Home  »  TGPSC 2022-23  »  Indian Polity-2

Indian Polity-2 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ స్వతంత్ర అధికారంగా పబ్లిక్ రికార్డ్ ఆఫీస్ ల స్థాపన కోసం కింది వాటిలో ఏది సిఫార్సు చేయబడింది?

  1. గిరీష్ రామచంద్ర దేశ్పాండే వర్సెస్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు
  2. సుపరిపాలనపై నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్
  3. రెండవ పరిపాలనా సంస్కరణల కమిషన్
  4. సమాచార హక్కుపై పార్లమెంటరీ జాయింట్ వర్కింగ్ గ్రూప్
View Answer

Answer: 3

రెండవ పరిపాలనా సంస్కరణల కమిషన్

Explanation:

  • స్వతంత్ర అధికారం గల పబ్లిక్ రికార్డు ఆఫీసులను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొల్పాలని రెండవ పరిపాలన సంస్కరణల కమీషన్ సూచించింది. Record Keeping (రికార్డు భద్రపరచడం)లో నిమగ్నమై ఉన్న వివిధ ఏజెన్సీలను ఏకీకృతం చేసి ఈ పబ్లిక్ రికార్డు ఆఫీసులను నిర్మించాలని తెలిపింది.
  • 2nd Administrative Reforms Commission (2వ రెండవ పరిపాలన సంస్కరణల కమీషన్): ప్రజా పరిపాలన వ్యవస్థలను సంస్కరించడానికి ఒక వివరణాత్మక నమూనా (రిపోర్ట్) తయారు చేయడానికి ఇది ఏర్పరిచారు. ఇది 2005లో వీరప్ప మొయిలీ నేతృత్వంలో ఏర్పడింది. దీనిలో సభ్యులు V రామచంద్రన్ ( మొయిలీ రాజీనామా తర్వాత చైర్మన్ గా వ్యవహరించారు) , AP ముఖర్జీ, AH కల్రో, వినీత రాయ్, జయప్రకాష్ నారాయణ.
  • జయప్రకాష్ నారాయణ తెలుగు వారు. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు.

Question: 12

డెవలప్ మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ (DMEO) __ యొక్క లక్ష్యాలు ఏమిటి?
ఎ. డేటా ఇన్ఫర్మేటిక్స్ యొక్క కేంద్రీకృత డిపాజిటరీని అభివృద్ధి చేయడం

బి. డేటా ఆధారిత విధాన రూపకల్పనను ప్రారంభించడం

సి.పనితీరు కొలమానాల యొక్క కఠినమైన ట్రాకింగ్ను సంస్థాగతీ కరించడం
డి. మొత్తం పర్యావరణ వ్యవస్థను ప్రధాన స్రవంతి కఠినమైన ఫలితాల పర్యవేక్షణ మరియు మూల్యాంకనానికి బలోపేతం చేయడం

సరైన జవాబుని ఎంచుకోండి :

  1. ఎ, బి మరియు సి మాత్రమే
  2. ఎ, సి మరియు డి మాత్రమే
  3. బి మరియు డి మాత్రమే .
  4. బి, సి మరియు డి మాత్రమే
View Answer

Answer: 4

బి, సి మరియు డి మాత్రమే

Explanation:

  • Development Monitoring and Evaluation Office(DMEO) :
  • కార్యక్రమ మూల్యాంకన కార్యాలయం(Program Evaluation Office) మరియు స్వతంత్ర మూల్యాంకన కార్యాలయం (Independent Evaluation Office) రెండిటినీ కలిపి 2015లో అభివృద్ధి పర్యవేక్షణ మరియు మూల్యాంకన కార్యాలయం( Development Monitoring and Evaluation Office) ఏర్పాటు చేశారు . ఇది నీతి ఆయోగ్ పర్యవేక్షణలో పనిచేస్తుంది.
  • భారత ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను నిశితంగా పర్యవేక్షించడం, మూల్యాంకనం చేయడం మరియు వాటి అమలును బలోపేతం చేయడమే DMEO ప్రధాన విధి.
  • DMEO సమావేశాలు మొన్నటివరకు వర్చువల్ గా జరిగాయి. మొట్టమొదటి వ్యక్తిగత (ఇన్ పర్సన్) DMEO కాన్ఫరెన్స్ ఇటీవల మే 2 – 3, 2024 మధ్య జరిగింది.

Question: 13

చట్టం చేసిన సంవత్సరానికి సంబంధించి కింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలేదు?

