Home  »  TGPSC 2022-23  »  Indian Polity-15

Indian Polity-15 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

30 ఏప్రిల్ 2023 నాటికి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని లోక్ సభ స్థానాలు కేటాయించబడ్డాయి?

  1. 17
  2. 15
  3. 19
  4. 25
View Answer

Answer: 1

17

Explanation

  • లోకసభ స్థానాలు :గరిష్ట సభ్యుల సంఖ్య 552. ప్రస్తుత సభ్యుల సంఖ్య 543, రాష్ట్రాల నుండి 524 కేంద్ర పాలిత నుండి 19.
  • 2001లో 84 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోకసభ నియోజక వర్గాల సంఖ్యను 2026 వరకు మార్చరాదు . 104 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆంగ్లో ఇండియన్లకు రిసర్వ్డ్ సీట్లు నిలిపివేయబడ్డాయి

Question: 12

1971 పార్లమెంటు ఎన్నికలలో, తెలంగాణా ప్రాంతంలో తెలంగాణ ప్రజా సమితి ఎన్ని లోక్ సభ స్థానాలను గెలుచుకుంది?

  1. 10
  2. 8
  3. 12
  4. 14
View Answer

Answer: 1

10

Explanation

  • తెలంగాణ ప్రజా సమితి 1969 లో ఆనంతుల మదన్ మోహన్ ఏర్పాటు చేశారు
  • 1971 మార్చిలో ఇందిరాగాంధీ లోక్సభను రద్దుచేసి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించింది.
  • 1971 మార్చి 5 న ఆంధ్రప్రదేశ్లో జరిగిన లోక్సభ మధ్యంతర ఎన్నికలలో చెన్నారెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజాసమితి (టి.పి.ఎస్) ‘సల్కెపార‘ గుర్తుపై ఒంటరిగా పోటీచేసింది.
  • ఇందిరా కాంగ్రెస్ ‘ఆవు-దూడ’ గుర్తుతో పోటీచేసింది.
  • 1971 పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ప్రజాసమితి తెలంగాణలోని 14 లోక్ సభ స్థానాలలో 10 లోక్ సభ స్థానాలను గెలుపొందింది (47.5 శాతం ఓట్లను సాధించింది)

Question: 13

2018 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడంతో తెలంగాణ అసెంబ్లీకి చెందిన ఏ మంత్రి భారతదేశంలోని ఏ శాసనసభలోనైనా ఆరుసార్లు గెలిచిన అతి పిన్న వయస్కుడయ్యారు?

  1. CAL ఇంద్రకరణ్ రెడ్డి
  2. వి.శ్రీనివాస్ గౌడ్
  3. టి హరీష్ రావు
  4. గుంటకండ్ల జగదీష్ రెడ్డి
View Answer

Answer: 3

టి హరీష్ రావు

Explanation:

  • హరీష్ రావు సిద్దిపేట అసెంబ్లీ నియవజక వర్గం నుండి వరుసగా 2004 నుండి 2023 వరకు (ఉప ఎన్నికలతో)7 సార్లు ఎన్నికయ్యారు . ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో మొదటి నీటి పారుదల శాఖ మంత్రిగా కొనసాగారు

Question: 14

తెలంగాణ రాష్ట్రంలో మొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?

  1. జనవరి 2011
  2. మార్చి 2012
  3. ఆగస్టు 2013
  4. ఏప్రిల్ 2014
View Answer

Answer: 4

ఏప్రిల్ 2014

Explanation:

  • 2014 ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర మొదటి ప్రభుత్వం
  • 2014 ఏప్రిల్ 30 న తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర శాసనసభ, లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 78% పోలింగ్ నమోదయ్యింది.
  • అత్యధిక పోలింగ్ నిజామాబాద్ జిల్లాలో నమోదవగా, హైదరాబాద్ లో అత్యల్ప పోలింగ్ నమోదయింది. ఈ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు
    • TRS-63
    • CONGRESS-21
    • TDP-15
    • MIM-7
    • BJP-5
    • YSRCONGRESS-3
    • OTHERS-5

Question: 15

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడాన్ని భారత ఎన్నికల సంఘం 2022లో ఏ నెలలో ఆమోదించింది?

  1. మార్చి
  2. ఆగస్ట్
  3. జూలై
  4. డిసెంబర్
View Answer

Answer: 4

డిసెంబర్

Explanation:

  • తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడాన్ని భారత ఎన్నికల సంఘం 2022 DECEMBER ఆమోదం తెలిపింది
  • 2001 ఏప్రిల్ 27 న హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోని కొండాలక్ష్మణ్ బాపూజీ గారి నివాసం జలదృశ్యంలో సమావేశమై తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్) పార్టీని ఏర్పాటుచేస్తునట్లు KCR ప్రకటించాడు.
Recent Articles