Home  »  TGPSC 2022-23  »  Indian Polity-5

Indian Polity-5 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

భారత రాజ్యాంగంలోని ఈ క్రింది ఏ షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు తెగల పరిపాలన మరియు నియంత్రణ నిబంధనలకు అంకితం చేయబడింది

  1. నాల్గవ షెడ్యూల్
  2. ఐదవ షెడ్యూల్
  3. తొమ్మిదవ షెడ్యూల్
  4. పదవ షెడ్యూల్
View Answer

Answer: 2

నాల్గవ షెడ్యూల్

Explanation:

  • షెడ్యూల్ ప్రాంతాల మరియు షెడ్యూల్ తెగల పరిపాలన మరియు నియంత్రణకు సంబంధించిన నిబంధనలు 5వ షెడ్యూల్ లో పొందుపరచబడ్డాయి.

Question: 17

“బలహీన వర్గాలు, ప్రజలు మరియు ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల విద్యా మరియు ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్రం ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహిస్తుంది మరియు సామాజిక అన్యాయం మరియు అన్ని రకాల దోపిడీల నుండి వారిని కాపాడుతుంది.” ఈ నిబంధన భారత రాజ్యాంగంలోని ఏ భాగాన్ని కలిగి ఉంది?

  1. ప్రాథమిక హక్కులు
  2. ఆదేశిక సూత్రాలు
  3. ప్రాథమిక విధులు
  4. సమానత్వం హక్కు.
View Answer

Answer: 2

ఆదేశిక సూత్రాలు

Explanation:

  • ఈ నిబంధన ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్ 46 లో కలదు.
  • అధికరణ 46 :
  • షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర బలహీన వర్గాల విద్యా మరియు ఆర్థిక ప్రయోజనాలను ప్రోత్సహించడం మరీ ముఖ్యంగా, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల ప్రయోజనాలను రాజ్యం ప్రోత్సహించాలి మరియు సామాజిక అన్యాయం మరియు అన్ని రకాల దోపిడీల నుండి వారిని కాపాడాలి.
  • (పై అధికరణలో రాజ్యం అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు)
  • ఈ అధికరణ లేదా నిబంధన గాంధీ భావజాలం ఆధారంగా రూపుదిద్దుకుంది. అందువలన గాంధేయవాద లేదా గాంధేయ సూత్రంగా వర్గీకరింపబడింది.
  • గాంధేయవాద ఆదేశిక సూత్రాలుగా వర్గీకరింపబడిన ఇతర అధికరణలు :
  • ఆర్టికల్స్ 40, 43, 43B, 47 & 48.

Question: 18

న్యాయపరమైన పరిష్కారాలన్నీ పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు కనిపెట్టిన ప్రక్రియ పేరును ఆ కోర్టు రెండోసారి సమీక్షించాలి.

  1. స్పెషల్ లీవ్ పిటిషన్
  2. క్యురేటివ్ పిటిషన్
  3. అసాధారణ పిటిషన్
  4. జస్టిస్ పిటిషన్
View Answer

Answer: 2

క్యురేటివ్ పిటిషన్

Explanation:

  • క్యురేటివ్ పిటిషన్ అనేది తుది నేరారోపణకు(నేర విచారణకు) వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన తర్వాత అందుబాటులో ఉండే చట్టపరమైన ఆశ్రయం.
  • రాజ్యాంగబద్ధంగా, సుప్రీంకోర్ట్ యొక్క తుది తీర్పు సాధారణంగా రివ్యూ పిటిషన్ ద్వారా మాత్రమే సవాలు చేయబడుతుంది. అది కూడా, అవిశాల విధానపరమైన కారణాలపై మాత్రమే.
  • రూపా అశోక్ హుర్రా Vs అశోక్ హుర్రా & మరొక కేసు, 2002 కేసులో సుప్రీంకోర్టు క్యూరేటివ్ పిటిషన్‌లను నియంత్రించే సూత్రాలను ఏర్పాటు చేసింది.

స్పెషల్ లీవ్ పిటిషన్ :

  • ఆర్టికల్ 136 ప్రకారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. సుప్రీంకోర్టు తన విచక్షణతో భారత భూభాగంలోని ఏదైనా న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్ ( మిలిటరీ ట్రిబ్యునల్ మరియు కోర్ట్-మార్షల్ మినహా) ద్వారా ఆమోదించబడిన ఏదైనా విషయంలో ఏదైనా తీర్పు నుండి అప్పీల్ చేయడానికి ప్రత్యేక అనుమతిని మంజూరు చేయడానికి అధికారం కలిగి ఉంది.

