Home  »  TGPSC 2022-23  »  Indian Polity-11

Indian Polity-11 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

జాతీయ సమైక్యతకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి:
(ఎ) రాజ్యాంగ ప్రవేశిక ‘భారత ప్రజలమైన మనం’తో ప్రారంభమవుతుంది.
(బి) భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు అందరికీ సమానత్వం, న్యాయం, స్వేచ్ఛను తీసుకురావడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని నిర్దేశిస్తాయి.
సరైన జవాబుని ఎంచుకోండి :

  1. (ఎ) మరియు (బి) రెండూ సరైనవి
  2. (ఎ) మరియు (బి) రెండూ సరైనవి కావు.
  3. (ఎ) మాత్రమే సరైనది
  4. (బి) మాత్రమే సరైనది
View Answer

Answer: 3

(ఎ) మాత్రమే సరైనది

Explanation:

రాజ్యాంగ ప్రవేశక/పీఠిక (Preamble)

  • భారత రాజ్యాంగం ప్రవేశక (పీఠిక) తో ప్రారంభమవు తుంది. భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాల్లో ప్రవేశికను ప్రధానంగా పేర్కొనవచ్చు
  • ప్రవేశిక రాజ్యాంగం యొక్క లక్ష్యాలను, మూల తత్వాన్ని తెలియజేస్తుందిప్రవేశిక భారత రాజ్యాంగానికి పరిచయం వంటిది.
  • రాజ్యాంగ ప్రవేశిక అనే భావనను అమెరికా రాజ్యాం గం నుండి గ్రహించారు.
  • 1946 డిసెంబర్ 13న జవహర్ లాల్నెహ్రూ రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టిన లక్ష్యాల, ఆశయాల తీర్మానం (ఈ తీర్మానం ఆమోదించిన తేదీ 1947 జనవరి 22) ఆధారంగా ప్రవేశికను రూపొందించారు.
  • రాజ్యాంగ ప్రవేశికను రాజ్యాంగం యొక్క ఆత్మ, హృదయమని పేర్కొంటారు.
  • భారత రాజ్యాంగ పీఠిక పై విప్లవాల ప్రభావాలు
  • ఫ్రెంచ్ విప్లవం – స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. రష్యా విప్లవం – సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. అమెరికా విప్లవం – పీఠిక, లిఖిత రాజ్యాంగం
  • స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వమును మన రాజ్యాంగం ముందు మాటలో తీసుకున్నాము. ఈ మాటలకు ప్రేరణ ఇచ్చిన విప్లవం – ఫ్రెంచి విప్లవం

Question: 7

జూన్ 2018లో, కేంద్ర జాబితాలోని ________ ఉప-వర్గీకరణ సమస్యను పరిశీలించడానికి ఏర్పాటైన కమిషన్ పదవీకాలాన్ని తుది పొడిగింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ విషయంలో కిందివాటిలో సరైనది కానిది గుర్తించండి:

(ఎ) కమిషను జి. రోహిణి నేతృత్వం వహిస్తారు.
(బి) గడువును జూలై 31, 2018 వరకు పొడిగించబడింది.

(సి) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం కమిషన్ ఏర్పాటు చేయబడింది.
(డి) కమిషన్ తన నివేదికను వాస్తవానికి మే 20, 2018 నాటికి ఇవ్వాల్సి ఉంది.
సరైన జవాబుని ఎంచుకోండి :

  1. (ఎ) (బి), (సి), (డి)
  2. (ఎ) (బి), (సి) మాత్రమే
  3. (ఎ), (బి) మాత్రమే
  4. (డి) మాత్రమే
View Answer

Answer: 4

(డి) మాత్రమే

Explanation:

