Home  »  TGPSC 2022-23  »  Indian Polity-3

Indian Polity-3 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

పౌరులకు హామీ ఇవ్వబడిన వాక్ స్వాతంత్ర్యం మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పరిమితం చేయగల ఆర్టికల్ 19 కింద ఈ క్రింది వాటిలో ప్రాతిపదిక కానిది ఏది?

  1. నేరాన్ని ప్రేరేపించడం
  2. కోర్టు ధిక్కరణ
  3. విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు
  4. దేశద్రోహం/రాజద్రోహం
View Answer

Answer: 4

దేశద్రోహం/రాజద్రోహం

Explanation:

వాక్ స్వాతంత్ర్యం మీద పరిమితులు :

  • వాక్ స్వాతంత్ర్యం సంపూర్ణమైనది కాదు. ఆర్టికల్ 19(2) వాక్ స్వాతంత్ర్యం మరియు భావప్రకటనా స్వేచ్ఛపై పరిమితులను విధించింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆంక్షలు విధింపబడ్డాయి.
  • ఈ కింది విషయాల కోణంలో వాక్ స్వాతంత్ర్యం మీద పరిమితులున్నాయి.
  1. భద్రత
  2. దేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రత
  3. విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు
  4. పబ్లిక్ ఆర్డర్
  5. మర్యాద లేదా నైతికత
  6. ద్వేషపూరిత ప్రసంగం
  7. పరువు నష్టం
  8. న్యాయస్థాన దిక్కరణ
  • దుర్వినియోగపరచరన్న దృఢ సంకల్పం దృష్ట్యా భారత రాజ్యాంగం పౌరులందరికి వాక్ స్వాతంత్ర్యం మరియు భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించింది. అయితే వాటిని జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలి.

Question: 7

సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఏర్పడిన ఇబ్బందులను అధిగమించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 కి క్లాజ్ 4 ఎందుకు జోడించబడింది ?

  1. మద్రాస్ రాష్ట్రం VS చంపకం దొరైరాజన్
  2. ఇంద్ర సాహ్నీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా
  3. రామ్ సింగ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా
  4. MR బాలాజీ Vs స్టేట్ ఆఫ్ మైసూర్
View Answer

Answer: 1

మద్రాస్ రాష్ట్రం VS చంపకం దొరైరాజన్

Explanation:

  • న్యాయబద్ధత కలిగిన ప్రాథమిక హక్కులు,  న్యాయబద్ధత లేని ఆదేశిక సూత్రాలు ఒక వైపు,  ఆదేశిక సూత్రాలను అమలుపరచాలన్న రాష్ట్రాల నైతిక బాధ్యత(అధికరణ 37) మరో వైపు , ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య వైరుధ్యం తలెత్తేలా చేశాయి. ఇది రాజ్యాంగం అమలు మొదలయినప్పటి నుండి సమస్యగా పరిణమించింది.
  • చంపకం దొరైరాజన్ vs మద్రాస్ రాష్ట్రం (1951) కేసులో  ఏదైనా సంధర్భంలో ప్రాధమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య వైరుధ్యం వస్తే, ప్రాధమిక హక్కులే ప్రబలంగా ఉంటాయని తీర్పిచ్చింది.

అధికరణ 15(4) :

  • సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పౌరులు లేదా షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల అభ్యున్నతి కోసం ప్రత్యేక ఏర్పాటు చేయకుండా రాష్ట్రాన్ని ఈ అధికరణలోని ( ఆర్టికల్ 15(1), 15(2), 15(3)) లేదా అధికరణ 29(2) లోని ఏ అంశము నిరోధించదు.

Question: 8

జాబితా-1లోని కింది రాజ్యాంగ సవరణలను జాబితా -2లో ప్రభావితం చేసే సంబంధిత ప్రాథమిక హక్కులతో సరిపోల్చండి.
జాబితా 1
ఎ. మొదటి సవరణ
బి. 86వ సవరణ
సి. 97వ సవరణ
డి. 77వ సవరణ
జాబితా – 2
1. విద్యా హక్కు

2. అసోసియేషన్ ఫ్రీడమ్
3. పదోన్నతుల్లో ఎస్సీ & ఎస్టీ ఉద్యోగులకు రిజర్వేషన్లు
4. వాక్ స్వాతంత్రం

5. సమానత్వం హక్కు

  1. ఎ-1, బి-3, సి-2, డి-5
  2. ఎ-4, బి-1, సి-2, డి-3
  3. ఎ-5, బి-1, సి-2, డి-3
  4. ఎ-2, బి-1, సి-5, డి-3
View Answer

Answer: 2

ఎ-4, బి-1, సి-2, డి-3

Explanation:

మొదటి రాజ్యాంగ సవరణ చట్టం, 1951 :

  1. సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం ప్రత్యేక నిబంధనలు తయారుచేయడానికి రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వబడ్డాయి.
  2. 9వ షెడ్యూల్లోని భూములను న్యాయ సమీక్ష నుండి రక్షించడానికి 9వ షెడ్యూల్ రాజ్యాంగంలో చేర్చబడింది.
  3. వాక్ స్వాతంత్ర్యానికి మరియు భావ వ్యక్తీకరణకు ఆంక్షలు ( బయటి దేశాలతో సామరస్య సంబంధాలు, నేర ప్రేరేపణ(abetment to an offence), పౌర భద్రత వంటి అంశాల పేరు మీద ఆంక్షలు)
  • ఈ ఆంక్షలు లేదా నియంత్రణలు సహేతుక (reasonable) అనే పదం చేర్చడం ద్వారా న్యాయబద్ధం చేయబడ్డాయి.

