Home  »  TGPSC 2022-23  »  Indian Polity-6

Indian Polity-6 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది పార్టీల ఏర్పాటును కాలక్రమానుసారంగా అమర్చండి:

ఎ. ఆమ్ ఆద్మీ పార్టీ

బి. తృణమూల్ కాంగ్రెస్

సి. భారతీయ జనతా పార్టీ

డి. తెలుగుదేశం పార్టీ

సరైన క్రమాన్ని ఎంచుకోండి:

  1. ఎ, సి, బి, డి
  2. బి, డి, సి, ఎ
  3. డి, సి, బి, ఎ
  4. సి, డి, బి, ఎ
View Answer

Answer: 4

సి, డి, బి, ఎ

Explanation:

  • భారతీయ జనతా పార్టీ (BJP)  6 ఏప్రిల్, 1980 లో ఆవిర్భవించింది. BJP,  భారతీయ జన సంఘ్ మూలాలు కలిగిన పార్టీ. పార్టీ వ్యవస్థాపకులు అటల్ బిహారీ వాజ్ పాయ్ మరియు లాల్ కృష్ణ అద్వాని .  ఈ పార్టీ గుర్తు కమలం పువ్వు.  ప్రస్తుతం ఈ పార్టీ నేతృత్వంలోని కూటమి (National Democratic Alliance) కేంద్రంలో అధికారంలో ఉంది.  అంతే కాకుండా దేశంలోని చాలా రాష్ట్రాలలో BJP ప్రభుత్వాలు నడుస్తున్నాయి.
  • అటల్ బిహారీ వాజ్ పాయ్ గారిని 2015 లో , అద్వాని గారిని 2024 లో   భారత అత్యున్నత పౌర పురస్కారం “భారతరత్న”తో ప్రభుత్వం సత్కరించింది.
  • తెలుగు దేశం పార్టీ (TDP) 1982లో ఆవిర్భవించింది. దీనిని ప్రఖ్యాత తెలుగు సినీ దిగ్గజ నటుడు నందమూరి తారకరామారావు (NTR) స్థాపించారు. ఈ పార్టీ గుర్తు సైకిల్ . ప్రస్తుతం TDP ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది.
  • ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి – నారా చంద్రబాబు నాయుడు.
  • తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 1998లో ఆవిర్భవించింది. కాంగ్రెస్ నుండి బయటికి వచ్చి మమత బెనర్జీ ఈ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ గుర్తు గడ్డి & రెండు పూలు.  ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉంది.
  • పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి – మమత బెనర్జీ
  • ఆమ్ ఆద్మీ పార్టీ 2012లో ఆవిర్భవించింది. దీనిని అరవింద్ కేజ్రీవాల్ స్థాపించారు. 2011 లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమ తదనంతర పరిణామాల నుండి ఈ పార్టీ ఏర్పడింది. ఈ పార్టీ గుర్తు చీపురు. ప్రస్తుతం పంజాబ్ మరియు ఢిల్లీలో ఈ పార్టీ అధికారంలో ఉంది.
  • ఢిల్లీ ముఖ్యమంత్రి – అరవింద్ కేజ్రీవాల్
  • అరవింద్ కేజ్రీవాల్ ను లిక్కర్ కుంభకోణం కేసులో పాత్ర ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి,2024 లో అరెస్టు చేసింది. జైలులో ఉండి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. భారతదేశంలో ఇలా జరగడం మొదటిసారి.
  • పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ సింగ్ మన్

Question: 7

ప్రతి రెండు సంవత్సరాలకు ఎంత మంది శాసన మండలి సభ్యులు పదవీ విరమణ చేస్తారు?

