Home  »  TGPSC 2022-23  »  Indian Polity-7

Indian Polity-7 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భారత రాజ్యాంగం ప్రకారం, రాష్ట్రపతి వీటిని కలిగి ఉన్న ఎలక్టోరల్ కాలేజీ సభ్యులచే ఎన్నుకోబడతారు:
ఎ. పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు

బి. రాష్ట్రాల లెజిస్లేటివ్ కౌన్సిల్ కు ఎన్నికైన సభ్యులు

సి. రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికైన సభ్యులు
ఎంపికలు :

  1. ఎ మరియు బి
  2. ఎ మరియు సి
  3. బి మరియు సి
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 2

ఎ మరియు సి

Explanation: 

రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజి సభ్యులు :

  1. పార్లమెంటు కు ఎన్నికైన సభ్యులు (లోక్ సభ మరియు రాజ్యసభకు ఎన్నికైన వారు మాత్రమే)
  2. రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికైన సభ్యులు
  3. కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ మరియు పుదుచ్చేరి రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికైన సభ్యులు ( ఈ నిబంధన 70వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా చేర్చారు, 1995 నుండి అమల్లోకి వచ్చింది)

Question: 12

ఈ క్రింది వాటిలో ‘ప్రాంతీయ పార్టీ – సంబంధిత రాష్ట్రం’ యొక్క ఏ జత సరిగ్గా సరిపోలుతుంది?
ఎ. పీపుల్స్ డెమోక్రటిక్ అలయన్స్ – అస్సాం

బి. మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీ – గోవా
ఎంపికలు :

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదు
View Answer

Answer: 2

బి మాత్రమే

Explanation: 

  • పీపుల్స్ డెమోక్రటిక్ అలయిన్స్ మణిపూర్ కు చెందిన గుర్తింపు పొందని రిజిస్టర్ అయిన పార్టీ.
  • మణిపూర్ లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ.
  • మణిపూర్ ముఖ్యమంత్రి – N బీరెన్ సింగ్. బీరెన్ సింగ్ సనమహి మతాన్ని ఆచరించే మెయిటీ వర్గానికి చెందినవారు.
  • మణిపూర్ శాసన సభ బలం : 60
  • BJP – 37, కాంగ్రెస్ – 7, NPP ( నేషనల్ పీపుల్స్ పార్టీ ) – 7.
  • నాగస్ పీపుల్ ఫ్రంట్ ( NPF ) – 5, జనతా దళ్ ( యునైటెడ్ ) – 1
  • పోర్చుగీస్ పాలన ముగిసి భారత యూనియన్లో భాగమైన తర్వాత గోవాలో అధికారంలోకి వచ్చిన మొదటి పార్టీ మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీ. గోవా మొదటి ముఖ్యమంత్రి దయానంద్ బందొడ్కర్.

Question: 13

భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో కింది అంశాలలో ఏది చేర్చబడింది?

  1. బ్యాంకింగ్
  2. జైలు
  3. వ్యవసాయం
  4. విద్య
View Answer

Answer: 4

విద్య

Explanation: 

  • కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాలు 3 జాబితాల రూపంలో విడదీయబడ్డాయి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా.ఈ అధికార విభజన జాబితాలు 7వ షెడ్యూల్ లో ఉన్నాయి.
  • కేంద్ర జాబితాలోని మొత్తం అంశాలు ( విషయాలు )  – 98
  • రాష్ట్ర జాబితాలోని మొత్తం అంశాలు  –  66
  • ఉమ్మడి జాబితాలోని మొత్తం అంశాలు  – 52

యూనియన్ జాబితా కొన్ని విషయాలు:

  • రక్షణ, సైన్యం, అంతర్జాతీయ సంబంధాలు, ఓడరేవులు, రైల్వేలు, హైవేలు, కమ్యూనికేషన్, అణు శక్తి , విదేశీ వ్యవహారాలు, యుద్ధం & శాంతి , బ్యాంకింగ్ , తంతి తపాలా , విమానయానం , నౌక మార్గాలు , ఓడరేవులు , విదేశీ వాణిజ్యం, కరెన్సీ & నాణాలు.

