Home  »  TGPSC 2022-23  »  Indian Polity-7

Indian Polity-7 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి భారత సర్వోన్నత న్యాయస్థానం ఎన్ని రిట్లను జారీ చేయవచ్చు?

  1. ఐదు
  2. ఆరు
  3. ఏడు
  4. ఎనిమిది
View Answer

Answer: 1

ఐదు

Explanation: 

  • సుప్రీం కోర్టు మరియు హైకోర్టులకు ప్రాథమిక హక్కులను ( Fundamental Rights) అమలుచేయడానికి రిట్స్(ఆదేశాలు) జారీ చేయగల అధికారం కలదు. రిట్స్ 5 రకాలు. అవి హెబియస్ కార్పస్ , మాండమస్, ప్రోహిబిషన్, సెర్టియోరరి మరియు కో వారెంటో.
  1. హెబియస్ కార్పస్ :
  • ఈ రిట్ వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క సంరక్షకారి. నిర్బంధ చట్టబద్ధత కు సవాలు ఉన్నప్పుడు విధించబడుతుంది.ఇది మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న వ్యక్తికి కోర్టు జారీ చేసే ఆదేశం.
  • హేబియస్ కార్పస్ లాటిన్ పదం. దీని అర్థం వ్యక్తి యెుక్క శరీరం కలిగి ఉండుట. అదుపులోకి తీసుకోబడ్డ వ్యక్తిని న్యాయస్థానం ముందుంచటానికి ఈ ఆదేశం.
  1. మాండమస్ :
  • ఇది తన విధులను నిర్వర్తించమని ప్రభుత్వ అధికారికి కోర్టు జారీ చేసే ఆదేశం. ఇది ప్రభుత్వ అధికారికి మాత్రమే కాదు ప్రభుత్వ సంస్థలకు, వ్యవస్థలకు, దిగువ కోర్టులకు ట్రిబ్యునల్(Tribunal)కు విధించబడును. ప్రైవేటు వ్యక్తులపై లేదా వ్యవస్థలపై జారీ చేయబడదు.
  1. ప్రోహిబిషన్ (Prohibition) :
  • ఇది పై కోర్టు తన దిగువ(కింది) కోర్టులు లేదా ట్రిబ్యునల్ తన అధికార పరిధి(జురిస్డిక్షన్) దాటి లేదా తనకు లేని అధికార పరిధిలోకి చొచ్చుకు వెళ్ళినప్పుడు జారీ చేస్తాయి.
  1. సర్టియోరరి :
  • ఇది దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్‌కు పెండింగ్‌లో ఉన్న కేసును బదిలీ చేయడానికి లేదా ఒక కేసులో తరువాతి ఆర్డర్‌ను రద్దు చేయడానికి పై కోర్టు జారీ చేసే ఆదేశం.
  1. కో వారెంటో :
  • ఇది ఒక వ్యక్తి ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన దావా యొక్క చట్టబద్ధతను విచారించడానికి కోర్టు జారీ చేసే ఆదేశం.

Question: 17

ఆగస్టు 2023 నాటికి, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ద్విసభ శాసనసభ ఉంది?

  1. రాజస్థాన్
  2. తెలంగాణ
  3. ఒడిశా
  4. మధ్యప్రదేశ్
View Answer

Answer: 2

తెలంగాణ

Explanation: 

  • భారతదేశ శాసన వ్యవస్థ ద్విసభా విధానం కలిగి ఉంది.
  • కేంద్ర శాసన విభాగం –  లోక్ సభ ( దిగువ సభ )మరియు రాజ్యసభ ( ఎగువ సభ )
  • రాష్ట్రాల శాసన విభాగం – శాసన సభ ( విధాన సభ )మరియు శాసన మండలి ( విధాన పరిషత్ ).
  • అధికరణ 169 ప్రకారం రాష్ట్రాలు కనుక రాష్ట్ర శాసన మండలి ఏర్పాటుకు లేదా రద్దుకు మూడింట రెండు వంతుల మెజారిటీకి తక్కువ కాని మెజారిటీతో ఒక తీర్మానం చేస్తే ఆ రాష్ట్ర తీర్మానానికి అనుగుణంగా (మండలి ఏర్పాటుకు లేదా రద్దుకు)  పార్లమెంటు చట్టం చేయవచ్చు.
  • ప్రస్తుతం శాసన మండలి కలిగి ఉన్న రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, కర్ణాటక , బీహార్ , మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్.

Question: 18

భారత రాజ్యాంగం విషయంలో కింది వాటిలో ఏవి సరైనవి?

