈ ఆజ్ఞను జారీ చేస్తాయి. దీని ప్రకారం అరెస్టు కాబడిన వ్యక్తిని 24 గంటలలోగా సమీప కోర్టులో హాజరుపరచాలి.
  • అరెస్టుకు గల కారణాలు తెలపాలి.
  • అరెస్టయిన వ్యక్తికి తన వాదన విన్పించుకునే అవకాశం కల్పించాలి. ప్రభుత్వ అధికారులకు ఈ అజ్ఞను జారి చేస్తారు.

Question: 14

ఈ క్రింది వాటిలో ఏది ఒక వ్యక్తిని అక్రమ కస్టడీ నుండి కోర్టు ముందుకు తీసుకురాగలదు?

  1. హేబియస్ కార్పస్
  2. కోవ్ వారంట్
  3. నిషెధం
  4. సెర్టియోరారి
View Answer

Answer: 1

హేబియస్ కార్పస్

Explanation:

భారతదేశ అత్యున్నత శాసనశాఖ – పార్లమెంట్

  • రాష్ట్రపతి పార్లమెంట్ సభ్యులు కాకపోయినప్పటికీ పార్లమెంటులో భాగంగానే పరిగణిస్తారు.
  • 78వ అధికరణ ప్రకారం రాజ్యసభ, లోక్సభ మరియు రాష్ట్రపతిని పార్లమెంట్గా వ్యవహరిస్తారు.
  • 1919 చట్టం ద్వారా భారత్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు.
  • 1952లో భారత పార్లమెంట్ ఏర్పడింది.
  • 1954 లో లోకసభ మొదటి స్పీకరైన జి.వి.మౌలాంకర్ ఎగువ సభను రాజ్యసభగాను, దిగువసభను లోక్సభగానూ అభివర్ణించారు.

Question: 15

భారత పార్లమెంటు ……..?

  1. ఏకసభ
  2. ద్విసభ
  3. కామెరల్
  4. మల్టీకెమెరల్
View Answer

Answer: 2

ద్విసభ

Explanation:

  • ద్విసభ శాసనసభ అంటే ఏమిటి?
  • ఇది రెండు సభలతో కూడిన శాసన సభ.  యూనియన్‌లో రెండు సభలు మరియు దాని 28 రాష్ట్రాలలో 6 చోట్ల కూడా భారతదేశం అలాంటి ఉదాహరణ.ద్విసభ శాసనసభలో, చట్టాలను నిర్వహించడం మరియు అమలు చేయడం రెండు సభల మధ్య భాగస్వామ్యం చేయబడుతుంది.
  • పార్లమెంటు అనగా రాష్ట్రపతి +రాజ్యసభ +లోక్ సభ
  • ద్విసభ నిర్మాణం: భారత పార్లమెంటు రెండు సభలను కలిగి ఉంటుంది: లోక్‌సభ (ప్రజల సభ) మరియు రాజ్యసభ (రాష్ట్రాల మండలి), ప్రతి ఒక్కటి విభిన్నమైన పాత్రలు మరియు విధులను కలిగి ఉంటాయి.
Recent Articles