Home  »  TGPSC 2022-23  »  Indian Polity-12

Indian Polity-12 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఆహారధాన్యాల ఉత్పత్తి రాష్ట్రాలయొక్క సరైన అవరోహణ క్రమం ఏది?

  1. ఉత్తరప్రదేశ్, పంజాబ్ మరియు మధ్యప్రదేశ్
  2. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్
  3. పంజాబ్, ఉత్తర ప్రదేశ్ మరియు తెలంగాణ
  4. మధ్యప్రదేశ్, పంజాబ్ మరియు పశ్చిమ బెంగాల్
View Answer

Answer: 1

ఉత్తరప్రదేశ్, పంజాబ్ మరియు మధ్యప్రదేశ్

Question: 12

ఆర్థిక మరియు సామాజిక ప్రణాళిక ఎందులో ఉంది?

  1. యూనియన్ జాబితా
  2. రాష్ట్ర జాబితా
  3. ఉమ్మడి జాబితా
  4. అవశేష అధికారాలు
View Answer

Answer: 3

ఉమ్మడి జాబితా

Question: 13

ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి
(ఎ) అఖిల భారత సర్వీసుల నిబంధన భారత రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనబడింది.
(బి) జాతీయ అభివృద్ధి మండలి నిబంధన భారత రాజ్యాంగంలో పేర్కొనబడలేదు.

(సి) స్టాంప్ డ్యూటీ కేంద్రం ద్వారా విధించబడుతుంది, కానీ రాష్ట్రాలచే సేకరించబడుతుంది మరియు కేటాయించబడుతుంది.
సరైన సమాధానం

  1. (1) (ఎ) మరియు (సి) సరైనవి కానీ (బి )సరైనవి కానీ
  2. (ఎ), (బి) మరియు (సి) సరైనవి
  3. (ఎ) మరియు (సి) సరైనవి కావు అయితే (బి) సరైనది
  4. (ఎ) మరియు (బి) సరైనవి కానీ (సి) సరైనవి కావు
View Answer

Answer: 2

(ఎ), (బి) మరియు (సి) సరైనవి

Explanation:

  • రాజ్యాంగంలో 14వ భాగంలో 308 నుండి 314 వరకు గల ప్రకరణలు కేంద్ర మరియు అఖిల భారత సర్వీసులు గురించి వివరించడం జరిగింది.
  • CDP (community development programme) సామాజిక అభివృద్ది పథకం:
  • 1952 లో vt కృష్ణమాచారి సూచన మేరకు ఫోర్డ్ ఫౌండేషన్ సహకారంతో 55 బ్లాకులయందు ప్రారంబించారు
  • CDP ద్వారా గ్రామాలలో వ్యవసాయం, నీటిపారుదల, మౌళికవసతులు, విద్య, ఆరోగ్యం, వంటి అంశాలలో కేంద్రీకరణ చేశారు
  • రాజ్యాంగంలోని 12వ భాగంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను, ఆస్తి, అప్పులు మరియు దావాలకు సంబంధించి అంశాలను పొందుపరిచారు. ప్రధానమైన ఆర్థిక వనరు కార్పొరేట్ టాక్స్  కేంద్ర ప్రభుత్వం కేంద్ర జాబితాలోని 15 అంశాలపై పన్నులు విధించి ఆదాయం సమకూర్చుకుంటుంది.
  • స్టాంప్ డ్యూటీ కేంద్రం ద్వారా విధించబడుతుంది, కానీ రాష్ట్రాలచే సేకరించబడుతుంది మరియు కేటాయించబడుతుంది
  • రాష్ట్ర  ప్రభుత్వం రాష్ట్ర  జాబితాలోని 20 అంశాలపై పన్నులు విధించి ఆదాయం సమకూర్చుకుంటుంది.ప్రధానమైన ఆర్థిక వనరు ప్రధానమైన ఆర్థిక వనరు అమ్మకపు పన్ను

Question: 14

ప్రతిపాదన (A) : ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఏదైనా రాష్ట్రం యొక్క సరిహద్దులను మార్చడానికి పార్లమెంటుకు అధికారం ఉంది.

కారణం (R) : ఏదైనా రాష్ట్ర సరిహద్దుల మార్పుకు సంబంధించిన బిల్లును రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టవచ్చు.