  • OBC వర్గీకరణపై జస్టిస్ రోహిణి కమీషన్:
  • వెనుకబడిన వర్గాలు (OBC) వర్గీకరణను పరిశీలించేందుకు ఆర్టికల్ 340 కింద భారత రాష్ట్రపతి 2017 అక్టోబర్లో ఢిల్లీ హైకోర్టు విశ్రాంత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రోహిణి అధ్యక్షతన 4గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించారు.
  • కమిటీలోని సభ్యులు :
  1. జస్టిస్ రోహిణి (రిటైర్డ్ ఢిల్లీ హైకోర్టు సి.జె)
  2. డా॥ జె.కె. బజాజ్ (సెంటర్ ఫర్ పాలసీస్టడీస్ – డైరెక్టర్)
  3. యాంత్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా- డైరెక్టర్
  4. రిజిస్టర్ జనరల్ & సెన్సస్ కమీషనర్ ఆఫ్ ఇండియా
  • ఈ కమీషన్ ఆర్టికల్ 340 ప్రకారం రాష్ట్రపతి నియమించగా తన నివేదికను 2023 ఆగస్టు 01న రాష్ట్రపతి ద్రౌపరి మురుకు అందించింది.
  • ఈ కమీషన్ దాదాపుగా 1,30,000 ఉద్యోగాలు కొన్ని ఉన్నత విద్యాసంస్థలలో, ఉన్నత ఉద్యోగాలలో బి.సి.ల నియామకాలను, ఎలా ఉన్నది అనేది కమీషన్ అధ్యయనం చేసింది.
  • ఈ కమీషన్ రిపోర్టు ప్రకారం మొత్తం బి.సి లలో 97% ఉద్యోగాలలో 25% ఉద్యోగాలు OBCలు ఆక్రమిస్తున్నారు అని పేర్కొంది. ఈ 25%లో 10 బి.సి. కమ్యూనిటీలు ఎక్కువగా ఉద్యోగాలు సాధిస్తున్నారు.
  • 983 OBC కమ్యూనిటీలకు 0% ప్రాతినిధ్యంగా ఉంది.
  • 994 OBC ఉపకులాలకు 68% ప్రాతినిధ్యం ఉన్నట్లుగా పేర్కొంది.
  • ఈ కమీషన్ తన రిపోర్టు ఆలస్యంగా రిపోర్టు ఇవ్వడానికి గల కారణం సరియైన సమాధానం లేకపోవడం, దేశంలో కులం ఆధారంగా జనాభా గణన లేకపోవడం కారణంగా పేర్కొంది.
  • ఇటీవల కాలంలో బీహార్ రాష్ట్రంలో కులం ఆధారంగా జనాభా గణన చేయగా కొందరు పాట్నా హైకోర్టులో సవాల్ చేయగా హైకోర్టు ప్రభుత్వాన్ని సమర్థించింది.

Question: 8

భారత రాజ్యాంగంలోని కింది ఆర్టికల్స్ గురించిన ప్రకటనలను పరిశీలించండి
(ఎ) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 245 పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ రెండు అధికారాలు రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉంటాయని పేర్కొంది.
(బి) ఒక నేరం యొక్క విచారణ సమయంలో ఒక నిందితుడు తన వాయిస్ శాంపిల్ ఇవ్వాలని నిర్దేశిస్తే, అది ఆర్టికల్ 20 (1) ప్రకారం అతని హక్కును ఉల్లంఘించలేదు.
సరైన జవాబుని ఎంచుకోండి :

  1. (ఎ) మరియు (బి) రెండూ సరైనవి
  2. (ఎ) మరియు (బి) రెండూ సరైనవి కావు
  3. (ఎ) మాత్రమే సరైనది
  4. (బి) మాత్రమే సరైనది
View Answer

Answer: 3

(ఎ) మాత్రమే సరైనది

Explanation:

  • 245 వ అధికరణ ప్రకారం రాష్ట్రాలు కేవలం రాష్ట్ర భూభాగానికి వర్తించే శాసనాలు మాత్రమే చేస్తాయి. కాని కేంద్రం దేశం మొత్తం భూభాగానికి వర్తించే శాసనాలతో పాటు భూభాగేతర ప్రాంతాలకు వర్తించే శాసనాలను కూడా చేస్తుంది.
  • 20వ అధికరణ అక్రమ శిక్ష నుండి వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు రక్షణ కల్పించటం కోసం ఉద్దేశించబడినది.
  • ఎ) నేరం రుజువు కానిదే ఏ వ్యక్తినీ శిక్షింపరాదు. ఏ వ్యక్తినైనా అమల్లో ఉన్న చట్టాలను అనుసరించి మాత్రమే శిక్షించాలి అనగా Ex-Post Facto Laws ను వినియోగించి శిక్షించరాదు. (గతించిన చట్టాలను అనుసరించిగానీ లేక భవిష్యత్తులో రాబోయే చట్టాలను ఆధారం చేసుకొని ఏ వ్యక్తిని శిక్షింపరాదు).
  • బి) ఒక వ్యక్తిని విచారించి శిక్షించే కాలం నాటికి అది నేరంగా చట్టంలో పేర్కొనబడి ఉండాలి. అనగా కార్యానంతర శాసనాలను అనుసరించి శిక్షింపరాదు.
  • సి) ఒక నేరానికి ఒక శిక్షను మాత్రమే విధించాలి. డబుల్ జియోపార్డీ అనగా రెండు రకాలైన శిక్షలు విధింపరాదు.
  • డి) ఏ వ్యక్తిని కూడా తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాలని అతనినే బలవంతం చేయరాదు. అదేవిధంగా శిక్షింపరాదు