Question: 19

కొలీజియం వ్యవస్థ ద్వారా సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు న్యాయపరమైన నియామకాల సందర్భంలో MOP, దేనిని సూచిస్తుంది

 

  1. మెమోరాండం ఆఫ్ ప్రిన్సిపల్స్
  2. మెమోరాండం ఆఫ్ ప్రివిలేషన్స్
  3. మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్
  4. మెమొరాండం ఆఫ్ ప్రాసెస్
View Answer

Answer: 3

మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్

Explanation:

  • భారత సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయమూర్తులు రాజ్యాంగంలోని అధికరణ 124లోని ఉపవాక్యం (2) (124(2) – article 124 clause 2)  ప్రకారం రాష్ట్రపతిచే నియమింపబడతారు.
  • న్యాయమూర్తుల నియామకంలో ఒక ప్రక్రియను (ఒక విధానం) అనుసరిస్తారు.  ఆ విధానాన్ని సూచించేది Memorandum Of Procedure (MOP).

Question: 20

ప్రధాన కేసులు మరియు వాటి ముఖ్యమైన సమస్యలకు సంబంధించి జాబితా-1ని జాబితా-2 తో సరిపోల్చండి మరియు దిగువ ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
జాబితా-1 (కేసు)
ఎ. ఎకె గోపాలన్ వర్సెస్ మద్రాస్ రాష్ట్రం
బి. మేనకా గాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా
సి. SR బొమ్మయ్ VS యూనియన్ ఆఫ్ ఇండియా

డి. ఇంద్ర సాహ్నీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా

జాబితా-2 (ఇష్యూ)

1. రిజర్వేషన్స్ స్టేట్ ఆఫ్ మద్రాస్
2. వ్యక్తిగత స్వేచ్ఛ
3. ప్రివెంటివ్ డిటెన్షన్

4. రాష్ట్రాలలో భారత రాష్ట్రపతి పాలన యూనియన్

  1. ఎ-3, బి-2, సి-4, డి-1,
  2. ఎ-3, బి-1, సి-2, డి-4
  3. ఎ-4, బి-3, సి-1, డి-2,
  4. ఎ-4, బి-1, సి-2, డి-3,
View Answer

Answer: 1

ఎ-3, బి-2, సి-4, డి-1,

Explanation:

  • AK గోపాలన్ లేదా AKG (అయిల్‌యాథ్ కుట్టియారి గోపాలన్), భారతీయ కమ్యూనిస్ట్ రాజకీయనాయకుడు. 1927 లో అతను భారత జాతీయ కాంగ్రెస్‌ లో చేరిన పిదప ఖాదీ ఉద్యమంలోనూ, హరిజనుల అభ్యున్నతిలోను చురుకైన పాత్ర పోషించడం ప్రారంభించాడు. 1930 లో ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నందుకు అతడిని అరెస్టు చేశారు. అతడు జైలులో ఉన్నప్పుడు కమ్యూనిజంతో పరిచయం ఏర్పడింది. ఈయన 1952 లో మొదటి లోక్‌సభకు ఎన్నికైన 16 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యులలో ఒకరు. అతను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) వ్యవస్థాపక సభ్యులలో ప్రముఖుడు.

AK గోపాలన్ Vs మద్రాస్ రాష్ట్రం (1950) కేసు :

