Home  »  TGPSC 2022-23  »  Indian Polity-16

Indian Polity-16 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది వారిలో ఎవరు మొదటి సారి భారత ప్రధాని అయినప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు?

  1. జవహర్లాల్ నెహ్రూ
  2. ఇందిరా గాంధీ
  3. అటల్ బిహారీ వాజ్పేయి
  4. నరేంద్ర మోదీ
View Answer

Answer: 2

ఇందిరా గాంధీ

Explanation:

భారతదేశ ప్రధానులు అయిన రాజ్యసభ సభ్యులు

  • శ్రీమతి ఇందిరాగాంధీ
  • H.D.  దేవెగౌడ
  • I.K.  గుజ్రాల్
  • D.R. మన్మోహన్ సింగ్

Question: 7

సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం, ప్రతి పబ్లిక్ అథారిటీ కింది వేటిని ప్రచురించాలి:
ఎ. దాని సంస్థ, విధులు మరియు విధుల వివరాలు.
బి.దాని అధికారులు మరియు ఉద్యోగుల అధికారాలు మరియు విధులు.

సి. దాని విధులను నిర్వర్తించడానికి దానిచే సెట్ చేయబడిన నిబంధనలు.
డి. ప్రతి ఒక్కరికి నెలవారీ వేతనంతో పాటు దాని అధికారులు మరియు ఉద్యోగుల డైరెక్టరీ.  సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ, బి, సి మరియు డి
View Answer

Answer: 4

ఎ, బి, సి మరియు డి

Explanation:

సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12 నుండి అమలులోకి వచ్చింది

  • 1996లో జస్టిన్ B. సావంత్ నేతృత్వంలోని, 1997లో NIRD ‘స్టడీ టీం’లు సమర్పించిన నివేదికల ఆధారంగా సమాచార స్వేచ్ఛ చట్టాన్ని రూపొందించారు.
  • ప్రభుత్వ సాధారణ పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాలపై ప్రజానీకానికి సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని ఈ చట్టం తెలియజేస్తున్నది.
  • సమాచారాన్ని ప్రజలు కోరటానికంటే ముందే ప్రజలకు తెలపాలి. సాధ్యం కాని సందర్భంలో కోరిన వెంటనే తెలపాలి.
  • భారతదేశం మొత్తానికి వర్తించే సమాచార హక్కు చట్టం జమ్మూ & కాశ్మీర్ కు మాత్రం వర్తించదు

Question: 8

భారత ఎన్నికల సంఘం ఏ సాధారణ ఎన్నికలలో బ్రెయిలీ ఓటర్ స్లిప్ లను ప్రవేశపెట్టింది ?

  1. 2004 సాధారణ ఎన్నికలు
  2. 2009 సాధారణ ఎన్నికలు
  3. 2014 సాధారణ ఎన్నికలు
  4. 2019 సాధారణ ఎన్నికలు
View Answer

Answer: 4

2019 సాధారణ ఎన్నికలు

Explanation:

  • భారత రాజ్యాంగంలో 15 వ భాగం లో ఆర్టికల్ 324-329 లోఎన్నికల కమిషన్ గురించి పేర్కొన్నారు
  • ఎన్నికల కమిషన్ 1950 జనవరి 25 నుండి పనిచేయడం ఆరంబించింది . ప్రతీ సంవత్సరం జనవరి 25 ను జాతీయ వోటర్ల దినోత్సవం గా జరుపుకుంటారు

Question: 9

కింది వాటిలో యూనియన్ జాబితాలోని అంశం కానిది ఏది?

  1. రైల్వేలు
  2. బ్యాంకింగ్
  3. అడవులు
  4. చమురు వనరులు
View Answer

Answer: 3

అడవులు

Explanation:

  • రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల గురించి 7 వ షెడ్యూల్లో ,11,12,13, భాగం లో పేర్కొన్నారు
  • ప్రస్తుతం కేంద్ర జాబితా లో 98, రాష్ట్ర జాబితాలో 59 ,ఉమ్మడి జాబితాలో 52 అంశాలు కలవు 1976 లో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య, అడవులు ,తునికలు కొలతలు, న్యాయ వ్యవహారాలు, జనాభా నియంత్రణ ఉమ్మడి జాబితా లోకి చేర్చారు

Question: 10

రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలకు సంబంధించి కింది ప్రకటనలలో సరికానిది ఏది?

  1. ఆదేశిక సూత్రాలు సూచనల యొక్క సాధనాలు
  2. ఆదేశిక సూత్రాలు సామాజిక న్యాయం యొక్క తత్వశాస్త్రాన్ని ఏర్పరుస్తాయి
  3. ఆదేశిక సూత్రాలు చట్టబద్ధంగా అమలు చేయదగిన విధంగా ఉంటాయి
  4. ఆదేశిక సూత్రాలు భారతదేశ శాసనసభ్యుల ముందు ఒక ఆదర్శాన్ని ఉంచుతాయి
View Answer

Answer: 3

ఆదేశిక సూత్రాలు చట్టబద్ధంగా అమలు చేయదగిన విధంగా ఉంటాయి

Explanation:

  • రాజ్యాంగంలో 4 వ భాగంలో ఆదేశిక సూత్రాలను ఆర్టికల్ 36-51 లో పొందుపరిచారు.
  • వీటిని దేశంలోని రాజకీయ ప్రజాస్వామ్యానికి అవసరమైన సాంఘిక, ఆర్థిక పునాది ని ఏర్పరిచేందుకు ఉద్దేశించారు.
  • ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ ఉండదు. వీటి అమలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది.
Recent Articles