  1. 2005 : సమాచార హక్కు చట్టం
  2. 2005 : MGNREG చట్టం
  3. 2009 : RTE చట్టం
  4. 2012 : జాతీయ ఆహార భద్రతా చట్టం
View Answer

Answer: 4

2012 : జాతీయ ఆహార భద్రతా చట్టం

Explanation:

  1. సమాచార హక్కు ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో చేర్చబడలేదు అయినప్పటికీ అశ్వానికుమార్ సింగ్ ,2020 కేసులో సమాచార హక్కు ప్రాథమిక హక్కుగా సుప్రీం కోర్టు చే స్థిరీకరించబడింది.
  2. సమాచార హక్కు చట్టం 2005 లో అమలులోకి వచ్చింది.
  3. MGNREG (Mahathma Gandhi National Rural Employment Guarantee) act, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం , 2005 లో చేయబడింది.
  4. పార్లమెంట్ 2009 లో RTE చట్టం చేసింది
  5. జాతీయ ఆహార భద్రత చట్టం 2013 లో చేయబడింది

Question: 14

ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
ఎ. రాజ్యాంగ బాధ్యతలను న్యాయంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వర్తించగలిగేలా, గవర్నర్ పై రాజ్యాంగం కల్పించని పదవులు మరియు అధికారాలతో భారం పడకూడదు.

బి. గవర్నర్ ను విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ చేయడం మరియు అతనికి/ఆమెకు చారిత్రాత్మకంగా కొంత ఔచిత్యాన్ని కలిగి ఉండే అధికారాలను అప్పగించడం కాలం మరియు పరిస్థితులు మార్పుతో ఆగిపోయింది.
పైన పేర్కొన్నవి క్రింది ఏ సిఫార్సులలో భాగం:

  1. జస్టిస్ MM పుంఛీ కమిషన్
  2. కొఠారీ కమిషన్
  3. కొత్త విద్యా విధానం- 2020 కమిషన్
  4. నేషనల్ నాలెడ్జ్  
View Answer

Answer: 1

జస్టిస్ MM పుంఛీ కమిషన్

Explanation:

  • జస్టిస్ M M పుంఛీ కమీషన్జ
  • స్టిస్ M M పుంఛీ కమీషన్ ను మాజీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ మోహన్ పుంఛీ (M M పుంఛీ) సారథ్యంలో 2007 లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
  • ఈ కమిషన్ గవర్నర్ తనకు రాజ్యాంగం ద్వారా కల్పించబడిన అధికారాలను వాటిని నిష్పాక్షికంగా అమలుపరిచేలా వ్యవహరించేందుకు రాజ్యాంగం కల్పించని అదనపు భారాలు (ఉదా : విశ్వవిద్యాలయ కులపతి( చాన్సలర్) పదవి ) అడ్డురాకూడదని రిపోర్టులో తెలిపింది. ఈ కమీషన్ 2010లో రిపోర్ట్ కేంద్రానికి సమర్పించింది.

Question: 15

TSR సుబ్రమణియన్ కమిటీ (2014) ఈ క్రింది వాటిలో దేనితోసంబంధం కలిగి ఉంది?

  1. అంతర్గత మరియు బాహ్య ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత ప్రయత్నాలు
  2. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ యొక్క ప్రక్రియలు, చట్టాలు మరియు చర్యలనుసమీక్షించండి
  3. ముస్లిం వివాహ చట్టం రద్దు
  4. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క ప్రక్రియ, చట్టాలు మరియు చర్యలను సమీక్షించడం
View Answer

Answer: 2

పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ యొక్క ప్రక్రియలు, చట్టాలు మరియు చర్యలనుసమీక్షించండి

Explanation:

  • పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ యొక్క ప్రక్రియలు మరియు చట్టాలను సమీక్షించడానికి TSR సుబ్రమణియన్ కమిటీ ఏర్పాటు చేయబడింది.
  • పర్యావరణం, అడవులు & వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడే కింది చట్టాలను సమీక్షించడానికి ఈ ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం నియమించింది.
  1. పర్యావరణ (రక్షణ) చట్టం, 1986
  2. అటవీ (సంరక్షణ) చట్టం, 1980
  3. వన్యప్రాణి (రక్షణ) చట్టం, 1972
  4. నీరు (కాలుష్య నివారణ మరియు నియంత్రణ) చట్టం, 1974
  5. గాలి (కాలుష్య నివారణ మరియు నియంత్రణ) చట్టం, 1981
  • TSR సుబ్రమణియన్ కమిటీ కూర్పు:
  1. శ్రీ. టి.ఎస్.ఆర్. సుబ్రమణియన్, చైర్మన్
  2. శ్రీ విశ్వనాథ్ ఆనంద్, సభ్యుడు
  3. జస్టిస్ (రిటైర్డ్) శ్రీ ఎ.కె. శ్రీవాస్తవ్, సభ్యుడు
  4. శ్రీ కె.ఎన్. భట్, సభ్యుడు
Recent Articles