Home  »  TGPSC 2022-23  »  Indian Polity-3

Indian Polity-3 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

మండల్ కమిషన్ ఈ క్రింది మూడు కేటగిరీల కింద వెనుకబాటుతనాన్ని నిర్ణయించడానికి 11 సూచికలను పరిగణనలోకి తీసుకుంది.

  1. సామాజిక, ఆర్ధిక మరియు ఆరోగ్యం.
  2. సామాజిక, విద్య మరియు ఆరోగ్యం.
  3. సామాజిక, ఆర్ధిక మరియు విద్యా-
  4. ఆర్థిక, విద్య మరియు ఆరోగ్య వర్గాలు
View Answer

Answer: 3

సామాజిక, ఆర్ధిక మరియు విద్యా.

Explanation:

  • ఇతర వెనుకబడిన తరగతులను(Other Backward Classes(OBCs) గుర్తించడానికి మండల్ కమిషన్ 11 సూచికలను (ప్రమాణాలను) అభివృద్ధి చేసింది. ఈ ప్రమాణాలు సామాజిక, ఆర్థిక మరియు విద్యాపరంగా వర్గీకరించబడ్డాయి.

వెనుకబడిన తరగతుల కమీషన్ నేపథ్యం :

  • భారతదేశం స్వాతంత్య్రం పొందిన తరువాత ఆర్థికంగా మరియు సామాజికంగా అత్యంత వెనుకబడిన SC & ST లు అనబడుతున్న అణగారిన వర్గాల కోసం నిశ్చయాత్మక చర్యలు తీసుకుంది. అయితే ఇతర వెనుకబడిన తరగతుల కోసం ఎటువంటి ప్రయోజనాలు కల్పించబడలేదు. అప్పటికి వెనుకబడిన తరగతుల జాబితా కూడా లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి 1953లో దత్తాత్రేయ బాలకృష్ణ కలేల్కర్ (కాకా కలేల్కర్) నేతృత్వంలో భారతదేశపు మొట్టమొదటి వెనుకబడిన తరగతుల కమీషన్ నియమించబడింది. ఈ కమషన్ 1955లో రిపోర్టును సమర్పించింది.

కాకా కలేల్కర్ కమీషన్ రిపోర్ట్ సారాంశం :

  • భారతదేశంలో 2399 వెనుకబడిన సమూహాలు ఉన్నాయి. అందులో 837 ‘అత్యంత వెనుకబడినవి’ గా ఈ రిపోర్ట్ పేర్కొంది. వెనుకబాటుకు ప్రధాన కారణం కులమే అని తెలిపింది.
  • కుల రహిత సమాజాన్ని సృష్టించే ప్రయత్నంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం కలేల్కర్ నివేదిక  సిఫార్సులను పూర్తిగా పక్కకుపెట్టింది.
  • ఆ తరువాత 1 జనవరి 1979న అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ఆర్థికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కమిషన్ ను  ఏర్పాటు చేసింది. ఈ కమీషన్ చైర్మన్ గా అప్పటి పార్లమెంటు సభ్యుడు బిందేశ్వరి ప్రసాద్ మండల్ (BP మండల్) వ్యవహరించారు. అందుకే ఈ కమీషన్ మండల్ కమీషన్ గా పేరు గాంచింది.
  • భారతదేశంలో సామాజికంగా లేదా విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించడం మరియు కుల అసమానతలను మరియు వివక్షను పరిష్కరించడానికి రిజర్వేషన్‌లను ఒక సాధనంగా పరిగణించడం ఈ కమీషన్ ప్రధాన కర్తవ్యం. కమిషన్ తన నివేదికను 1980 డిసెంబర్ 31న రాష్ట్రపతికి సమర్పించింది.

కాకా కలేల్కర్ :

  • వీరు స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త మరియు గాంధీగారి ప్రముఖ అనుచరుడు. గాంధీజీ తత్వం మరియు పద్ధతుల వల్ల ప్రభావితుడై ఆయన అనుచరుడై సబర్మతి ఆశ్రమ సభ్యుడు అయ్యారు. ఆశ్రమం నుండి నడపబడే సర్వోదయ పత్రిక సంపాదకుడిగా కొంతకాలం పనిచేశారు. స్వాతంత్రోద్యమ సమయంలో పలు మార్లు జైలుకు వెళ్ళారు. గుజరాతీ, మరాఠీ మరియు హిందీలో ఎన్నో పుస్తకాలు రాశారు. గుజరాతీ రచన “జీవన్ – వ్యవస్థ” కు 1965లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. పద్మవిభూషణ్ పురస్కారం కూడా అందుకున్నారు.

