Home  »  TGPSC 2022-23  »  Indian Polity-4

Indian Polity-4 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

రాజ్యాంగంలోని పదకొండో షెడ్యూలులో పేర్కొన్న అంశాలను పరిష్కరించే అధికారం పంచాయతీరాజ్ సంస్థలకు ఉంది. ఈ క్రిందివి దేనిలో భాగం కాదు:

  1. చిన్న నీటిపారుదల, నీటి నిర్వహణ మరియు వాటర్డ్ అభివృద్ధి
  2. సంప్రదాయేతర ఇంధన వనరులు.
  3. అగ్నిమాపక సేవలు
  4. సాంకేతిక శిక్షణ మరియు వృత్తి విద్య.
View Answer

Answer: 3

అగ్నిమాపక సేవలు

Explanation:

  • భారతదేశంలో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగబద్ధం చేయబడ్డాయి. ఈ చట్టం ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పాటయింది. పంచాయతీ రాజ్ అంటే గ్రామీణ స్థానిక ప్రభుత్వం(పాలన). ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9వ భాగం (Part – IX) మరియు 11వ షెడ్యూల్ రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. 9వ భాగంలో   ఆర్టికల్ 243 నుండి ఆర్టికల్ 243(O) వరకు మొత్తం 16 ఆర్టికల్స్( అధికరణలు లేదా ప్రకరణలు లేదా నిబంధనలు) ఉన్నాయి. 11వ షెడ్యూల్లో పంచాయితీల పరిధిలో ఉంచబడిన 29 అంశాలు ఉన్నాయి.

అవి :

  1. వ్యవసాయం, వ్యవసాయ విస్తరణ
  2. భూ మెరుగుదల, భూ సంస్కరణల అమలు, భూసమీకరణ మరియు నేల పరిరక్షణ.
  3. పశు సంవర్ధకము, పాడి పరిశ్రమ మరియు కోళ్ళ పెంపకం (పౌల్ట్రీ)
  4. మత్స్య పరిశ్రమ
  5. మైనర్ ఇరిగేషన్, వాటర్ మేనేజ్‌మెంట్ మరియు వాటర్‌షెడ్ అభివృద్ధి
  6. సామాజిక అడవులు మరియు వ్యవసాయ సంబంధ అడవులు
  7. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో సహా చిన్న తరహా పరిశ్రమలు
  8. చిన్న అటవీ ఉత్పత్తులు
  9. త్రాగడానికి సురక్షితమైన నీరు
  10. ఖాదీ, గ్రామ మరియు కుటీర పరిశ్రమలు
  11. గ్రామీణ గృహలు
  12. ఇంధనం మరియు పశువులదాణా (మేత)
  13. విద్యుత్ పంపిణీతో సహా గ్రామీణ విద్యుదీకరణ
  14. రోడ్డు, కల్వర్టులు, వంతెనలు, పడవలు, జలమార్గాలు మరియు ఇతర కమ్యూనికేషన్ మార్గాలు
  15. విద్య (ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలలతో సహా)
  16. సాంప్రదాయేతర శక్తి వనరులు
  17. సాంకేతిక శిక్షణ మరియు వృత్తి విద్య
  18. వయోజన మరియు అనధికారిక విద్య
  19. ప్రజా పంపిణీ వ్యవస్థ
  20. సంఘం ఆస్తుల నిర్వహణ
  21. బలహీన వర్గాల సంక్షేమం ముఖ్యంగా షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల సంక్షేమం
  22. సామాజిక సంక్షేమం (వికలాంగులు మరియు మానసిక పరిపక్వత లేని వారి సంక్షేమంతో సహా )
  23. కుటుంబ సంక్షేమం
  24. మహిళలు మరియు పిల్లల అభివృద్ధి
  25. మార్కెట్లు మరియు సంతలు
  26. ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు డిస్పెన్సరీలతో సహా ఆరోగ్యం మరియు పారిశుధ్యం
  27. సాంస్కృతిక కార్యకలాపాలు
  28. గ్రంథాలయాలు
  29. పేదరిక నిర్మూలన కార్యక్రమాలు

Question: 7

ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని న్యాయపరంగా సమీక్షించవచ్చని సుప్రీంకోర్టు మొదట ఏ తీర్పులో పేర్కొంది?

  1. రాజస్థాన్ రాష్ట్రం Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1977)
  2. సుందర్లాల్ పట్వా Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1993)
  3. SR బొమ్మయ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1994).
  4. రామేశ్వర ప్రసాద్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (2006)
View Answer

Answer: 3

SR బొమ్మయ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1994).

Explanation:

  • 38వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975 ద్వారా అధికరణ 356ను ఉపయోగించి రాష్ట్రపతి పాలనను విధించడం రాష్ట్రపతి తుది మరియు నిశ్చయాత్మక నిర్ణయం, ఏ న్యాయస్థానంలో దీనిపై సవాలు చేయలేరు అంటే న్యాయసమీక్షకు అవకాశం లేదు. కాని ఈ నిబంధన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేయబడింది. ఎమర్జెన్సీ విధించడంలో రాష్ట్రపతి సంతృప్తి న్యాయసమీక్షకు అతీతమైనది కాదు. అంటే న్యాయపరమైన పరిశీలన (న్యాయసమీక్ష) కు అవకాశం కల్పించింది.
  • అదేవిధంగా SR బొమ్మై కేసు (1994) లో, అధికరణ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం అనేది న్యాయసమీక్షకు లోబడి ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

Question: 8

ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య లోక్ సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకూడదనే నిబంధనను ఈ క్రింది ఏ సవరణ తీసుకువచ్చింది:

  1. 142వ సవరణ చట్టం 1976
  2. 44వ సవరణ చట్టం 1978
  3. 91వ సవరణ చట్టం 2003
  4. 99వ సవరణ చట్టం 2015
View Answer

Answer: 3

91వ సవరణ చట్టం 2003

Explanation:

91వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003 :

  1. ఆర్టికల్ 71 ప్రకారం, కేంద్ర మంత్రిమండలి లోని ప్రధాన మంత్రి తో కలిపి, మొత్తం మంత్రుల సంఖ్య, లోక్ సభ సభ్యుల మొత్తం సంఖ్యలోని 15 శాతం కన్నా మించకూడదు.
  2. రాష్ట్ర మంత్రిమండలి లోని ముఖ్యమంత్రి తో కలిపి, మొత్తం మంత్రుల సంఖ్య, ఆ రాష్ట్ర శాసన సభ సభ్యుల మొత్తం సంఖ్యలోని 15 శాతం కన్నా మించకూడదు. కానీ ఏదైనా రాష్ట్రంలో మొత్తం మంత్రుల సంఖ్య (ముఖ్యమంత్రి తో సహా) 12కు తగ్గకూడదు.

99వ రాజ్యాంగ సవరణ చట్టం, 2014 :

  • ఆగస్ట్ 2014లో, కొలీజియం వ్యవస్థ స్థానంలో సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు న్యాయమూర్తులను నియమించేందుకు స్వతంత్ర కమిషన్‌ (New Judicial Appointments Commission(NJAC))  ను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించబడిన చట్టం. 99వ సవరణ చట్టంతో పాటు NJAC చట్టం, 2014 ను పార్లమెంటు ఆమోదించింది.
  • 2015లో, సుప్రీంకోర్టు 99వ రాజ్యాంగ సవరణ చట్టం, 2014 మరియు NJAC చట్టం, 2014 రెండింటినీ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి రద్దు చేసింది.

Question: 9

గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి మరియు క్రింద ఇవ్వబడిన కోడ్ల ద్వారా సమాధానంఎంచుకోండి:
1. రాష్ట్రపతి సమ్మతి కోసం బిల్లులను రిజర్వ్ చేయడం.

2. మంత్రులకు పోర్ట్ ఫోలియోల కేటాయింపు.

3. ముఖ్యమంత్రి ఎంపిక

4. రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం.

  1. 1, 4 సరైనవి మరియు 2, 3 సరైనది కాదు.
  2. 3, 4 సరైనవి మరియు 1, 2 సరైనది కాదు.
  3. 1, 3, 4 సరైనవి మరియు 2 సరైనది కాదు.
  4. 1, 2, 4 సరైనవి మరియు 3 సరైనది కాదు.
View Answer

Answer: 1

1, 4 సరైనవి మరియు 2, 3 సరైనది కాదు.

Explanation:

  • గవర్నర్ విచక్షణ అధికారాలు 2 రకాలుగా విభజించబడ్డాయి.
  1. రాజ్యాంగపరమైన విచక్షణ అధికారాలు
  2. పరిస్థితుల దృష్ట్యా విచక్షణ అధికారాలు

రాజ్యాంగపర విచక్షణ అధికారాలు :

  1. రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లులను రిజర్వ్ చేయడం
  2. రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం
  3. కేంద్రపాలిత ప్రాంతం యొక్క నిర్వాహకునిగా అదనపు బాధ్యత
  4. పరిపాలన మరియు శాసన విషయాలలో ముఖ్యమంత్రి నుండి సమాచారం కోరడం
  5. స్వయం ప్రతిపత్తి కలిగిన గిరిజన జిల్లా కౌన్సిల్‌లకు రాయల్టీలను నిర్ణయించడం ( అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరం రాష్ట్ర గవర్నర్ల కు మాత్రమే ఈ విచక్షణ అధికారం కలదు
  • ( ఆరవ షెడ్యూల్ లోని గిరిజన ప్రాంతాలు స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లా కౌన్సిల్లుగా విభజించబడ్డాయి)

పరిస్థితుల దృష్ట్యా విచక్షణ అధికారాలు :

  1. ముఖ్యమంత్రి నియామకం (ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేనప్పుడు )
  2. శాసనసభలో మంత్రిమండలి విశ్వాసం కోల్పోయినప్పుడు, ఆ మంత్రిమండలి తొలగింపు
  3. మంత్రిమండలి మెజారిటీ కోల్పోయినప్పుడు శాసనసభ రద్దు చేయడం

Question: 10

పార్లమెంట్ కుంటి బాతు సెషన్ అంటే:

  1. లోక్ సభకు ఎన్నికల తర్వాత పార్లమెంటు మొదటి సమావేశాలు.
  2. లోక్ సభ రద్దుకు ముందు పార్లమెంట్ చివరి సమావేశం.
  3. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే పార్లమెంట్ సమావేశాలు.
  4. పార్లమెంటు సమావేశాలు, ఏదైనా బిల్లును ఆమోదించడం.
View Answer

Answer: 2

లోక్ సభకు రద్దుకు ముందు పార్లమెంట్ చివరి సమావేశం.

Explanation: 

  • ప్రస్తుత లోక్ సభ రద్దుకు ముందు (కొత్త లోక్ సభ ఎన్నికకు ముందు) జరిగే చివరి పార్లమెంటు సమావేశాన్ని కుంటి బాతు సమావేశం  (Lame Duck Session) అంటారు.
  • ప్రస్తుత లోక్ సభలో సభ్యులుగా ఉండి కొత్త లోక్ సభకు ఎన్నిక కాని వారిని కుంటి బాతులు (Lame Ducks) అంటారు.
Recent Articles