Home  »  TGPSC 2022-23  »  Indian Polity-6

Indian Polity-6 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
ఎ. సాధారణ మెజారిటీతో పార్లమెంటు చట్టం ద్వారా కొత్త రాష్ట్రాలు ఏర్పడవచ్చు.
బి. 1979లో రాజ్యాంగ పీఠికలో ‘లౌకికవాదం’ అనే పదాన్ని చేర్చారు.
సి. 39వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975 ద్వారా సిక్కిం యూనియన్ లో చేరింది.
డి. శాసన మండలి కనీస బలం 40.
పై వాక్యాలలో ఏది సరైనది?

  1. బి మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. సి మాత్రమే
  4. ఎ మరియు డి మాత్రమే
View Answer

Answer: 4

ఎ మరియు డి మాత్రమే

Explanation:

  • సాధారణ మెజారిటీ :   50% కంటే ఎక్కువ మంది సభ్యుల హాజరు మరియు ఓటింగ్

సాధారణ మెజారిటీ ద్వారా జరిగే సవరణలు :

    • కొత్త రాష్ట్రాల ఏర్పాటు
    • రాష్ట్రాల పేరు మార్పు , సరిహద్దుల మార్పు మరియు భూభాగాల మార్పు
    • రాష్ట్రాలలో శాసన మండలి ల ఏర్పాటు లేదా కొత్తగా ఏర్పాటు
  • రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 లో చేర్చారు.
  • 35వ రాజ్యాంగ సవరణ చట్టం, 1974 ద్వారా సిక్కిం అనుబంధ రాష్ట్రంగా భారత యూనియన్లో భాగమైంది.
  • 36వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975 ద్వారా సిక్కిం పూర్తి స్థాయిలో ఒక రాష్ట్రంగా ఏర్పడింది.
  • శాసనమండలిలో సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3 వ వంతు ఉండాలి మరియు  శాసనమండలిలో సభ్యుల సంఖ్య 40 కంటే తగ్గకూడదు.

Question: 12

‘సెర్టియోరారి’ రిట్ యొక్క ఉద్దేశ్యం:

  1. ఒక పనిని చేయమని ఒక వ్యక్తిని ఆదేశించడం
  2. ప్రభుత్వ కార్యాలయానికి ఒక వ్యక్తి యొక్క దావా యొక్క చట్టబద్ధతను పరిశీలించడానికి
  3. నిరోధించడానికి మరియు నయం చేయడానికి
  4. అధికార పరిధిని ఆక్రమించకుండా నిరోధించడానికి
View Answer

Answer: 4

అధికార పరిధిని ఆక్రమించకుండా నిరోధించడానికి

Explanation:

  • సుప్రీం కోర్టు మరియు హైకోర్టులకు ప్రాథమిక హక్కులను (Fundamental Rights) అమలుచేయడానికి రిట్స్(ఆదేశాలు) జారీ చేయగల అధికారం కలదు.

 సర్టియోరరి :

  • ఈ రిట్ ఉద్ధేశ్యం దిగువ కోర్ట్ ల అధికార పరిధిని నిరోధించడానికి
  • ఇది దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్‌కు పెండింగ్‌లో ఉన్న కేసును బదిలీ చేయడానికి లేదా ఒక కేసులో తరువాతి ఆర్డర్‌ను రద్దు చేయడానికి పై కోర్టు జారీ చేసే ఆదేశం.

 

Question: 13

కిందివాటిలో రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణకు దోహదపడే రాజ్యాంగ నిబంధనలు ఏవి?

ఎ. అఖిల భారత సేవలు

బి. గ్రాంట్స్-ఇన్-ఎయిడ్
సి. అంతర్రాష్ట్ర మండలి
సరైన జవాబుని ఎంచుకోండి :

  1. ఎ మరియు సి మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. ఎ, బి మరియు సి
  4. ఎ మరియు బి మాత్రమే
View Answer

Answer: 3

ఎ, బి మరియు సి

Explanation:

  • కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలపై నియంత్రణ కలిగిన అంశాలు
  • అఖిల భారత సర్వీసులు, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ మరియు అంతర్రాష్ట్ర మండలి

Question: 14

ఏప్రిల్, 2023 లో భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీకి జాతీయ రాజకీయ పార్టీ హెూదా ఇవ్వబడింది?