  • ఎకె గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసును ‘హెబియస్ కార్పస్ కేసు’ అని కూడా పిలుస్తారు. ఇది 1950లో భారత అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన ఒక చరిత్రాత్మక తీర్పు.
  • కమ్యూనిస్ట్ నాయకుడు ఎకె గోపాలన్‌ సాధారణ క్రిమినల్ చట్టం కింద శిక్ష విధించినప్పటి (డిసెంబర్ 1947) నుండి నిర్బంధంలో ఉన్నారు. అతని నిర్బంధానికి ప్రధాన కారణం అతని కార్యకలాపాలు పబ్లిక్ ఆర్డర్ మరియు జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తాయని  రాష్ట్రం భావించింది. ఆ తర్వాత ఆ నేరారోపణలను పక్కన పెట్టారు. కానీ  1950 మార్చి 1న, అతను మద్రాసు జైలులో ఉన్నప్పుడు, గోపాలన్‌కి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, 1950 (Preventive Detention Act, 1950) లోని సెక్షన్ 3(1) ప్రకారం ఒక ఉత్తర్వు అందించారు. ఆ ఉత్తర్వులలోని నిబంధనల ప్రకారం దేశ రక్షణ, విదేశీ సంబంధాలు, జాతీయ భద్రత, రాష్ట్ర భద్రత, పబ్లిక్ ఆర్డర్ లేదా అవసరమైన సామాగ్రి మరియు సేవల నిర్వహణకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించకుండా నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఎవరినైనా నిర్బంధించడానికి ఈ నిబంధన అనుమతిస్తుంది.
  • గోపాలన్ తన నిర్బంధానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. PD act, 1950 లోని సెక్షన్ 14 కారణంగా నిర్బంధానికి కారణాలు గోపాలన్ కిగాని , కోర్టుకి కానీ వెల్లడించడానికి ప్రభుత్వం నిరాకరించింది. తనను నిర్బంధించిన ఉత్తర్వులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21లను ఉల్లంఘించాయని, ఈ చట్టంలోని నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 22ను ఉల్లంఘించాయని ఆయన పేర్కొన్నారు.

తీర్పు :

  • భారతదేశ అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్‌ని నిర్బంధించడం చట్టవిరుద్ధమని మరియు రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్‌ను మంజూరు చేసింది. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, 1950లోని సెక్షన్ 12 చెల్లదని కోర్టు తన తీర్పులో పేర్కొంది. అదనంగా, చట్టంలోని సెక్షన్ 14 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 22(5) మరియు 32లోని నిబంధనలకు విరుద్ధం అని కోర్టు తీర్పు చెప్పింది.
  • ఈ కేసులో 6గురు సభ్యుల ధర్మాసనం ( బెంచ్ ) తీర్పు ఇచ్చింది.
  • తీర్పు ఇచ్చిన ధర్మాసనం న్యాయమూర్తులు :
  • హరిలాల్ కనియా (మొట్టమొదటి భారత ప్రధాన న్యాయమూర్తి), ఎస్. ఫజల్ అలీ( ఈయనే తరువాత ఫజల్ ఆలీ కమీషన్ చైర్మన్ గా వ్యవహరించారు), ఎం. పతంజలి శాస్త్రి(2వ భారత ప్రధాన న్యాయమూర్తి), మెహర్ చంద్ మహాజన్, బి.కె. ముఖర్జీ మరియు సుధీ రంజన్ దాస్.
  • AK గోపాలన్ తరపున MK నంబియార్, SK అయ్యర్ మరియు VG రావు వాదించారు.
  • మద్రాస్ ప్రభుత్వం తరఫున K రాజ అయ్యర్ ( అడ్వకేట్ జనరల్, మద్రాస్) , CR పట్టాభిరామన్ మరియు R గణపతి.
  • MC సెటాల్వడ్ ( మొట్టమొదటి భారత అటార్నీ జనరల్, మొదటి లా కమిషన్ ఛైర్మన్ గా కూడా వ్యవహరించారు ) కేంద్ర ప్రభుత్వం తరఫున కేసు ప్రొసీడింగ్స్ లో ఉన్నారు.

మేనక గాంధీ vs యూనియన్ ఆఫ్ ఇండియా (1978) కేసు :

  • మేనకా గాంధీ పాస్‌పోర్ట్ 2 జూలై 1977 నాటి ఉత్తర్వు ద్వారా ‘ప్రజా ప్రయోజనాల దృష్ట్యా’ కారణం చేత పాస్ పోర్ట్ చట్టం కింద జప్తు చేయబడింది. ఆమె పాస్‌ పోర్ట్ ను స్వాధీనం చేసుకోవడానికి గల కారణాలను కోరినప్పుడు, భారత ప్రభుత్వం సాధారణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ” కారణాలు ఇవ్వడానికి నిరాకరించింది.
  • మేనక గాంధీ సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. పాస్‌ పోర్ట్ను స్వాధీనం చేసుకున్న చర్య ఆర్టికల్ 21 ద్వారా హామీ ఇవ్వబడిన ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుపై ప్రత్యక్ష దాడి అని వాదించారు.
  • ఈ అత్యంత ముఖ్యమైన తీర్పు 25 జనవరి 1978న వెలువడింది మరియు ఇది భారత రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని మార్చింది. ఈ తీర్పు ఆర్టికల్ 21 యొక్క పరిధిని విపరీతంగా విస్తరించింది మరియు పీఠికలో హామీ ఇచ్చినట్లుగా భారతదేశాన్ని సంక్షేమ రాజ్యంగా మార్చే లక్ష్యాన్ని  ఇందులో గ్రహించారు.
  • ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది.