BP మండల్:

  • ఈయన బీహార్ లో ధనవంతులైన కుటుంబంలో జన్మించారు. యాదవ్ (ఉత్తర భారతంలో జాదవ్ ) సామాజిక వర్గానికి చెందినవారు. అతి తక్కువ కాలం (కేవలం నెల రోజులు) బీహార్ ముఖ్యమంత్రి గా పనిచేశారు.

Question: 17

ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్ మెంట్ సర్వీసెస్ స్కీమ్ ఏ వయసు పిల్లల కోసం ఉద్దేశించబడింది,

  1. 1-6 సంవత్సరాలు
  2. 0 – 6 సంవత్సరాలు
  3. 1-10 సంవత్సరాలు
  4. 0- 5 సంవత్సరాలు
View Answer

Answer: 2

0 – 6 సంవత్సరాలు

Explanation:

Integrated Child Development Scheme(ICDS) (సమగ్ర శిశు అభివృద్ధి పథకం) :

  • 1975లో ప్రారంభించబడిన, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీమ్ (ICDS) చిన్నపిల్లలు, గర్భిణులు మరియు బాలింతల పోషకాహార లోపం, ఆరోగ్యం మరియు అభివృద్ధి అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన ఒక ప్రత్యేకమైన బాల్య అభివృద్ధి కార్యక్రమం.

ఈ పథక ప్రధాన లక్ష్యాలు :

  1. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల పోషక మరియు ఆరోగ్య స్థితిని మెరుగుపరచడం.
  2. పిల్లల సరైన మానసిక, శారీరక మరియు సామాజిక అభివృద్ధికి పునాది వేయడం.
  3. పిల్లల అభివృద్ధిని ప్రోత్సహించడానికి వివిధ విభాగాల సమన్వయం సాధించడం.
  4. మరణాలను, వ్యాధిగ్రస్తులను, పోషకాహార లోపం మరియు పాఠశాల మానేయడం వంటి ఘటనలను తగ్గించడం

ICDS అందించు సేవలు :

  • ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ కేంద్ర ప్రాయోజిత పథకం. దీని ద్వారా లబ్ధిదారులకు ఈ క్రింది ఆరు సేవలను అందిస్తుంది:
  1. అనుబంధ పోషకాహార కార్యక్రమం (Supplimentary Nutrition Program)
  2. ఆరోగ్యం & పోషకాహార చెకప్
  3. రోగనిరోధకత
  4. ప్రీ-స్కూల్‌లో పిల్లలకు అనధికారిక విద్య
  5. ఆరోగ్యం మరియు పోషకాహార విద్య
  6. రెఫరల్ సేవలు
  • ఈ ఆరు సేవలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాల నుండి అందించబడతాయి.

Question: 18

నిర్భయ చట్టం ఈ క్రింది చట్టానికి ప్రాచుర్యం పొందిన పేరు.

  1. క్రిమినల్ లా (సవరణ) చట్టం, 2013
  2. అత్యాచార నిరోధక చట్టం, 2011
  3. లైంగిక వేధింపుల నిరోధక చట్టం, 2012
  4. మహిళలపై హింస చట్టం, 2010
View Answer

Answer: 1 

క్రిమినల్ లా (సవరణ) చట్టం, 2013

Explanation:

  • డిసెంబర్ 16, 2012 నాడు దేశ రాజధాని ఢిల్లీలో 22 ఏళ్ల ఫిజియోథెరపీ (పారామెడికల్) విద్యార్థిని అత్యాచారానికి బలైంది. ఈ ఘటన అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను కఠినతరం చేయాలని డిమాండ్లు వచ్చాయి. తదనుగుణంగా, ప్రస్తుతం ఉన్న చట్టాలను సమీక్షించి నిందితులను శిక్షించేందుకు అవసరమైన నూతన చట్టాలను చేసేందుకు కేంద్రప్రభుత్వం డిసెంబర్ 23, 2012న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జగదీష్ శరణ్ వర్మ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది.

వర్మ కమిటీ కూర్పు:

  1. జగదీష్ శరణ్ వర్మ – చైర్మన్
  2. లీల సేథ్ – సభ్యులు
  3. గోపాల్ సుబ్రమణియన్ – సభ్యులు
  • వర్మ కమిటీ 2013, జనవరి 23న రిపోర్ట్ అందించింది. ఆ నివేదిక ఫలితంగానే ప్రభుత్వం నిర్భయ చట్టం ( క్రిమినల్ లా (సవరణ) చట్టం, 2013) ను తయారు చేసింది. ఇది ఫిబ్రవరి 3, 2013 నుండి అమలులోకి వచ్చింది.