ఎ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 ‘పౌరులకు ఏకరీతి పౌర నియమావళి’కి సంబంధించినది.
బి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 50 ‘ఎగ్జిక్యూటివ్ నుండి న్యాయవ్యవస్థ విభజన’తో సంబంధం కలిగి ఉంది.
ఎంపికలు :

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదు
View Answer

Answer: 2

బి మాత్రమే

Explanation: 

అధికరణ 40 :  

  • గ్రామ పంచాయితీల ఏర్పాటు
  • గ్రామ పంచాయితీల ఏర్పాటుకు రాష్ట్రం చర్యలు తీసుకోవాలి అంతే కాక అవి స్థానిక ప్రభుత్వాలుగా పనిచేయడానికి కావాల్సిన అధికారాలు కల్పించాలి.

అధికరణ 44 :  

  • పౌరులకు యూనిఫాం సివిల్ కోడ్ ( ఉమ్మడి పౌర స్మృతి లేదా ఏకరీతి పౌర స్మృతి )
  • భారతదేశ భూభాగం అంతటా పౌరులకు ఒకే విధమైన పౌర నియమావళి ( ఏకరీతి పౌర స్మృతి ) ని అందించేందుకు  రాష్ట్రం కృషి చేయాలి.

అధికరణ 50 : 

  • కార్యనిర్వహక వ్యవస్థ నుండి న్యాయవ్యవస్థ వేర్పాటు
  • ప్రభుత్వ సేవలలో కార్యనిర్వహక వ్యవస్థ నుండి న్యాయవ్యవస్థను వేరుచెయ్యడానికి రాష్ట్రం చర్యలు తీసుకోవాలి.
  • అధికరణ 40 & అధికరణ 50 ఆదేశిక సూత్రాలు.

Question: 19

ఈ క్రింది వాటిలో ఏ జత ‘ఆర్టికల్ – ప్రొవిజన్’ భారత రాజ్యాంగం యొక్క సందర్భానికి  సరిగ్గా సరిపోలుతుంది?
ఎ. ఆర్టికల్ 21 – జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క రక్షణ

బి. ఆర్టికల్ 22 నేరాలకు సంబంధించిన శిక్షకు సంబంధించి

రక్షణ ఎంపికలు :

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదు
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Explanation: 

ఆర్టికల్ 21 :

  • జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ (Privacy) రక్షణ హక్కు, ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు, విదేశీ యాన హక్కు, నిద్రించే హక్కు, సమాన అవకాశాల హక్కు , శబ్ద కాలుష్య వ్యతిరేక హక్కు మొదలగునవి.

ఆర్టికల్ 22 :

  • కొన్ని కేసులలో అరెస్టు మరియు నిర్బంధం నుండి రక్షణ.

Question: 20

ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ‘పాకిస్తాన్ కు వలస వచ్చిన కొంతమంది వలసదారులు పౌరసత్వ హక్కులు’కు సంబంధించినది?

  1. ఆర్టికల్ 5
  2. ఆర్టికల్ 7
  3. ఆర్టికల్ 9
  4. ఆర్టికల్ 11
View Answer

Answer: 2

ఆర్టికల్ 7

Explanation: 

అధికరణ 7 :

  • పాకిస్తాన్‌కు వలస వచ్చిన కొంతమంది పౌరసత్వ హక్కులు
  • మార్చి, 1947 మొదటి రోజు తర్వాత, భారతదేశ భూభాగం నుండి ఇప్పుడు పాకిస్తాన్‌లో చేర్చబడిన భూభాగానికి వలస వచ్చిన వ్యక్తి భారతదేశ పౌరుడిగా పరిగణించబడడు:

అధికరణ 5 :

  • రాజ్యాంగం ప్రారంభంలో పౌరసత్వం
  • ఈ రాజ్యాంగం ప్రారంభంలో భారతదేశ భూభాగంలో తన నివాసాన్ని కలిగి ఉన్న ప్రతి వ్యక్తి మరియు-
  1. భారతదేశ భూభాగంలో జన్మించిన వ్యక్తి లేదా
  2. వ్యక్తి తల్లితండ్రులు భారతదేశ భూభాగంలో జన్మించినవారైనా లేదా
  3. రాజ్యాంగ ప్రారంభానికి ముందు ఐదు సంవత్సరాల కంటే తక్కువ కాకుండా భారతదేశ భూభాగంలో సాధారణంగా నివసించినవారు
  • భారతదేశ పౌరులు అవుతారు.
Recent Articles