తీర్పు ప్రధానాంశాలు :

  • ఈ తీర్పు ద్వారా అధికరణలు 14,19 మరియు 21 అనుసంధానించబడ్డాయి. తద్వారా వ్యక్తిగత స్వేచ్ఛ పరిధి గణనీయంగా పెరిగింది.
  • ఈ తీర్పు ద్వారా స్వచ్ఛమైన నీటి హక్కు, స్వచ్ఛమైన గాలి హక్కు, శబ్ద కాలుష్యం నుండి స్వేచ్ఛ, ప్రామాణిక విద్య, వేగవంతమైన విచారణ, న్యాయమైన విచారణ, జీవనోపాధి హక్కు, న్యాయ సహాయం, ఆహార హక్కు, పరిశుభ్రమైన పర్యావరణ హక్కు, వైద్య సంరక్షణ హక్కు వంటి ఇతర ముఖ్యమైన హక్కులను ఆర్టికల్ 21 పరిధిలోకి తీసుకురావడానికి సుప్రీం కోర్టు మార్గం సుగమం చేసింది.

ఇంద్ర సాహ్నీ vs యూనియన్ ఆఫ్ ఇండియా (1992) కేసు :

  • మండల్ కమీషన్ నివేదిక 1980 లో సమర్పించి సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ ఇవ్వాలని సూచించింది.
  • జనతా పార్టీ (చరణ్ సింగ్ ) పడిపోవడంతో తర్వాత వచ్చిన్ ప్రభుత్వాలు ఈ సూచనలను పక్కకు పెట్టాయి. తరువాత మళ్ళీ 1992లో కేంద్రంలోని PV నరసింహ రావు ప్రభుత్వం 37 శాతంకు రిజర్వేషన్ పెంచి ఆర్థికంగా , సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ఇవ్వాలని ఆర్డర్ ఇష్యూ చేసింది.
  • ఇంద్ర సాహ్ని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు.
  • ఈ కేసులో పిటిషనర్ అయిన ఇంద్ర సాహ్ని ఈ ఉత్తర్వుకు వ్యతిరేకంగా మూడు ప్రధాన వాదనలు చేశారు.
  1. రిజర్వేషన్ల పొడిగింపు అవకాశాల సమానత్వానికి సంబంధించిన రాజ్యాంగ హామీని ఉల్లంఘించింది.
  2. వెనుకబాటుతనానికి కులం నమ్మదగిన సూచిక కాదు.
  3. ప్రభుత్వ సంస్థల సామర్థ్యం ప్రమాదంలో పడింది

తీర్పు ప్రధానాంశాలు :

  1. ఆర్టికల్ 16(4) ప్రకారం వెనుకబడిన తరగతులను ఆర్థిక ప్రమాణాల ఆధారంగా గుర్తించలేము కానీ కుల వ్యవస్థను కూడా పరిగణించాలి.
  2. ఆర్టికల్ 16(4)లోని వెనుకబడిన తరగతులు ఆర్టికల్ 15(4)లో పేర్కొన్న సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు భిన్నం.
  3. క్రీమీలేయర్ (Creamy Layer) అనే భావనను రూపొందించి, వెనుకబడిన తరగతులను గుర్తించే సమయంలో అటువంటి క్రీమీలేయర్‌ను మినహాయించాలని నిర్దేశించారు.
  4. ఆర్టికల్ 16(4) వెనుకబడిన తరగతులను వెనుకబడిన మరియు మరింత వెనుకబడిన వర్గీకరణను అనుమతిస్తుంది.
  5. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు, పైగా, ప్రమోషన్లలో రిజర్వేషన్ అనుమతించబడదు.

SR బొమ్మయ్ vs యూనియన్ ఆఫ్ ఇండియా (1994) కేసు:

  • ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, రాష్ట్రపతి పాలన మరియు సంబంధిత సమస్యలపై సుదీర్ఘంగా చర్చించింది. తీర్పు కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ తీర్పు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 యొక్క  దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రయత్నించింది.
  • కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి SR బొమ్మై ఈ చారిత్రాత్మక తీర్పు రావడానికి ప్రధాన కారణం. దేశ రాజకీయాలలో అత్యధికంగా కోట్ చేయబడిన తీర్పులలో ఒకటిగా పరిగణించబడే భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇది.
Recent Articles