  1. అకాలీదళ్
  2. జార్ఖండ్ ముక్తి మోర్చా
  3. ఆమ్ ఆద్మీ పార్టీ
  4. సిపిఐ (ఎం)
View Answer

Answer: 3

ఆమ్ ఆద్మీ పార్టీ

Explanation:

  • భారత ఎన్నికల సంఘం హ్యాండ్ బుక్ 2023 ప్రకారం , గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు 6.

జాతీయ పార్టీలు( గుర్తు )- స్థాపన సంవత్సరం :

  • భారతీయ జనతా పార్టీ ( కమలం పువ్వు )- 1980
  • ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ( హస్తం ) – 1885
  • కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ( మార్క్సిస్టు) ( సుత్తి, కొడవలి & నక్షత్రం )- 1964
  • ఆమ్ ఆద్మీ పార్టీ ( చీపురు )- 2012
  • బహుజన్ సమాజ్ పార్టీ ( ఏనుగు ) – 1984
  • నేషనల్ పీపుల్స్ పార్టీ ( పుస్తకం ) – 2013
  • నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ,  తృణమూల్ కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ల జాతీయ హోదా ఆ పార్టీల ఎన్నికలలో పనితీరు కారణంగా ఎన్నికల సంఘం తీసివేసింది.
  • భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన నివేదిక ప్రకారం మన దేశంలో 6 గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, 57 గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలు మరియు 2764 గుర్తింపు లేని పార్టీలు ఉన్నాయి.

Question: 15

భారతదేశంలోని ఒక రాష్ట్రం యొక్క సరిహద్దును ఈ క్రింది విధంగా పేర్కొనబడిన ప్రక్రియ ద్వారా మార్చవచ్చు:
ఎ. ఆర్టికల్స్ 368 మరియు 369
బి. ఆర్టికల్స్ 370 మరియు 371E
సి. ఆర్టికల్ 1
డి. ఆర్టికల్ 3
పైన పేర్కొన్న వాటిలో ఏది సరైనది?

  1. ఎ మాత్రమే
  2. డి మాత్రమే
  3. బి మాత్రమే  
  4. ఎ మరియు బి
View Answer

Answer: 2

డి మాత్రమే

Explanation:

  • ఆర్టికల్స్ (1 – 4)   – పార్ట్ I  – కేంద్రం మరియు దాని భూభాగాలు (Union and its Territory)
  • ఆర్టికల్ 1 :  భారతదేశం మరియు దాని భూభాగ నిర్వచనం
  • ఆర్టికల్ 2 : యూనియన్ ఆఫ్ ఇండియా లో భాగంకాని రాష్ట్రాలను భారతదేశంలో భాగం చెయ్యడానికి పార్లమెంట్కు అధికారం కలదు
  • ఆర్టికల్ 3: దీని ప్రకారం పార్లమెంట్ కు ఈ దిగువ అధికారాలు రాజ్యాంగం కల్పించింది
  1. భారతదేశంలో ఇప్పటికే ఉన్న రాష్ట్రాల సరిహద్దు మార్పులకు
  2. ఏదేని ఒక రాష్ట్రంలోని కొంత భాగాన్ని వేరుచేసి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం లేదా వేరు వేరు రాష్ట్రాలలోని కొన్ని భూభాగాలను తీసుకొని ఒక కొత్త రాష్ట్రంగా చెయ్యడం
  3. ఏదైనా రాష్ట్రం వైశాల్యాన్ని పెంచడం లేదా తగ్గించడం
  4. ఏదైనా రాష్ట్రం యొక్క సరిహద్దులను మార్చడం
  5. రాష్ట్రాల పేరు మార్చివేయడం
  • ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 3  అవకాశం కల్పించింది.
  • భారత భూభాగాన్ని వేరే దేశానికి బదలయించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. బేరుబారి యూనియన్ ను పాకిస్తాన్ కు ఇవ్వడానికి 9వ రాజ్యాంగ సవరణ చట్టం 1960 చేశారు.
Recent Articles