Home  »  TGPSC 2022-23  »  Indian Polity-2

Indian Polity-2 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
ఎ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ఆర్థిక అత్యవసర ప్రకటనతో వ్యవహరిస్తుంది.
బి. ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే సమయంలో, యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య పన్నుల విభజనకు సంబంధించిన నిబంధనను రాష్ట్రపతి నిలిపివేయవచ్చు.
పై వాక్యాలలో ఏది సరైనది?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఏదికాదు
View Answer

Answer: 2

బి మాత్రమే

Explanation:

  • ఆర్టికల్ 356 రాష్ట్ర అత్యవసర పరిస్థితి దృష్ట్యా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపు ను సూచిస్తుంది.
  • భారత ఆర్థిక అత్యవసర పరిస్థితిని సూచించే అధికరణ ఆర్టికల్ 360.
  • కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల విభజనను మార్చే అధికారం రాష్ట్రపతికి కలదు (ఈ అధికారం అత్యవసర పరిస్థితిలో మాత్రమే వర్తిస్తుంది).అంటే కేంద్రం నుండి రాష్ట్రాలకు వెళ్ళే వాటాలను తగ్గించవచ్చు లేదా పూర్తిగా నిలిపివేయొచ్చు.

Question: 17

ఈ క్రింది వాటిని పరిశీలించండి:
ఎ.సాధారణ నిర్ణయానికి సంపద కేంద్రీకరణను నిరోధించడం

బి. దోపిడీకి వ్యతిరేకంగా బాల్యం మరియు యువత రక్షణ

సి. పౌరులందరికీ జీవనోపాధికి తగిన మార్గాలు
డి. ఉమ్మడి ప్రయోజనం కోసం సంఘం యొక్క భౌతిక వనరుల సరైన పంపిణీ
పైన పేర్కొన్న అంశాలు ఇందులో భాగంగా ఉన్నాయి:

  1. రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కులు
  2. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు
  3. రాజ్యాంగం యొక్క రాష్ట్ర జాబితా
  4. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్
View Answer

Answer: 2

రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు

Explanation:

  • ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్స్ 36 నుండి 51 మధ్య ఉన్నాయి.
  • ఆర్టికల్ 37 : ఈ భాగంలో కలిగియున్న అధికరణల అనువర్తనం
  • ఆర్టికల్ 39 : రాజ్యం అనుసరించవలసిన కొన్ని విధాన అధికరణలు
  • అ . ఉమ్మడి ప్రయోజనం కొరకు వనరుల సమాన పంపిణీ
  • ఆ .  సంపద కేంద్రీకరణను నిరోధించడం
  • ఆర్టికల్ 39A : సమన్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం
  • ఆర్టికల్ 51 : అంతర్జాతీయ శాంతి మరియు భద్రతల పెంపుదల

Question: 18

ఈ క్రింది వారిలో ఎవరు తమ కార్యాలయం యొక్క అధికారాలు మరియు విధుల యొక్క ఉపయోగం మరియు పనితీరు కొరకు ఏ న్యాయస్థానానికి జవాబుదారీగా ఉండరు?

ఎ. రాష్ట్రపతి.

బి. ప్రధానమంత్రి

సి. న్యాయ మంత్రి

డి. ఒక రాష్ట్ర గవర్నర్

సరైన జవాబుని ఎంచుకోండి :

  1. ఎ, బి మరియు సి మాత్రమే.  
  2. ఎ మరియు బి మాత్రమే  
  3. ఎ మరియు డి మాత్రమే
  4. ఎ, బి మరియు డి మాత్రమే
View Answer

Answer: 3

ఎ మరియు డి మాత్రమే

Explanation:

  • రాష్ట్రపతి మరియు రాష్ట్ర గవర్నర్ లు తమ తమ కార్యాలయాల అధికారాలు మరియు విధులు అమలు చేయడం లేదా అమలు చేయడంలో భాగంగా తీసుకున్న చర్యల విషయంలో అతడు/ఆమె (రాష్ట్రపతి/గవర్నర్) ఏ న్యాయస్థానానికి జవాబుదారీగా ఉండరు. ఈ నిబంధన ఆర్టికల్ 361లో పొందుపరిచారు.

