Home  »  TGPSC 2022-23  »  Indian Polity-6

Indian Polity-6 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్రాన్ని నిర్వచిస్తుంది?

  1. ఆర్టికల్ 1
  2. ఆర్టికల్ 2
  3. ఆర్టికల్ 10
  4. ఆర్టికల్ 12
View Answer

Answer: 4

ఆర్టికల్ 12

Explanation:

  • ప్రాథమిక హక్కుల లోని వేర్వేరు నిబంధనల్లో స్టేట్ (రాజ్యం) వాడబడింది. ఆ పదం యెుక్క నిర్వచనం అధికరణ 12లో పొందుపరిచారు .

అధికరణ 12 : రాజ్యం అంటే

  1. భారత ప్రభుత్వం మరియు భారత పార్లమెంటు ( కేంద్ర ప్రభుత్వం యెుక్క కార్యనిర్వహక మరియు శాసన విభాగాలు)
  2. రాష్ట్రాల ప్రభుత్వాలు మరియు రాష్ట్రాల శాసన సభలు ( రాష్ట్ర ప్రభుత్వ యెుక్క కార్యనిర్వహక మరియు శాసన విభాగాలు)
  3. అన్ని స్థానిక ప్రభుత్వాలు ( మున్సిపాలిటీలు, పంచాయతీలు మరియు జిల్లా బోర్డ్లు మొదలైనవి )
  4. మిగిలిన అథారిటీలు (చట్టబద్ధమైన లేదా చట్టబద్దతలేని)

ఉదా : LIC, ONGC & SAIL మొదలైనవి

  • కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల తరఫున పనిచేస్తున్న ప్రైవేట్ సంస్థలు లేదు ప్రైవేట్ ఏజెన్సీలు కూడా రాజ్యం లో భాగమేనని సుప్రీం కోర్టు తెలిపింది.

Question: 17

రాజ్యాంగంలో పొందుపరిచిన పార్లమెంటరీ ప్రభుత్వ రూపం:

ఎ. మెజారిటీ పాలన
బి. బాధ్యతాయుతమైన ప్రభుత్వం
సి. శాసన సభకు కార్యనిర్వాహక వర్గం యొక్క జవాబుదారీతనం

డి. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం
పైన పేర్కొన్న వాటిలో ఏది సరైనది?

  1. ఎ, బి మరియు సి మాత్రమే
  2. ఎ, బి, సి మరియు డి
  3. బి, సి మరియు డి మాత్రమే
  4. ఎ, బి మరియు డి మాత్రమే
View Answer

Answer: 1

ఎ, బి మరియు సి మాత్రమే

Explanation:

  • భారత రాజ్యాంగం పార్లమెంటరీ (ప్రాతినిధ్య)  ప్రభుత్వాన్ని మనకు అందిస్తుంది.
  • పార్లమెంటరీ ప్రభుత్వాన్ని క్యాబినెట్ ప్రభుత్వం లేదా బాధ్యతాయుత ప్రభుత్వం లేదా వెస్ట్ మినిష్టర్ మోడల్ ప్రభుత్వం అంటారు.
  • పార్లమెంటరీ వ్యవస్థలో క్యాబినెట్ అధికార కేంద్రం కనుక ఐవర్ జెన్నింగ్స్ పార్లమెంటరీ ప్రభుత్వాన్ని క్యాబినెట్ ప్రభుత్వం అని పేర్కొన్నారు.
  • పార్లమెంటరీ ప్రభుత్వంలో క్యాబినెట్ (కార్యనిర్వహక విభాగం) పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుంది. కనుక ఈ ప్రభుత్వాన్ని బాధ్యతాయుత ప్రభుత్వం అని కూడా అంటారు.

పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలు :

  1. మెజారిటీ పార్టీ పాలన
  2. ఉమ్మడి బాధ్యత ( మంత్రులందరు పార్లమెంటు కి ఉమ్మడి బాధ్యత వహిస్తారు)
  3. రాజకీయ సజాతీయత ( ప్రభుత్వాన్ని నడిపే మంత్రి మండలి లోని మంత్రులందరూ ఒకే రాజకీయ పార్టీకి చెందిన వారు లేదా ఒకే రాజకీయ సైద్ధాంతిక కలిగినవారు)
  1. ద్వంద్వ సభ్యత్వం ( పార్లమెంటు సభ్యులే మంత్రులు కాగలరు. అంటే మంత్రులు శాసనవిభాగ సభ్యులు మరియు కార్యనిర్వహక సభ్యులు)
  1. ప్రధానమంత్రి నాయకత్వం
  2. దిగువ సభ రద్దు
  3. గోప్యత

Question: 18

రాష్ట్రాల మధ్య వివాదాలు కింది వాటిలో దేని కింద సుప్రీంకోర్టుకు వస్తాయి?

