Home  »  TGPSC 2022-23  »  Indian Polity-15

Indian Polity-15 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారత రాజ్యాంగం ప్రకారం, కేంద్రం యొక్క కార్యనిర్వాహక అధికారం ఎవరి దగ్గర ఉంది

  1. రాష్ట్రపతి
  2. హౌస్ ఆఫ్ పీపుల్
  3. ప్రధాన మంత్రి
  4. భారత ప్రధాన న్యాయమూర్తి
View Answer

Answer: 1

రాష్ట్రపతి

Explanation: 

కార్యనిర్వాహణాధికారాలు :

  • రాజ్యాంగం ప్రకారం అతడు ఈ అధికారాలను స్వయంగా కానీ, తన కింది అధికారుల ద్వారా కానీ నిర్వహిస్తారు.
  • 53వ ప్రకరణ ప్రకారం కేంద్ర కార్య నిర్వాహణా ధికారం రాష్ట్రపతికి ఉంటుంది. దేశం పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీద నిర్వహించబడును.
  • రాష్ట్రపతి భారత రిపబ్లిక్ కు ప్రధాన కార్యనిర్వాహణా ధిపతి (53వ ప్రకరణ)
  • 74 (1) ప్రకరణ రాష్ట్రపతి, ప్రధాన మంత్రి అధ్యక్షతన గల కేంద్ర మంత్రిమండలి సలహా, సహాయాలతో విధులను నిర్వహిస్తారు.
  • అన్ని కార్యనిర్వాహణాధికారాలు రాష్ట్రపతి పేరు మీదే ప్రకటించాలని 77వ ప్రకరణ పేర్కొంటుంది.
  • కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతి విశ్వాసమున్నంతమై వరకే పదవిలో ఉండటం – ఆర్టికల్ 75(2)

Question: 7

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ యొక్క క్రమం కు (మొదటి నుండి చివరి వరకు) సంబంధించి క్రింది నిబంధనలను సరిగ్గా ఏర్పాటు చేయండి?
ఎ. గ్రామ పంచాయతీల సంస్థ
బి. వ్యవసాయం మరియు పశుపోషణ సంస్థ
సి. పౌరులకు యూనిఫాం సివిల్ కోడ్
ఎంపికలు :

  1. ఎ, సి, బి
  2. ఎ, బి, సి
  3. సి, బి, ఎ
  4. సి, ఎ, బి
View Answer

Answer: 1

ఎ, సి, బి

Explanation: 

  • పంచాయతీ రాజ్ సంస్థలు : ఆర్టికల్ 40 ప్రకారం గ్రామీణ అభివృద్దిలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం కోసం స్థానిక స్వపరిపాలన సంస్థలు నెలకొలపాలి
  • వ్యవసాయ0 మరియు పశు పోషణ :ఆర్టికల్ 48 వ్యవసాయ అభివృద్దిలో కృషితో పాటు పాడి పశు గణాభివృద్ది కోసం పాటుపడాలి. అధే విధంగా గోవధను నిషేదించాలి .
  • యూనిఫార్మ్ సివిల్ కోడ్ :ఆర్టికల్ 44 భారత ప్రజలందరికీ ఒకే విధంగా వర్తించే కామన్ సివిల్ కోడ్ ఏర్పాటు చేయాలి. కామన్ సివిల్ కోడ్ గల ఏకైక రాష్ట్రం గోవా, యూనిఫామ్ సివిల్ కోడ్ పై చట్టం చేసిన భారతదేశ ఏకైక రాష్ట్రం ఉత్తరాఖండ్ ఇటీవల 2024 ఫిబ్రవరిలో చేసింది

Question: 8

భారత రాజ్యాంగానికి సంబంధించి కింది సంఘటనల కాలక్రమాను సారం (మొదటి నుండి చివరి వరకు) ఏమిటి?
ఎ. ప్రవేశికను సవరించారు.
బి. ఆర్టికల్ 21ఎ భారత రాజ్యాంగంలో చేర్చబడింది.
సి. ఓటు వేసే వయస్సును 21 నుంచి 18కి తగ్గించారు.
ఎంపికలు :

  1. ఎ, సి, బి
  2. ఎ, బి, సి
  3. సి, బి, ఎ
  4. బి, ఎ, సి
View Answer

Answer: 1

ఎ, సి, బి

Explanation: 