Question: 19

శాసన మండలుకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి

ఎ. కౌన్సిల్ శాశ్వత సభ మరియు మూడింట ఒక వంతు సభ్యులు రెండేళ్లలో పదవీ విరమణ చేస్తారు.
బి. స్థానిక సంస్థల సభ్యులు శాసన మండలి మొత్తం సభ్యుల సంఖ్యలో మూడింట ఒక వంతు మందిని ఎన్నుకుంటారు.
సి. రాష్ట్రంలో నివశిస్తున్న మూడు సంవత్సరాల గ్రాడ్యుయేట్లతో కూడిన ఓటర్ల ద్వారా పన్నెండవ వంతు మంది ఎన్నుకోబడతారు.

పై వాక్యాలలో ఏది సరైనది?

  1. ఎ, బి మరియు సి
  2. ఎ మరియు బి మాత్రమే  
  3. ఎ మరియు సి మాత్రమే  
  4. బి మరియు సి మాత్రమే
View Answer

Answer: 1

ఎ, బి మరియు సి

Explanation:

  • రాజ్యసభ లాగే శాసన మండలి కూడా శాశ్వత సభ. ఇది రద్దు కాబడదు. శాసన మండలి సభ్యుల పదవీ కాలం 6 సం,,లు.
  • ప్రతి రెండేళ్లకోసారి 1/3వ వంతు సభ్యులు పదవి విరమణ చేస్తారు.
  • మండలి సభ్యుల ఎన్నిక పద్ధతి:
  1. 1/3 వ వంతు సభ్యులను శాసనసభ్యులు ఎన్నుకుంటారు
  2. 1/3 వ వంతు సభ్యులను స్థానిక సంస్థల సభ్యులు ఎన్నుకుంటారు.
  3. 1/12వ వంతు సభ్యులను ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు
  4. 1/12 వ వంతు సభ్యులను పట్టభద్రులు ఎన్నుకుంటారు.
  5. మిగిలిన వంతు వారిని రాష్ట్ర గవర్నర్ వివిధ రంగాల్లో (సాహిత్యం, సైన్స్, సామాజిక సేవా) విశేష సేవ అందించినవారిని నియమిస్తారు.

Question: 20

‘ఆపరేషన్ బ్లూ స్టార్’కు సంబంధించి ఈ క్రింది వాటినిపరిశిలించండి:

ఎ. ఇది భారత సైన్యం చేపట్టిన అతిపెద్ద అంతర్గత భద్రతా మిషన్.

బి.హర్మందిర్ సాహీబ్ కాంప్లెక్స్ లో ఆయుధాలను పోగుచేసుకుంటున్న సిక్కు తీవ్రవాదులను తొలగించడం దీని లక్ష్యం.
సి. ఆపరేషన్ బ్లూ స్టార్ 1985 జూలై 1 మరియు 8 మధ్య అమృత్సర్ లో జరిగింది.

పై వాక్యాలలో ఏది సరైనది?

  1. ఎ మరియు బి మాత్రమే
  2. ఎ, బి మరియు సి
  3. బి మరియు సి మాత్రమే
  4. బి మాత్రమే
View Answer

Answer: 1

ఎ మరియు బి మాత్రమే

Explanation: 

  • ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది అరెస్టు నుండి తప్పించుకోవడానికి హర్మందిర్ సాహిబ్ కాంప్లెక్స్( స్వర్ణ దేవాలయం)లో ఆశ్రయం పొందుతున్న జర్ణయిల్ సింగ్ బింద్రన్ వాలే మరియు అతని సహచర సిక్కు తీవ్రవాదులను ఆ దేవాలయం నుండి బయటకు రప్పించడానికి భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్.
Recent Articles