  1. అప్పిలేట్ అధికార పరిధి
  2. అసలు అధికార పరిధి
  3. సలహా అధికార పరిధి
  4. రిట్ అధికార పరిధి
View Answer

Answer: 2

అసలు అధికార పరిధి

Explanation:

  • సమాఖ్య న్యాయస్థానం ( Federal Court ) గా, భారత సమాఖ్యలోని వివిధ యూనిట్ల (వివిధ రాష్ట్రాల) మధ్య వివాదాలను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పరిష్కరిస్తుంది. ఇది సుప్రీం కోర్టు యెుక్క అసలు అధికార పరిధి (original jursidiction).
  1. కేంద్రం మరియు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్య వివాదాలు
  2. కేంద్రం మరియు ఏదేని ఒక రాష్ట్రం లేదా ఒకవైపు ఒక రాష్ట్రం మరియు ఇంకొక వైపు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్య వివాదాలు
  3. రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్య వివాదాలు
  • పై వివాదాల పరిష్కారం సుప్రీం కోర్టు అసలు అధికార పరిధి లోనిది.

Question: 19

రాజ్యసభకు ప్రత్యేక అధికార పరిధి ఉంది:

  1. ‘ద్రవ్య బిల్లు’ను ఆమోదించడం
  2. ‘కట్ మోషన్’ ఆమోదించడం
  3. రాష్ట్ర జాబితాలోని ఒక అంశంపై శాసనం చేయడానికి పార్లమెంటును ఆమోదించడం
  4. యుద్ధం ప్రకటించడం మరియు యుద్ధాన్ని ముగించడం
View Answer

Answer: 3

రాష్ట్ర జాబితాలోని ఒక అంశంపై శాసనం చేయడానికి పార్లమెంటును ఆమోదించడం

Explanation:

  • రాజ్యసభ ప్రత్యేక అధికారాలు : ( ఈ అధికారాలు రాజ్యసభకు మాత్రమే ఉంటాయి)
  1. అధికరణ 249 ప్రకారం రాజ్యసభ , రాష్ట్ర జాబితాలో పేర్కొనబడిన అంశంపై చట్టం చేయడానికి పార్లమెంటుకు అధికారం ఇవ్వగలదు.
  2. అధికరణ 312 ప్రకారం రాజ్యసభ, కేంద్రం మరియు రాష్ట్రాలకు ఉమ్మడిగా కొత్త అఖిల భారత సేవలను రూపొందించడానికి పార్లమెంటుకు అధికారం ఇవ్వగలదు.
  3. అధికరణ 67 ప్రకారం ఉపరాష్ట్రపతి పదవీచ్యుతున్ని చేయడానికి తీర్మానం రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టబడుతుంది.

Question: 20

24వ రాజ్యాంగ సవరణ చేయడానికి పార్లమెంటును ఈ క్రింది వాటిలో ఏ కేసు ప్రేరేపించింది?

ఎ. గోలక్ నాథ్ కేసు
బి. కేశవానంద భారతి కేసు
సి. శంకరి ప్రసాద్ కేసు
డి. సజ్జన్ సింగ్ కేసు
సరైన జవాబుని ఎంచుకోండి.

  1. ఎ మాత్రమే.
  2. డి మాత్రమే.
  3. సి మరియు డి మాత్రమే
  4. బి మరియు డి మాత్రమే
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Explanation:

24వ రాజ్యాంగ సవరణ చట్టానికి దారితీసిన సుప్రీంకోర్టు తీర్పు గోలక్ నాథ్ కేసు(1967):

  • గోలక్ నాథ్ కేసులో సుప్రీం కోర్టు ఇంతకు ముందు సజ్జన్ సింగ్ కేసులో ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. గోలక్ నాథ్ కేసులో ప్రాథమిక హక్కులను హరించే లేదా ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటు కు లేదని తెలిపింది. అంతే కాకుండా అధికరణ 368 సవరణాధికారం పార్లమెంటుకు ఇవ్వదని తీర్పునిచ్చారు.
  • అందువలన కేంద్రప్రభుత్వం 24వ రాజ్యాంగ సవరణ చట్టం,1971 చేసింది. 24వ సవరణ చట్టం ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే(ప్రాథమిక హక్కులతో సహా) అధికారం పార్లమెంటు కు కలదు. అంతే కాకుండా, రాజ్యాంగ సవరణకు రాష్ట్రపతి సమ్మతిని ఖచ్చితం చేసింది.
Recent Articles