Home  »  TGPSC 2022-23  »  Indian Polity-12

Indian Polity-12 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లోని 22 భాషలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:

ఎ. రాజ్యాంగంలో మొదట 16 భాషలు మాత్రమే చేర్చబడ్డాయి.

బి. సింధీ భాష 1967లో జోడించబడింది.
సి. కొంకణి, మణిపురి మరియు నేపాలీ 1992లో చేర్చబడ్డాయి.

డి. బోడో, డోగ్రీ, మైథిలి మరియు సంతాలి 2004లో జోడించబడ్డాయి.

సరైన జవాబుని ఎంచుకోండి :

  1. ఎ, బి, సి & డి
  2. ఎ & సి మాత్రమే
  3. బి, సి & డి మాత్రమే
  4. బి & డి మాత్రమే
View Answer

Answer: 4

బి & డి మాత్రమే

Explanation:

  • భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూలులో 22 షెడ్యూల్డ్ భాషల జాబితా ఉంది.
  • వీటిలో 14 భాషలు మొదట్లోనే రాజ్యాంగంలో చేర్చారు.
  • 21వ రాజ్యాంగ సవరణ చట్టం 15 వ భాష గా సింధీ 1967లోనూ,
  • 71 వ రాజ్యాంగ సవరణ చట్టం 16 కొంకణీ, 17 మణిపురీ, 18 నేపాలీ వంటి భాషలు 1992లోనూ రాజ్యాంగ సవరణల ద్వారా చేరాయి.
  • 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో నాలుగు కొత్త భాషలు–19 డోగ్రీ, 20 మైథిలీ, 21 సంతాలి, 22 బోడో–లు భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేరాయి

Question: 7

వికలాంగులపై సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ యొక్క విధులు ఏమిటి?

ఎ. వికలాంగులకు సంబంధించి విధానాలు, కార్యక్రమాలు, చట్టం మరియు ప్రాజెక్టులపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇవ్వడం
బి. వికలాంగులపై విధానాలు, చట్టాలు రూపొందించి వాటిని అమలు చేయడం
సి. సంబంధిత అధికారులు మరియు అంతర్జాతీయ సంస్థలతో వికలాంగుల కారణాన్ని స్వీకరించడం
డి. వికలాంగుల కోసం యాక్సెసిబిలిటీ, సహేతుకమైన వసతి, వివక్ష లేకుండా ఉండేలా చర్యలను సిఫార్సు చేయడం
ఇ. వికలాంగులకు సంబంధించిన చట్టాలు, విధానాలు మరియు కార్యక్రమాల ప్రభావాన్ని పర్యవేక్షించడం మరియు మూల్యాంకనం చేయడం
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

  1. ఎ, బి, డి & ఇ మాత్రమే
  2. ఎ & బి మాత్రమే
  3. ఎ, సి, డి & ఇ మాత్రమే
  4. బి, సి, డి & ఇ మాత్రమే
View Answer

Answer: 1

ఎ, బి, డి & ఇ మాత్రమే

Question: 8

భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేయడానికి ముందు భారతదేశంలో ఉండవలసిన కనీస వ్యవధి ఎంత ?

  1. 3 సంవత్సరాలు
  2. 5 సంవత్సరాలు
  3. 6 సంవత్సరాలు
  4. 7 సంవత్సరాలు A
View Answer

Answer: 2

5 సంవత్సరాలు

Explanation:

  • భారత రాజ్యాంగంలో పౌరసత్వం గురించి 2 వ భాగం లో ఆర్టికల్ 5-11నందు పొందుపరిచారు
  • భారత రాజ్యాంగం భారతదేశంలో జన్మించిన వారికి లేదా నిర్ణీతకాలం పాటు దేశంలో నివాసం ఏర్పర్చు కున్న వారికి ఒకే పౌరసత్వాన్ని ప్రసాదించింది
  • 1986లో చేయబడిన సవరణను అనుసరించి కనీసం భారత్లో 7 సం॥లు స్థిరనివాసులై ఉండాలి. భారతీయ భాషలలో ఏదైనా భాషపై అవగాహన ఉండాలి.
  • భారత పౌరసత్వానికై దరఖాస్తులు చేసినవారు భారత రాజ్యాంగానికి మరియు చట్టాలకు కట్టుబడి జీవిస్తానని అదేవిధంగా
  • భారతదేశానికి ఏ విధంగానూ ద్రోహం తలపెట్టనని ప్రమాణం చేయవలసి ఉంటుంది.

Question: 9

ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి
(ఎ) విద్యా హక్కు చట్టం విద్యను ప్రాథమిక హక్కుగా చేస్తుంది

(బి) విద్యా హక్కు చట్టం 2009లో ఆమోదించబడింది
(సి) విద్యా హక్కు చట్టం 6- 14 సంవత్సరాల మధ్య పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యకు హామీ ఇచ్చింది

పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది/సరైనవి?

  1. ఎ మరియు బి
  2. బి మరియు సి
  3. ఎ మరియు సి
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 4

ఎ, బి మరియు సి

Explanation:

  • భారత రాజ్యాంగం లో ప్రాథమిక హక్కులు అనే భావన అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. 3 వ భాగం లో ఆర్టికల్ 12-35 వరకు పొందుపరిచారు
  • 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కుచట్టం (RTE – Right to education) 21ఎ లో చేర్చారు. 6-14 సం॥రాలలోపు బాలబాలికలకు నిర్భం ధోచిత ప్రాధమిక విద్యను అందించాలని పేర్కొన్నారు. ఈ విద్యాహక్కు దేశ వ్యాప్తంగా 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది.

Question: 10

రాజ్యాంగంలోని కింది ఆర్టికల్ లలో ఏది జాతీయ అత్యవసర పరిస్థితి కాల సమయం లో నిలిపివేయబడదు

  1. ఆర్టికల్. 32
  2. ఆర్టికల్. 21
  3. ఆర్టికల్. 19
  4. ఆర్టికల్. 15
View Answer

Answer: 2

ఆర్టికల్. 21

Explanation:

  • వ్యక్తి స్వేచ్ఛ మరియు జీవించేహక్కులకు రక్షణ (21 అధికరణ)
  • చట్టంచే నిర్ధారింపబడిన పద్ధతిలో తప్ప మరే విధంగానూ ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకూ మరియు ప్రాణానికీ హాని తలపెట్టరాదు.
  • దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించినపుడు రాష్ట్రపతి ప్రాథమిక హక్కుల అమలును సస్పెండ్ చేసే అధికారం కలిగి ఉన్నప్పటికీ జీవించే హక్కును రద్దు చేయుటకు అవకాశం లేదు. అనగా 21 అధికరణ భారత పౌరుల యొక్క జీవించే హక్కును గుర్తిస్తుంది.
  • జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో జీవించే హక్కును రద్దు చేయకుండే పద్దతిని మనదేశం జపాన్ నుండి గ్రహించినది
Recent Articles