  1. మొత్తం సభ్యత్వంలో 1/5వ వంతు
  2. మొత్తం సభ్యత్వంలో 1/4వ వంతు
  3. మొత్తం సభ్యత్వంలో 1/10వ వంతు
  4. మొత్తం సభ్యత్వంలో 1/3వ వంతు
View Answer

Answer: 4

మొత్తం సభ్యత్వంలో 1/3వ వంతు

Explanation:

  • శాసనమండలి శాశ్వత సభ. ఇది రద్దు కాబడదు. శాసనమండలిలో సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3 వ వంతు ఉండాలి మరియు  శాసనమండలిలో సభ్యుల సంఖ్య 40 కంటే తగ్గకూడదు. శాసన మండలి సభ్యుల పదవీ కాలం 6 సం,,లు.  ప్రతి రెండేళ్లకోసారి 1/3వ వంతు సభ్యులు పదవి విరమణ చేస్తారు. పదవి విరమణ చేసిన సభ్యులు మళ్ళీ ఎన్నిసార్లైన మండలికి ఎన్నిక కావచ్చు.

Question: 8

ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
ఎ. రాజ్యాంగం రాష్ట్రాల అధికారిక భాషను పేర్కొనలేదు.

బి. రాష్ట్రాలు అధికారిక ఉపయోగంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలను స్వీకరించవచ్చు.
సి. సుప్రీంకోర్టులో ప్రొసీడింగ్ లు ఆంగ్లంలో ఉండాలి.
డి. యూనియన్ దాని అధికారిక భాషకు సంబంధించి రాష్ట్రం యొక్క నిర్ణయంతో జోక్యం చేసుకోవచ్చు.
పై వాక్యాలలో ఏది సరైనది?

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి మాత్రమే
  3. డి మాత్రమే
  4. బి మరియు సి మాత్రమే
View Answer

Answer: 4

బి మరియు సి మాత్రమే

Explanation:

  • అధికారిక భాషకు సంబంధించిన నిబంధనలు భాగం – 17 (పార్ట్ – XVII) అధికరణలు 343 నుండి 351 మధ్య పొందుపరచబడ్డాయి.
  • రాజ్యాంగం రాష్ట్రాల అధికారిక భాషను పేర్కొనలేదు.             
  • అధికరణ 343 :యూనియన్ అధికారిక భాషగా దేవనాగరి లిపిలో గల హిందీ ఉండాలి. భాషలోని అంకెలు & సంఖ్యలు మాత్రం దేవనాగరి లిపివి కాకుండా అంతర్జాతీయ  అంకెలు & సంఖ్యలు ఉండాలి.
  • అధికరణ 345 : రాష్ట్ర శాసనసభలు చట్టం ద్వారా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ భాషలను లేదా హిందీని అధికారిక భాషగా లేదా భాషలుగా రాష్ట్రానికి సంబంధించిన అన్ని వ్యవహారాలలో వాడవచ్చును.
  • పై విధంగా శాసన సభ చట్టం చేసే వరకు ఆంగ్లము అధికారిక భాషగా రాష్ట్రంలో వాడబడుతుంది.
  • అధికరణ 343 ద్వారా చాలా రాష్ట్రాలు వాటి ప్రాంతీయ భాషను అధికారిక భాషగా మార్చుకున్నాయి.
  • ఆంధ్ర ప్రదేశ్ – తెలుగు, కేరళ – మలయాళం , అస్సాం – అస్సామీస్ ,  పశ్చిమ బెంగాల్ – బెంగాలీ, ఒడిషా – ఒడియా , ను అధికారిక భాష చేసుకున్నాయి.
  • ఉత్తర భారతంలో 9 రాష్ట్రాలు హిందీని అధికారిక భాషగా చేసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ఘర్, బీహార్, ఝార్ఖండ్ , హర్యానా మరియు రాజస్థాన్ రాష్ట్రాల అధికారిక భాష హిందీ.
  • గుజరాత్ – గుజరాతీ & హిందీ
  • గోవా – మరాఠీ & కొంకణి
  • మేఘాలయ , అరుణాచల్ ప్రదేశ్ , నాగాలాండ్ – ఇంగ్లీష్
  • 8వ షెడ్యూల్ లోని భాషలనే అధికారిక భాషలుగా చేసుకోవాల్సిన నిబంధన లేదు.
  • హిందీతో పాటు ఆంగ్లం కూడా కేంద్రం (యూనియన్) యొక్క అధికారిక వ్యవహారాలలో & పార్లమెంటు వ్యవహారాలలో  వాడవచ్చునని అధికారిక భాషల చట్టం ,1963 చేయబడింది.
  • ఈ చట్టం ప్రకారం హిందీ లేదా రాష్ట్ర అధికారిక భాషను (ఆంగ్ల అనువాదంతో కూడిన ) ఆ రాష్ట్ర హై కోర్టు తీర్పులలో, కోర్టు ఆదేశాలలో ఉపయోగించాలని రాష్ట్రపతి పూర్వానుమతితో రాష్ట్ర గవర్నర్ అదేశించవచ్చు.
  • సుప్రీం కోర్టు వ్యవహారాలలో హిందీ వాడాలని రాజ్యాంగం ఎటువంటి నిబంధన పెట్టలేదు. రాజ్యాంగం మొదలు నుండి ఆంగ్లము వాడుతున్నారు కావున సుప్రీం కోర్టు అధికారిక భాష ఆంగ్లము.