Question: 9

‘షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు (అత్యాచారాల నిరోధక) సవరణ చట్టం, 2015’ గురించిన కింది ప్రకటనలను పరిశీలించండి:

(ఎ) చట్టం అక్టోబర్ 2, 2015 నుండి అమలులోకి వచ్చింది.

(బి) ఎస్సీ, ఎస్టీల సభ్యులపై నేరాలకు సంబంధించిన కేసుల సత్వర విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి.
(సి) గిరిజన ప్రజలు మతపరమైన, ఆరోగ్య మరియు విద్యా సంస్థలను ఉపయోగించకుండా నిరోధించడం కూడా చట్టం ద్వారా శిక్షార్హమైనది.

సరైన జవాబుని ఎంచుకోండి :

  1. (ఎ), (బి) మరియు (సి)
  2. (ఎ) మరియు (బి) మాత్రమే
  3. (బి) మరియు (సి) మాత్రమే
  4. (ఎ) మరియు (సి) మాత్రమే
View Answer

Answer: 3

(బి) మరియు (సి) మాత్రమే

Question: 10

నీతి ఆయోగ్ ఆఫ్ ఇండియా గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి:
(ఎ) భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ప్రక్రియకు కీలకమైన, దిశాత్మకమైన మరియు వ్యూహాత్మక ఇన్ పుట్ లను అందించడానికి ఇది స్థాపించబడింది.
(బి) ఇది సహకార సమాఖ్యవాదాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రోత్సహించడానికి మరియు బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
(సి) ఇది భారతదేశం కోసం పంచవర్ష ప్రణాళికలను రూపొందిస్తుంది.

(డి) ఇది సహకారాల ద్వారా జ్ఞానం, ఆవిష్కరణ మరియు వ్యవస్థాపక మద్దతును అందిస్తుంది.

సరైన జవాబుని ఎంచుకోండి :

  1. (ఎ), (బి) మరియు (సి) మాత్రమే
  2. (ఎ), (బి) మరియు (డి) మాత్రమే
  3. (బి), (సి) మరియు (డి) మాత్రమే
  4. (ఎ) మరియు (సి) మాత్రమే
View Answer

Answer: 2

(ఎ), (బి) మరియు (డి) మాత్రమే

Explanation:

నీతి అయోగ్

  • NITI – (National Institution for Transforming India) ప్రణాళికా సంఘం స్థానం లో ఒక విధాన సంఘం (PCI) (Policy) Commission. నీతి అయోగ్ను జనవరి 1, 2015న ఏర్పాటు చేసారు.
  • సామాజిక, ఆర్థిక అంశాలపై భారత ప్రభుత్వానికి సలహాలను ఇచ్చే సలహా మండలి / మెధో మధన సంస్థగా నీతి అయోగ్ పని చేస్తుంది.
  • ఈ సంస్థ సమైక్య విధానానికి (Federal) రూపకల్పన చేసి పెంపొందిస్తుంది. సమైక్య వ్యవస్థను బలపరుస్తుంది.ఒప్పందాల ద్వారా విజ్ఞానం, నర కల్పనలతో కూడిన మద్దతును వ్యవస్థాపకులకు ఇస్తుంది.

నీతి అయోగ్ లక్ష్యాలు – ప్రాధాన్యతలు :

  • ఆర్ధిక విధానాలు, ప్రణాళికల రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్ధిక భాగస్వామ్యం కల్పించడం (సమైక్య వ్యవస్థ / సమైక్య స్ఫూర్తి)
  • అందరి భాగసామ్యంతో అందరి అభివృద్ధికి కృషి చేయడం (సబ్కా వికాస్)
  • పై నుండి క్రిందికి బదులుగా (Top to Bottom)
  • క్రింది నుండి పైకి (Bottom to Top) అనే ప్రణాళిక పద్ధతిని అనుసరించడం. (వికేంద్రికరణ ప్రణాళిక)
  • నమైక్య ఆర్థిక వ్యవస్థను పెంపొందించి, రూపొందించి బలపరచి నిర్మించడం.
Recent Articles