  • రాజ్యాంగ ప్రవేశికను నేటివరకు ఒక్కసారి ( స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు 1976వ సం॥రంలో 42వ సవరణ ద్వారా – ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు) మాత్రమే సవరించారు. దీని ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే 3 పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చారు. ఇది ప్రవేశికకు చేసిన మొట్టమొదటి మరియు చివరి సవరణ
  • 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002 లో ఆర్టికల్ 21 ఎ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చడంతో 6 నుండి 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని తెలుపుతున్నది
  • 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988 ద్వారా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలలో ఓటు హక్కు వయోపరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు

Question: 9

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కొన్ని హక్కులకు రక్షణ అందిస్తుంది. అయితే కింది వాటిలో ఏది చేర్చబడింది?

ఎ. వాక్ మరియు భావప్రకటన స్వేచ్ఛ.
బి. సంఘాలు లేదా కూటములను ఏర్పాటు చేయడం

సి. సమ్మె మరియు లాకౌట్ నిర్వహించడానికి.
ఎంపికలు :

  1. ఎ మాత్రమే
  2. ఎ మరియు బి మాత్రమే
  3. బి మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 2

ఎ మరియు బి మాత్రమే

Explanation: 

  • భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఆరు హక్కులకు రక్షణ అందిస్తుంది
  • స్వేచ్ఛాహక్కు/స్వాతంత్ర్యపు హక్కు (19 నుండి22) ప్రజాస్వామ్యానికి పునాది స్వేచ్ఛ.రాజ్యాంగ ప్రవేశికలో “ఆలోచనలో భావ ప్రకటన, నమ్మకం, విశ్వాసం, ఆరాధన (Liberty of thought expression, belief, faith and worship)” స్తంభానికి ప్రతీక.
  • 19 వ ప్రకరణ 7 రకాల స్వేచ్ఛలను ప్రసాదిస్తుంది.అయితే ఆస్తికి సంబంధించిన 19(1) ఎఫ్ ని 44వ రాజ్యాంగ సవరణ (1978) ద్వారా తొలగించారు.
  • ఇప్పుడు 6 రకాల స్వేచ్ఛలు ఉన్నాయి.
    • 19(1-ఎ) : వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ, అభి ప్రాయ ప్రకటన.
    • 19 (1-బి) : శాంతియుత నిరాయుధ సమావేశం
    • 19 (1-సి) : సంస్థలను ఏర్పాటు చేసుకోవడం
    • 19 (1-డి) : దేశవ్యాప్త సంచార స్వేచ్ఛ
    • 19 (1-ఇ) : దేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పర్చు కునే స్వేచ్ఛ
    • 19 (1-జి) : వృత్తి, వ్యాపార వాణిజ్య స్వేచ్ఛ
    • 19 (1-ఎఫ్) : తొలగించారు
  • ఈ 6 స్వేచ్ఛలు స్వేచ్ఛా హక్కుకు సోపానాలు. పౌరు లకు పౌర, రాజకీయ స్వేచ్ఛలను ఈ స్వేచ్ఛలు ప్రసా దిస్తాయి. పార్లమెంటరీ ప్రజాస్వామాన్ని ఈ స్వేచ్ఛలు విజయవంతం చేస్తాయి.

Question: 10

భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధులకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
ఎ.వారి వార్డుల పట్ల తల్లిదండ్రులకు ఎటువంటి ప్రాథమిక విధి లేదు.
బి. ప్రస్తుతం 12 ప్రాథమిక విధులు ఉన్నాయి.
ఎంపికలు :

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ & బి రెండూ
  4. ఎ లేదా బి కాదు.
View Answer

Answer: 4

ఎ లేదా బి కాదు.

Explanation:

  • స్వరణ్సింగ్ కమిటీ సిఫారసు మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను 51(ఎ)లో పొందుపర్చారు. వీటిని రష్యా రాజ్యాంగం నుండి గ్రహించి భారత రాజ్యాంగంలో చేర్చారు. వీటికోసం రాజ్యాంగంలో 4(ఎ) భాగాన్ని ప్రత్యేకంగా చేర్చారు.
  • ప్రారంభం (1976)లో 10 ఉండేవి. 2002లో 86వ సవరణ ద్వారా మరొక విధిని చేర్చడం ద్వారా వీటి సంఖ్య 11కు పెరిగింది. ఇవన్న పౌరులకు సంబంధించిన విధులు
Recent Articles