77వ రాజ్యాంగ సవరణ చట్టం, 1995 :

  1. ఈ సవరణ ద్వారా SC మరియు STలకు ప్రభుత్వ ఉద్యోగాలలో పదోన్నతుల (Promotion) కొరకు రిజర్వేషన్లు కల్పించారు.

86వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002 :

  1. ఆర్టికల్ 21(A) ను చేర్చి 6-14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలందరికీ విద్యాహక్కును ప్రాథమికహక్కుగా చేసింది.
  2. ఆర్టికల్ 51- A లో మరొక ప్రాథమిక విధిని చేర్చింది. అది “6 నుండి 14 సం,, ల మధ్య వయసు గల తన బిడ్డకు లేదా బాలలకు విద్య కోసం అవకాశాలను కల్పించడం తల్లితండ్రులు లేదా సంరక్షకులుగా ఉన్న ప్రతి భారతీయ పౌరుడి విధి”.
  1. ఆదేశిక సూత్రాలలో గల ఆర్టికల్ 45 లోని ఒక విషయాన్ని కూడా మార్చింది.

97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011 :

  1. సహకార సంఘాలను ఏర్పరచుకోవడం ఒక ప్రాథమిక హక్కుగా చేయబడింది.
  2. సహకార సంఘాల ఉన్నతి కోసం ఒక అధికరణ (ఆర్టికల్ 43B) ఆదేశిక సూత్రాలలో చేర్చబడింది.
  3. కొత్త భాగం – 9B (పార్ట్ – IXB) రాజ్యాంగంలో చేర్చబడింది.( సహకార సంఘాలు – భాగం 9B)

Question: 9

రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ‘రిపబ్లిక్ ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫ్ స్టేట్స్’ అని ప్రకటించింది. దీనికి సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏది ?

  1. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విషయంలో వలె యూనిట్ల మధ్య ఒప్పందం ఫలితంగా యూనియన్ ఆఫ్ ఇండియా ఏర్పడలేదు.
  2. యూనియన్ నుండి విడిపోయే హక్కు రాష్ట్రాలకు ఉంటుంది.
  3. యూనియన్ నుండి విడిపోయే హక్కు రాష్ట్రాలకు లేదు.
  4. భారత రాష్ట్రాల సమాఖ్య పేరు భారత్.
View Answer

Answer: 2

యూనియన్ నుండి విడిపోయే హక్కు రాష్ట్రాలకు ఉంటుంది.

Explanation:

  • రాజ్యాంగంలోని ప్రథమ అధికరణ భారతదేశాన్ని సంయుక్త రాష్ట్రాల కలయికగా అభివర్ణించింది. (India, that is Bharat shall be a union of states)
  • అధికరణ 1 : యూనియన్ పేరు మరియు భూభాగం
  1. ఇండియా , అంటే భారత్ , రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది. ⁠
  2. రాష్ట్రాలు మరియు వాటి భూభాగాలు మొదటి షెడ్యూల్‌లో పేర్కొన్నబడినవి.
  3. భవిష్యత్తులో పొందగలిగే ఇతర భూభాగాలు.
  • రాజ్యాంగ సభ చర్చల సమయంలో కొందరు సభ్యులు అనాదిగా ఉన్న “భారత్” పేరును, కొందరు సభ్యులు ఆధునికమైన “ఇండియా” పేరును సూచించారు. అందుకే రాజ్యాంగంలో మొదటి అధికరణలో రెండు పేర్లను తీసుకున్నారు.
  • మన దేశం యూనియన్ గా అభివర్ణించబడినప్పటికి రాజ్యాంగం సమాఖ్య నిర్మాణాన్ని కలిగి ఉంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు దీని గురించి ఈ కింది విధంగా పేర్కొన్నారు.
  1. రాష్ట్రాల సమాఖ్యగా కన్నా రాష్ట్రాల యూనియన్ గా పేర్కొనబడటానికి కారణం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) వలె రాష్ట్రాల మధ్య ఒప్పందం ఫలితంగా భారత సమాఖ్య ఏర్పడలేదు.
  2. సమాఖ్య నుండి విడిపోవడానికి రాష్ట్రాలకు హక్కు లేదు.

Question: 10

రాజ్యాంగ పీఠికలో కనిపించే ఈ క్రింది పదాల క్రమాన్ని అమర్చండి:
ఎ. లౌకిక

బి. ప్రజాస్వామ్య

సి. గణతంత్ర

డి. సామ్యవాద

ఇ. సార్వభౌమాధికారం

  1. డి, బి, ఎ, ఇ, సి
  2. ఇ, డి, ఎ, బి, సి
  3. ఎ, బి, డి, సి, ఇ
  4. సి, డి, బి, ఎ, ఇ
View Answer

Answer: 2

ఇ, డి, ఎ, బి, సి

Explanation:

  • రాజ్యాంగ ప్రవేశిక  లేదా పీఠిక అనేది రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు ప్రతిబింబం. ఇది రాజ్యాంగానికి ఆత్మ వంటిది. రాజ్యాంగ పీఠికలో పదాల క్రమం సర్వసత్తాక(సార్వభౌమ), సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య మరియు గణతంత్రం.

రాజ్యాంగ పీఠిక :

  • భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ:
  • సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని;
  • ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వాతంత్ర్యాన్ని ;
  • అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి; వారందరిలో
  • వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి;
  • మన ఈ రాజ్యాంగ పరిషత్ లో 1949, నవంబర్ 26వ తేదీని ఎంపిక చేసుకొని, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మనకు మనము సమర్పించుకుంటున్నాము.
Recent Articles