Home  »  TGPSC 2022-23  »  Indian Polity-13

Indian Polity-13 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 దేనికి సంబందించింది:

  1. కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సంబందించిన నిబంధన
  2. భారత సుప్రీంకోర్టుకు సంబందించింది
  3. ఎన్నికల కమీషన్ కు సంబంధించిన నిబంధన
  4. రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించడం
View Answer

Answer: 3

ఎన్నికల కమీషన్ కు సంబంధించిన నిబంధన

 

Question: 17

కింది వాటిలో భారత రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యూల్ యొక్కలక్షణాలు ఏవి?

  1. షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ తెగల పరిపాలన మరియు నియంత్రణ
  2. గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన నిబంధనలు
  3. మైనారిటీలకు సంబంధించిన నిబంధనలు
  4. అంతర్ రాష్ట్ర నదీ జలాల భాగస్వామ్యం మరియు వివాదాలు
View Answer

Answer: 1

షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ తెగల పరిపాలన మరియు నియంత్రణ

Explanation:

5వ షెడ్యూల్- భారతదేశం షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన

  • భారతదేశంలో షెడ్యూల్డ్ ప్రాంతములు, షెడ్యూల్డ్ తెగల పరిపాలనకు సంబంధించిన అంశాల గురించి తెలియజేయును. 244(1) అధికరణ ప్రకారం భారత్లో షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన అంశాలపై భారత పార్లమెంట్ చట్టాలను రూపొందిస్తుంది.
  • ఈ ప్రాంతాల్లోని పరిపాలనాధికారం ఈ షెడ్యూల్లోని నిబంధనలకు లోబడి ఉంటుంది.
  • ఈ ప్రాంతాల పరిపాలనా అంశాలపై ఆయా రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్రపతికి రిపోర్ట్ పంపిస్తారు.

6వ షెడ్యూల్- అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన

  • అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం అనే 4 రాష్ట్రాలలో నివసించే ప్రత్యేక షెడ్యూల్డ్ తెగలు, ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనకు సంబంధించిన నిబంధన గురించి తెలియజేస్తుంది. (244(2) & 275(1)) అలాగే పశ్చిమబెంగాల్లోని గుర్ఖానేషనల్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి ఈ షెడ్యూల్లో చేర్చాలని ఆలోచన ఉంది.

Question: 18

లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ కింద ఉచిత న్యాయ సేవలను పొందడానికి కింది వ్యక్తులలో ఎవరు అర్హులు?
ఎ. వికలాంగులు
బి. ఎస్సీ / ఎస్టీ సభ్యులు
సి. పారిశ్రామిక కార్మికులు
డి. సామూహిక విపత్తు బాధితులు
సరైన జవాబుని ఎంచుకోండి

  1. ఎ మరియు బి మాత్రమే
  2. ఎ, సి మరియు డి మాత్రమే
  3. బి మాత్రమే
  4. ఎ, బి, సి మరియు డి
View Answer

Answer: 2

ఎ, సి మరియు డి మాత్రమే

 

Question: 19

కింది వారిలో, 29 నవంబర్ 2022 తేదీన భారత రాష్ట్రపతి ఎవరిని రాజ్యసభకు నామినేట్ చేశారు?
ఎ. ఇళయరాజా
సి. వీరేంద్ర హెగ్గడే
బి.పి.టి.ఉష
డి. వి. విజయేంద్ర ప్రసాద్
సరైన జవాబుని ఎంచుకోండి :

  1. బి మరియు సి మాత్రమే
  2. ఎ, బి మరియు డి మాత్రమే
  3. ఎ, బి, సి మరియు డి
  4. ఎ మరియు డి మాత్రమే
View Answer

Answer: 3

ఎ, బి, సి మరియు డి

 

Question: 20

కింది భారతదేశ మాజీ రాష్ట్రపతులను వారి కాల క్రమానుసారం అమర్చండి:
ఎ. డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం

బి. శ్రీ కెఆర్ నారాయణన్
సి. శ్రీ ప్రణబ్ ముఖర్జీ

డి. శ్రీమతి ప్రతిభా దేవిసింగ్ పాటిల్

సరైన క్రమాన్ని ఎంచుకోండి:

  1. బి, ఎ, సి, డి
  2. బి, ఎ, డి, సి
  3. సి, డి, ఎ, బి
  4. డి, ఎ, బి, సి
View Answer

Answer: 2

బి, ఎ, డి, సి

Explanation:

  • రాష్ట్రపతి కి గల శాసన అధికారాలలో భాగంగా
  • ఆర్టికల్ 80(3) ప్రకారం సాహిత్యం, సైన్స్, కళారంగాలలో, సాంఘిక సేవలలో విశిష్టమైన సేవలందించిన 12 మంది సభ్యులను రాష్ట్రపతి రాజ్యసభకు నియామకం చేస్తాడు.
  • ఆర్టికల్ 331 ప్రకారం : లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ను నియమిస్తాడు. 2019 లో 104వ రాజ్యాంగ సవరణను అనుసరించి ఈ అధికరణను భారత రాజ్యాంగం నుండి తొలగించడంజరిగింది.

KR నారాయణన్ (1997-2002):

  • తొలి దళిత రాష్ట్రపతి ,అమెరికా ప్రభుత్వం చే బెస్ట్ స్టేట్స్ మెన్ అవార్డు పొందారు

APJ అబ్దుల్ కలాం (2002-2007)

  • రాజకీయ నేపథ్యం లేకుండా అయిన రాష్ట్రపతి వ్యక్తి. WINGS OF FIRE గ్రంథ రచయిత
  • PURA (Providing urban amenities in rural area) రూపకర్త

శ్రీమతి ప్రతిభ పాటిల్ (2007-2012)

  • తొలి మహిళా రాష్ట్రపతి. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ చేసి రాష్ట్రపతిఅయిన ఏకైక వ్యక్తి

ప్రణబ్ ముఖర్జీ (2012-2017)

  • The dramatic decade గ్రంథకర్త
  • ఆర్డినెన్స్ ల జారీ సంస్కృతి ని బహిరంగంగా విమర్శించిన రాష్ట్రపతి
Recent Articles