Question: 9

పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి కోరం ఎంత?

  1. పార్లమెంట్ ఉభయ సభల్లో 1/5వ వంతు
  2. లోక్ సభలో 1/5వ వంతు మరియు రాజ్యసభలో 1/10వ వంతు  
  3. ఉభయ సభల మొత్తం సభ్యుల సంఖ్యలో 1/10వ వంతు  
  4. ఉభయ సభల మొత్తం సభ్యుల సంఖ్యలో 1/20వ వంతు
View Answer

Answer: 3

ఉభయ సభల మొత్తం సభ్యుల సంఖ్యలో 1/10వ వంతు

Explanation:

  • పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వాహణకు కోరం 2 సభల ( లోక్ సభ & రాజ్య సభ ) మొత్తం సభ్యుల సంఖ్యలో 1/10 వ వంతు.
  • ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది లోక్ సభ స్పీకర్. రాజ్య సభ ఛైర్మన్ అధ్యక్షత వహించారు ఎందుకంటే ఆయన/ఆమె ఏ సభలోను సభ్యులు కారు.
  • సంయుక్త సమావేశాల నిర్వహణకు  లోక్ సభ నిబంధనలే పాటించబడతాయి.

Question: 10

ఉప ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎవరు ఎన్నుకుంటారు:

  1. రాజ్యసభ సభ్యులు మాత్రమే
  2. లోక్ సభ మరియు రాజ్యసభ సభ్యులు
  3. లోక్ సభ మరియు రాష్ట్ర శాసనసభల సభ్యులు
  4. లోక్ సభ, రాజ్యసభ మరియు రాష్ట్ర శాసనసభల సభ్యులు
View Answer

Answer: 4

లోక్ సభ, రాజ్యసభ మరియు రాష్ట్ర శాసనసభల సభ్యులు

Explanation:

  • ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి లాగా పరోక్షంగా ఎన్నుకోబడతారు.
  • ఉపరాష్ట్రపతిని  పార్లమెంటు సభ్యులు కలిగిన ఎలక్టోరల్ కాలేజి ద్వారా ఎన్నుకుంటారు.

ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజి సభ్యులు :

  • పార్లమెంటుకు ఎన్నికైన మరియు నామినేట్ చేయబడిన సభ్యులు ( లోక్ సభ మరియు రాజ్య సభ సభ్యులు )

రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజి సభ్యులు :

  • పార్లమెంటు కు ఎన్నికైన సభ్యులు (లోక్ సభ మరియు రాజ్యసభకు ఎన్నికైన వారు మాత్రమే)
  • రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికైన సభ్యులు
  • కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ మరియు పుదుచ్చేరి రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికైన సభ్యులు ( ఈ నిబంధన 70వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా చేర్చారు, 1995 నుండి అమల్లోకి వచ్చింది)
Recent Articles