Question: 19

కిoది వాటిలోఅభ్యసన వైకల్యానికి నిర్దిష్ట ఉదాహరణ ఏది?

  1. అటెన్షన్ డెఫిసిట్/హైపర్ యాక్టివిటీ డిజార్డర్
  2. మానసిక వైకల్యం
  3. డైస్లెక్సియా
  4. ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్
View Answer

Answer: 3

డైస్లెక్సియా

Explanation:

  • డైస్లెక్సియా అనేది అభ్యాస వైకల్యం. ఇది చదవడం లేదా రాయడంపై ప్రభావం చూపుతుంది. ఇది వ్యక్తి వ్యక్తిని వేర్వేరుగా వివిధ స్థాయిలలో ప్రభావితం చేస్తుంది. దీని వల్ల పదాలను చదవాలో లేదా త్వరగా చదవడంలో, పదాలు రాయడంలో, బిగ్గరగా చదివేటప్పుడు పదాలను ఉచ్చరించడంలో మరియు చదివిన వాటిని అర్థం చేసుకోవడంలో సమస్యలు ఉండవచ్చు.
  • అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) అనేది అసాధారణ స్థాయి హైపర్యాక్టివిటీ మరియు హఠాత్తు ప్రవర్తన(Impulse Behaviour)లకు కారణమయ్యే మానసిక ఆరోగ్యస్థితి. ADHD ఉన్న వ్యక్తులు తమ దృష్టిని ఒకే పనిపై కేంద్రీకరించడంలోను  లేదా ఎక్కువ సేపు నిశ్చలంగా కూర్చోవడంలోను ఇబ్బంది పడతారు.
  • ఆటిజం అనేది ఒక రుగ్మత. పిల్లల అభివృద్ధికి శారీరకంగా, సామాజికంగా, భాషా నైపుణ్యాల పరంగా ఆటంకం కలిగిస్తుంది .

Question: 20

భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారతదేశంలో “బేగార్” మరియు అదే విధమైన బలవంతపు పనిని నిషేధిస్తుంది?

  1. ఆర్టికల్ 43 (1)
  2. ఆర్టికల్ 14(1)
  3. ఆర్టికల్ 15 (1)
  4. ఆర్టికల్ 23 (1)
View Answer

Answer: 4

ఆర్టికల్ 23 (1)

Explanation:

అధికరణ 23 :

  • మానవుల రాకపోకలను నిషేధించడం మరియు బలవంతంగా పని చేయించడం నిషేధం
  1. మనుషులు మరియు బిచ్చగాళ్ళలో (బేగార్)రాకపోకలు, బలవంతపు పని చేయించడం మరియు ఇతర సారూప్యమైన పనులు నిషేధం. ఈ నిబంధన యొక్క ఏదైనా ఉల్లంఘన, చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం.
  2. ప్రజా ప్రయోజనాల కోసం నిర్బంధ సేవను విధించకుండా ఈ అధికరణలోని ఏ అంశం రాష్ట్రాన్ని నిరోధించదు మరియు అటువంటి  నిర్భంధసేవను విధించడంలో రాష్ట్రం మతం, జాతి, కులం లేదా తరగతి లేదా వాటిలో దేని ఆధారంగానైనా వివక్ష చూపదు.

అధికరణ 14 :

  1. చట్టం ముందు సమానత్వాన్ని లేదా భారతదేశ భూభాగంలోని చట్టాల సమాన రక్షణను రాజ్యం(రాష్ట్రం) ఏ వ్యక్తికి నిరాకరించదు.

అధికరణ 15(1) :

  1. మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం లేదా వాటిలో దేని ఆధారంగానైనా ఏ పౌరుడిపైనా రాష్ట్రం వివక్ష చూపకూడదు.

అధికరణ 43 :

  1. కార్మికులకు (వ్యవసాయ, పారిశ్రామిక లేదా ఇతరత్రా కార్మికులు ఎవరైనా) తగిన చట్టం లేదా ఆర్థిక సంస్థ లేదా మరేదైనా విధంగా  పని, జీవన వేతనం, మంచి జీవన ప్రమాణాలు మరియు పూర్తి.
Recent Articles