Home  »  TGPSC 2022-23  »  Indian Polity-13

Indian Polity-13 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

రాజ్యాంగంలోని పన్నెండవ షెడ్యూల్ లో పేర్కొనబడిన మునిసిపల్ కార్పొరేషన్ యొక్క విధులు ఏవి :
ఎ. మురికివాడల అభివృద్ధి మరియు నవీకరణ

బి. రోడ్లు మరియు వంతెనలు
సి. పట్టణ పేదరిక నిర్మూలన
డి. పశువుల చెరువులు మరియు జంతువుల పట్ల క్రూరత్వ నివారణ

సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

  1. ఎ, బి & సి మాత్రమే
  2. ఎ, బి, సి మరియు డి
  3. ఎ, బి & డి మాత్రమే
  4. సి & డి మాత్రమే
View Answer

Answer: 2

ఎ, బి, సి మరియు డి

Explanation:

  • పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించేం దుకు రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1989లో 65వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టగా లోక్సభ ఆమోదించింది. కానీ రాజ్యసభ తిరస్కరించ డంతో ఆ బిల్లు వీగిపోయింది
  • పి.వి. నరసింహారావు ప్రభుత్వం 65వ సవరణ బిల్లును పునరుద్ధరించి అనేక మార్పులతో  74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా 1991 సెప్టెంబర్ 16న లోక్సభలో ప్రవేశపెట్టారు. 74వ రాజ్యాంగ సవరణ బిల్లును ఉ భయ సభలు 1992 డిసెంబర్లో ఆమోదించాయి. 1993 ఏప్రిల్ 20వ తేదీన రాష్ట్రపతి ఆమోదం లభిం చింది.
  • 74వ రాజ్యాంగ సవరణ చట్టం జూన్ 1, 1993 నుంచి అమలులోకి వచ్చింది. 74వ సవరణ ద్వారా పట్టణ, నగర పాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పిస్తూ 12వ షెడ్యూల్ను ఏర్పాటు చేసి 18 అంశాలపై అధికారాలు కల్పించడం జరిగింది. నగరపాలక సంస్థలను రాజ్యాంగంలోని 9వ భాగంలో చేర్చారు.
  • రాజ్యాంగంలో పట్టణ, నగరపాలక సంస్థలకు చెందిన అంశాలను 9a భాగంలో ప్రకరణ 243 – P నుంచి 243 – ZG వరకు పొందుపర్చారు.

Question: 7

భారత ఎన్నికల సంఘం గురించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి:

ఎ. దీని కూర్పు రాజ్యాంగంలో పేర్కొనబడింది.
బి. ఇది స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహిస్తుంది.

సి. ప్రధాన ఎన్నికల కమిషనర్కు ఇతర ఎన్నికల కమిషనర్ల కంటే ఎక్కువ అధికారాలు లేవు
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

  1. ఎ మాత్రమే
  2. ఎ & సి మాత్రమే
  3. సి మాత్రమే
  4. బి & సి మాత్రమే
View Answer

Answer: 2

ఎ & సి మాత్రమే

Explanation: 

కేంద్ర ఎన్నికల సంఘం

  • రాజ్యాంగంలో 15వ భాగంలో 324 నుంచి 329 వరకు గల ప్రకరణలలో ఎన్నికల సంఘం గురించి వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగం ప్రకారం శాశ్వతమైన, స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ.
  • భారత ఎలక్షన్ కమీషన్ భవనం పేరు నిర్వాచన్ సదన్
  • ఎలక్షన్ కమీషన్ ఏర్పాటైన సం॥రం 1950 జనవరి 25 (అందుకే జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినో త్సవంగా ప్రకటించారు. 2011 నుంచి పాటిస్తున్నారు)
  • 2020 జనవరి 25న ఎన్నికల కమీషన్ ప్లాటినమ్ వేడుకలు (70 సం॥రాలు) జరిగాయి.
  • ఎన్నికలను అధికారికంగా ప్రకటించే వ్యక్తి – ప్రధాన ఎలక్షన్ కమీషనర్
  • తమ కార్యకలాపాలకు సంబంధించి ఎవరికీ కూడా బాధ్యత వహించని, ఎవరికీ కూడా నివేదిక సమర్పిం చని కమీషన్ ఎన్నికల కమీషన్
  • 1993లో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ను అనుసరిం చి ఎలక్షన్ కమీషన్లో మెజార్టీ నిర్ణయమే అంతిమం.
  • ఎలక్షన్ కమిషన్ త్రిసభ్య కమిషన్ ఒక ఛైర్మన్ ఇద్దరు సభ్యులు ఉంటారు

Question: 8

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 మరియు 30 కింద ఇవ్వబడిన సాంస్కృతిక మరియు విద్యా హక్కులుదేనిని తెలియచేస్తాయి :
ఎ. మైనారిటీలు తమ భాష మరియు లిపిని కాపాడుకునే హక్కు కలిగి ఉంటారు.
బి. మైనారిటీలు తమ సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయాన్ని పొందే ప్రాథమిక హక్కును కలిగి ఉన్నారు

సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

  1. ఎ లేదా బి కాదు
  2. ఎ మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. బి మాత్రమే
View Answer