  1. A, Rలు సరైనవి, A, Rకి సరైన వివరణ
  2. A, Rలు సరైనవి, A, Rకి సరైన వివరణ కాదు
  3. A సరైనది, R సరైనది కాదు
  4. A సరికానిది,R సరైనది.
View Answer

Answer: 3

A సరైనది, R సరైనది కాదు

Explanation:

భారత్లో రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ అధికారం పార్లమెంటుదే

  •  రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనగా
  1. నూతన రాష్ట్రాల ఏర్పాటు.
  2. రాష్ట్రాల పేర్లు మార్పు
  3. రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చడం
  4. రాష్ట్రాల భూభాగాల నుండి కొంత భూభాగం వేరు చేయడం.
  5. ఒక రాష్ట్రం నుండి వేరు చేసిన భూభాగాన్ని మరొక రాష్ట్రంలో విలీనం చేయడం. భారతదేశంలో అంతర్గతంగా రాష్ట్రాల భూభాగాలలో మార్పులు, చేర్పులు చేసేటప్పుడు అదేవిధంగా నూతన రాష్ట్రాలను
  • ఏర్పాటు చేసేటప్పుడు పార్లమెంట్ సాధారణ చట్టం ద్వారా నిర్ణయం తీసుకుంటుంది
  • రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు పార్లమెంటు ఉభయ సభలలో దేనిలోనైనా ప్రవేశ పెట్టవచ్చు

 

Question: 15

ఈక్రిందివాటినిపరిశీలించండి
ఏదైనా రాజకీయ పార్టీకి చెందిన సభలోని సభ్యుడు కానీ సభ్యురాలు కానీ సభ్యులు గా ఉండేందుకు ఎప్పుడు అనర్హుడవుతారు.

(ఎ) అతన్ని పార్టీ నుండి బహిష్కరిస్తే

(బి) అతను అలాంటి రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లయితే.
(సి) అతను తనకు చెందిన రాజకీయ పార్టీ విపకు వ్యతిరేకంగా ఓటు వేసినా లేదా ఓటింగ్ కు దూరంగా ఉంటే.
పై ప్రకటనలలో ఏది సరైనది/సరైనది

  1. (ఎ) మరియు (బి)
  2. (బి) మరియు (సి)
  3. (ఎ), (బి) మరియు (సి)
  4. (ఎ) మాత్రమే
View Answer

Answer: 2

(బి) మరియు (సి)

Explanation:

రాజ్యాంగం లోని 10వ షెడ్యూల్ – పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం

  • వ్యక్తులు తరచుగా రాజకీయ పార్టీలు మారటాన్ని నిరోధించాలని, అదేవిధంగా రాజకీయాలలో నైతిక విలువలను పెంపొందించాలనే ఉద్దేశ్యంతో 1985లో రాజీవ్ గాంధీ కాలంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ షెడ్యూల్ను రాజ్యాంగంలో చేర్చారు.
  • దేశంలోని రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్దమైనవి కావు. అనగా అవి కేవలం చట్టబద్ధంగా ఎన్నికల కమీషన్ గుర్తింపు ద్వారా మాత్రమే ఏర్పడినవి.
  • భారత రాజ్యాంగం మొత్తంలో ‘రాజకీయ పార్టీ’ అనే పదాన్ని ఈ షెడ్యూలులో మాత్రమే చూడవచ్చు. ఒక పార్టీ గుర్తుపై గెలుపొందిన ప్రజా ప్రతినిధులు పార్టీలు మారుటను నిరోధిస్తూ ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు

పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించే సందర్భములు :

  • MLA మరియు MP తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినపుడు
  • ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలలో చేరినపుడు
  • పార్టీ ఆజ్ఞను (విప్)ను ధిక్కరించినపుడు సభ్యత్వం రద్దగును.
  • నియామక సభ్యులు 6 నెలల తర్వాత ఏదైనా పార్టీలో చేరినచో తమ ప్రాతినిధ్యం కోల్పోతారు.
  • స్వతంత్ర అభ్యర్థులు ఏదైనా రాజకీయ పార్టీల్లో చేరినపుడు
  • ఒక పార్టీ నుండి బహిష్కరించబడిన వ్యక్తులు ఇతర పార్టీల్లో చేరినపుడు ప్రాతినిధ్యం కోల్పోతారు.
  • ఒక ప్రజా ప్రతినిధి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినపుడు
Recent Articles