Home  »  TGPSC 2022-23  »  Indian Polity-7

Indian Polity-7 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారత రాజ్యాంగం ప్రకారం మూడు అంచెల పంచాయతీ రాజ్ నిర్మాణానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. పంచాయితీ రాజ్ సంస్థల యొక్క మూడు స్థాయిలు ప్రజలచే నేరుగా ఎన్నుకోబడతాయి.
బి. అన్ని పంచాయితీ సంస్థలలో మూడింట ఒక వంతు స్థానాలు మహిళలకు కేటాయించబడ్డాయి.
ఎంపికలు:

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదు
View Answer

Answer: 3

ఎ మరియు బి రెండూ

Explanation: 

  • భారతదేశంలో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగబద్ధం చేయబడ్డాయి. ఈ చట్టం ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పాటయింది. పంచాయతీ రాజ్ అంటే గ్రామీణ స్థానిక ప్రభుత్వం(పాలన). ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9వ భాగం (Part – IX) మరియు 11వ షెడ్యూల్ రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. 9వ భాగంలో   ఆర్టికల్ 243 నుండి ఆర్టికల్ 243(O) వరకు మొత్తం 16 ఆర్టికల్స్( అధికరణలు లేదా ప్రకరణలు లేదా నిబంధనలు) ఉన్నాయి. 11వ షెడ్యూల్లో పంచాయితీల పరిధిలో ఉంచబడిన 29 అంశాలు ఉన్నాయి.
  • అధికరణ 243D, పంచాయతీలలో సీట్ల రిజర్వేషన్ గూర్చి తెలుపుతుంది.
  • అధికరణ 243D (3) : పంచాయతీలలో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ కల్పిస్తుంది.

Question: 7

1992లో భారత పార్లమెంటు ఆమోదించిన రాజ్యాంగ సవరణల సందర్భంలో కింది వాటిలో సరైనది ఏది?
ఎ. 74వ సవరణ పట్టణ స్థానిక ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలను రూపొందించింది.
బి. 75వ సవరణ గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినది.
ఎంపికలు :

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదు
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Explanation: 

  • 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 , పట్టణ స్థానిక పరిపాలనకు  ( 1 జూన్ , 1993 నుండి అమలులోకి వచ్చింది) బీజం వేసింది.
  • గ్రామీణ స్థానిక పరిపాలన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చింది.

75వ రాజ్యాంగ సవరణ చట్టం, 1994 :

  • అద్దె  మరియు దాని నియంత్రణకు సంబంధించిన వివాదాలు మరియు యజమానులు మరియు కిరాయిదారుల హక్కులు , వివాదాల పరిష్కారాలపై న్యాయనిర్ణయానికి అద్దె ట్రిబ్యూనల్ ( Rent Tribunals ) ఏర్పాటు కోసం చేయబడిన చట్టం.

Question: 8

భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ‘గ్రామ పంచాయతీల సంస్థ’కు సంబంధించినది.

  1. ఆర్టికల్ 38
  2. ఆర్టికల్ 40
  3. ఆర్టికల్ 42
  4. ఆర్టికల్ 44
View Answer

Answer: 2

ఆర్టికల్ 40

Explanation: 

  • గ్రామీణ పంచాయితీల ఏర్పాటు గూర్చి తెలియజేసే ఏకైక ఆదేశిక సూత్రం

అధికరణ 40 :  

  • గ్రామ పంచాయితీల ఏర్పాటు
  • గ్రామ పంచాయితీల ఏర్పాటుకు రాష్ట్రం చర్యలు తీసుకోవాలి అంతే కాక అవి స్థానిక ప్రభుత్వాలుగా పనిచేయడానికి కావాల్సిన అధికారాలు కల్పించాలి.

అధికరణ 44 :  

  • పౌరులకు యూనిఫాం సివిల్ కోడ్ ( ఉమ్మడి పౌర స్మృతి లేదా ఏకరీతి పౌర స్మృతి )
  • భారతదేశ భూభాగం అంతటా పౌరులకు ఒకే విధమైన పౌర నియమావళి ( ఏకరీతి పౌర స్మృతి ) ని అందించేందుకు  రాష్ట్రం కృషి చేయాలి.

అధికరణ 42 :

  • న్యాయ మరియు మానవీయ పని పరిస్థితులను కల్పించడానికి రాష్ట్రం కృషి చేయాలి.
  • ప్రసూతి ఉపశమనం ( సెలవులు ) కల్పించాలి.

Question: 9

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి అధికారాన్ని తీసివేయడం మరియు స్థానిక ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు, దానిని …… అంటారు.

  1. డీలిమిటేషన్
  2. సరిహద్దుల విభజన
  3. నోట్ల రద్దు
  4. వికేంద్రీకరణ
View Answer

Answer: 4

వికేంద్రీకరణ

Explanation: 

అధికార వికేంద్రీకరణ (Decentralization of Power) :

  • కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాల మధ్య పరిపాలన విభజనను వికేంద్రీకరణ అంటారు. పాలన ఒకే చోట కేంద్రీకృతం కాకుండా వివిధ స్థాయిలలో విడదీయడమే వికేంద్రీకరణ.

డిలిమిటేషన్ (Delimitation) :

  • రాష్ట్రాలలోని లోక్ సభ మరియు శాసన సభ ల సీట్లు మరియు ప్రాదేశిక నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియే డిలిమిటేషన్.

Question: 10

భారతదేశంలోని స్థానిక ప్రభుత్వ సంస్థలకు ……లో రాజ్యాంగ హెూదా కల్పించబడింది.

  1. 1983
  2. 1986
  3. 1993
  4. 1996
View Answer

Answer: 3

1993

Explanation: 

  • భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాల ద్వారా ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు స్పష్టమైన మార్గనిర్దేశనం చేసింది. మరింత నిర్దిష్టంగా , సంస్థాగతంగా ప్రజాస్వామ్య లేదా పరిపాలన వికేంద్రీకరణ ను ప్రోత్సహించింది 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణలు.
  • 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 – గ్రామీణ స్థానిక పరిపాలన (24 ఏప్రిల్ , 1993 నుండి అమలులోకి వచ్చింది)
  • 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 – పట్టణ స్థానిక పరిపాలన (1 జూన్ , 1993 నుండి అమలులోకి వచ్చింది)
Recent Articles