Answer: 2

ఎ మాత్రమే

Explanation:

  • రాజ్యాంగంలో 3 వ భాగంలో ఆర్టికల్ 12-35 వరకు ప్రాథమిక హక్కులు పొందుపరిచారు
  • ప్రారంభంలో 7 హక్కులు ఉండేవి 1978 లో 44 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్థి హక్కు(31 వ ఆర్టికల్ ) ని తొలగించి 300A లో చేర్చారు ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి

సాంస్కృతిక, విద్యాహక్కులు(29-30)

ఆర్టికల్ 29

  • అల్ప సంఖ్యాకులు వారి భాష, లిపి, సంస్కృతులను పరిరక్షించుకోవచ్చని ఈ ప్రకరణ పేర్కొంది.
  • 29 (1) : దేశంలో నివశిస్తున్న పౌరులు ఏ వర్గం వారైనా వారికి విశిష్ట భాష, లిపి లేదా సంస్కృతి ఉన్నట్లయితే దానిని కాపాడుకునే హక్కు వారికి ఉంది.
  • 29(2): ప్రభుత్వం నిర్వహిస్తున్న లేదా ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న విద్యా సంస్థలలో మతం, జాతి, కులం, భాషా ప్రాతిపదికలపై పౌరు లెవరికీ ప్రవేశాన్ని నిరాకరించరాదు.

ఆర్టికల్ 30

  • విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవడంలో, నిర్వ హించుకోవడంలో మైనారిటీలకు గల హక్కులను ఈ ప్రకరణ వివరిస్తుంది.
  • 30(1) : మతం లేదా భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారు తమకు నచ్చిన విధంగా విద్యాసంస్థలు నెలకొల్పడానికీ, నిర్వహించుకోవడానికీ హక్కు ఉంది.
  • 30(1ఎ) : దీనిని 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. దీని ప్రకారం మైనారిటీలు స్థాపించిన విద్యాసంస్థలకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లయితే, తగిన పరిహారాన్ని చెల్లించాలి.

Question: 9

మండల పంచాయతీలు ఎవరిచే సిఫార్సు చేయబడ్డాయి:

  1. వెంకట్ రావు కమిటీ
  2. అశోక్ మెహతా కమిటీ
  3. బల్వంతరాయ్ మెహతా కమిటీ
  4. నరసింహన్ కమిటీ
View Answer

Answer: 2

అశోక్ మెహతా కమిటీ

Explanation:

అశోక్ మెహతా కమిటీ

  • 1977లో కేంద్రంలోని అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం(అప్పటి ప్రధాని మొరార్జీదేశాయ్) స్థానిక స్వపరిపాలనా సంస్థలపై అధ్యయనం చేయడానికి 1977 డిసెంబర్ లో అశోక్ మెహతా అధ్యక్షతన 14 మంది సభ్యులతో కమిటీని నియమించింది. 1978 ఆగస్ట్ లో నివేదిక ఇచ్చింది
  • ఈ కమిటీ 132 సిఫారసులు చేసింది 2 అంచెల విధానాన్ని జిల్లా పరిషత్, మండల పరిషత్ సూచించింది
  • జనతా ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో అశోక్ మెహతా కమిటీ సిఫారసులు అమల్లోకి రాలేదు. అయితే కర్ణాటక, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్లో ఆ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని పంచాయితీ వ్యవస్థను బలోపేతం చేయడం జరిగింది.
  • అశోక్ మెహతా కమిటీ సిఫారసు మేరకు రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం కర్ణాటక,
  • అశోక్ మెహతా కమిటీ సూచనలను అనుసరించి దేశంలో మండల పరిషత్ వ్యవస్థను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం – కర్ణాటక (అప్పటి ముఖ్యమంత్రి – రామకృష్ణ హెర్డే),రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 1985 (CM NTR)

Question: 10

రాజ్యవిధాన ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి
ఎ. దేశంలోని సామాజిక-ఆర్ధిక ప్రజాస్వామ్యాన్ని ఈ సూత్రాలు వివరిస్తాయి.
బి. ఈ సూత్రాలలో ఉన్న నిబంధనలు ఏవీ కోర్టు ద్వారా అమలు చేయలేరు
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

  1. ఎ లేదా బి కాదు
  2. ఎ & బి రెండూ
  3. ఎ మాత్రమే
  4. బి మాత్రమే
View Answer

Answer: 2

ఎ & బి రెండూ

Explanation:

  • రాజ్యాంగంలో 4 వ భాగంలో ఆదేశిక సూత్రాలను ఆర్టికల్ 36-51 లో పొందుపరిచారు
  • రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాలు సహజంగా న్యాయబద్దం అయినవి
  • వీటిని దేశంలోని రాజకీయ ప్రజాస్వామ్యానికి అవసరమైన సాంఘిక, ఆర్థిక పునాది ని ఏర్పరిచేందుకు ఉద్దేశించారు
  • ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ ఉండదు.వీటి అమలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది
  • భారత దేశాన్ని సంక్షేమ రాజ్యంగా తీర్చి దిద్దడమే వీటి లక్ష్యం
Recent Articles