రాష్ట్ర జాబితా కొన్ని విషయాలు:

  • పబ్లిక్ ఆర్డర్, పోలీసు, ప్రజారోగ్యం మరియు పారిశుధ్యం, ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీలు, బెట్టింగ్ మరియు జూదం, వ్యవసాయం , జైలు, స్థానిక ప్రభుత్వం , భూమి, మద్యం , పశువులు & పశుసంవర్ధకం , రాష్ట్ర సర్వీసులు.

ఉమ్మడి జాబితా కొన్ని విషయాలు:

  • చదువు, అడవి, వర్తక సంఘం, వివాహం, దత్తత, వారసత్వం, కల్తీ, ట్రస్ట్లు , కాంట్రాక్ట్లు , న్యాయ, వైద్య మరియు ఇతర వృత్తులు , విద్య ( సాంకేతిక & వైద్య విద్య), విశ్వవిద్యాలయాలు , దివాళా, సామాజిక భద్రత, బాయిలర్స్, ఫ్యాక్టరీలు, విద్యుత్, తూనికలు మరియు కొలతలు, జనన & మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్, దినపత్రికలు, పుస్తకాలు & ప్రింటింగ్ ప్రెస్లు.

Question: 14

భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ లో పేర్కొన్న ఏదైనా తీర్పు లేదా ఆదేశాన్ని సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుందని పేర్కొంది?

  1. ఆర్టికల్ 134
  2. ఆర్టికల్ 137
  3. ఆర్టికల్ 144
  4. ఆర్టికల్ 147
View Answer

Answer: 2

ఆర్టికల్ 137

Explanation: 

అధికరణ 137 :

  • తీర్పులు మరియు ఆదేశాలపై సుప్రీం కోర్టు సమీక్ష
  • పార్లమెంటు చేసిన ఏదేని చట్టం లేదా అధికరణ 145 కు లోబడి, సుప్రీం కోర్టు తాను ఇచ్చిన తీర్పులను లేదా ఆదేశాలను సమీక్షించవచ్చు.

అధికరణ 134 :

  • నేర విషయాలలో సుప్రీం కోర్టు యొక్క అప్పిల్లెట్ అధికార పరిధికి సంబంధించిన నిబంధనలు

అధికరణ 144 :

  • భారత దేశంలోని (భారత భూభాగంలోని) అన్ని అధికార వ్యవస్థలు, పౌర మరియు న్యాయపరమైనవి అన్ని సుప్రీం కోర్టు కు సహాయంగా ఉండాలి.

Question: 15

బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ……లో ఏర్పడింది.

  1. 1984
  2. 1986
  3. 1988
  4. 1990
View Answer

Answer:1

1984

Explanation: 

  • బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ని  మాన్యవర్ కాన్షీరామ్ 1984లో స్థాపించారు. బహుజనుల ప్రాతినిధ్యం పెంచడం, ఉన్నతి కోసం మరియు వారి రాజకీయ ఏకీకరణకు పార్టీ ఆవిర్భవించింది. బహుజనులు అంటే మెజారిటీ గా ఉన్న సామాజిక వర్గాల వారు అంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతులు.
  • కాన్షీరామ్ పై అంబేద్కర్ వ్యక్తిత్వ మరియు తత్వ ప్రభావం ఉంది. పార్టీ స్థాపనకు ముందు 1982లో  పూనా ఒప్పందం ( పూనా ప్యాక్ట్) 50 సం,,లు పూర్తి అయినా సందర్భంగా ఒక పుస్తకాన్ని ఆయన ప్రచురించారు. దాని పేరు ది చంచా ఏజ్ (The Chamcha Age). కాన్షీరామ్ తన తరువాత BSP నాయకత్వాన్ని మాయావతికి అందించారు.
Recent Articles