- Environment-8
 - Telangana Schemes-6
 - Telangana Schemes-5
 - Telangana Schemes-4
 - Telangana Schemes-3
 - Central Schemes-4
 - Central Schemes-3
 - TS Culture-10
 - TS Culture-9
 - Telangana History-7
 - Telangana History-6
 - Telangana History-5
 - Telangana History-4
 - TS Culture-8
 - TS Culture-8
 - TS Culture-7
 - TS Culture-6
 - TS Culture-5
 - TS Culture-4
 - Telangana Movement-17
 - Telangana Movement-16
 - Telangana Movement-15
 - Telangana Movement-14
 - Telangana Movement-13
 - Telangana Movement-12
 - Telangana Movement-11
 - Telangana Movement-10
 - Telangana Economy-5
 - Telangana Economy-4
 - Central Schemes-2
 - Central Schemes-1
 - Telangana Schemes-2
 - Telangana Schemes-1
 - Indian Geography-15
 - Environment-7
 - Environment-6
 - Environment-5
 - Disaster Management-4
 - Telangana Movement-9
 - Environment-4
 - Indian Geography-14
 - Indian Geography-13
 - Indian Geography-12
 - Indian Geography-11
 - General Science – Science and Technology-16
 - General Science – Science and Technology-15
 - General Science – Science and Technology-14
 - General Science – Science and Technology-13
 - General Science – Science and Technology-12
 - General Science – Science and Technology-11
 - Telangana Movement-8
 - Telangana Movement-7
 - Telangana Movement-6
 - Disaster Management-3
 - Environment-3
 - Indian Geography-10
 - Indian Geography-9
 - Indian Geography-8
 - Indian Geography-7
 - Indian Geography-6
 - Indian Geography-5
 - Indian Geography-4
 - Telangana Movement-5
 - TS Culture-3
 - Telangana Movement-4
 - Indian Polity-17
 - Disaster Management-2
 - Disaster Management-1
 - Environment-2
 - Environment-1
 - Indian Geography-3
 - Indian Geography-2
 - Indian Geography-1
 - Telangana Economy-3
 - Telangana Economy-2
 - Telangana Economy-1
 - Indian Economy-19
 - Indian Economy-18
 - Indian Economy-17
 - Indian Economy-16
 - General Science – Science and Technology-10
 - General Science – Science and Technology-9
 - General Science – Science and Technology-8
 - General Science – Science and Technology-7
 - General Science – Science and Technology-6
 - General Science – Science and Technology-5
 - General Science – Science and Technology-4
 - General Science – Science and Technology-3
 - General Science – Science and Technology-2
 - Telangana Movement-3
 - Telangana History-3
 - Telangana Movement-2
 - General Science – Science and Technology-1
 - Indian Economy-15
 - Indian Economy-14
 - Indian Economy-13
 - Indian Economy-12
 - Indian Economy-11
 - Indian Economy-10
 - Indian Economy-9
 - Indian Economy-8
 - Indian Economy-7
 - Indian Polity-16
 - Indian Polity-15
 - Indian Polity-14
 - Indian Polity-13
 - Indian Polity-12
 - Indian Polity-11
 - Indian Economy-6
 - Indian Economy-5
 - Indian Economy-4
 - Indian Economy-3
 - Indian Economy-2
 - Indian Economy-1
 - TS Culture-2
 - Telangana History-2
 - Telangana Movement-1
 - TS Culture-1
 - Telangana History-1
 - Indian Polity-10
 - Indian Polity-9
 - Indian Polity-8
 - Indian Polity-7
 - Indian Polity-6
 - Indian Polity-5
 - Indian Polity-4
 - Indian Polity-3
 - Indian Polity-2
 - Indian Polity-1
 - Indian History-15
 - Indian History-14
 - Indian History-13
 - Indian History-12
 - Indian History-11
 - Indian History-10
 - Indian History-9
 - Indian History-8
 - Indian History-7
 - Indian History-6
 - Indian History-5
 - Indian History-4
 - Indian History-3
 - Indian History-2
 - Indian History-1
 
Question: 11
భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ‘మున్సిపాలిటీల అధికారాలు, అధికారం మరియు బాధ్యతలు మొదలైన వాటికి’ సంబంధించినది?
- ఆర్టికల్ 243C
 - ఆర్టికల్ 243W
 - ఆర్టికల్ 243S
 - ఆర్టికల్ 243
 
Answer: 2
ఆర్టికల్ 243W
Explanation:
అధికరణ 243W :
- రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా మున్సిపాలిటీలు స్థానిక స్వయం ప్రభుత్వ వ్యవస్థలుగా పని చేయటానికి కావలసిన అధికారాలను కల్పించాలి. అటువంటి చట్టము మునిసిపాలిటీల అధికారాలు మరియు బాధ్యతలకు సంబంధించిన నిబంధనలు కలిగి ఉండాలి. ఆ నిబంధనలు ఆర్థిక అభివృద్ధి మరియు సామాజిక న్యాయము కోసం తయారుచేయబడిన ప్లాన్స్ మరియు 12వ షెడ్యూల్ లోని అంశాలు అయి ఉండాలి.
 
అధికరణ 243G :
- రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా పంచాయితీలు స్థానిక స్వయం ప్రభుత్వ వ్యవస్థలుగా పని చేయటానికి కావలసిన అధికారాలను కల్పించాలి. అటువంటి చట్టము పంచాయితీల అధికారాలు మరియు బాధ్యతలకు సంబంధించిన నిబంధనలు కలిగి ఉండాలి. ఆ నిబంధనలు ఆర్థిక అభివృద్ధి మరియు సామాజిక న్యాయము కోసం తయారుచేయబడిన ప్లాన్స్ మరియు 12వ షెడ్యూల్ లోని అంశాలు కలిగి ఉండాలి.
 - అధికరణ 243C పంచాయతీల కూర్పుకు సంబంధించినది.
 - అధికరణ 243 జిల్లా, మధ్యంతర స్థాయి ,గ్రామసభ,పంచాయితీ ,పంచాయతీ ఏరియా, జనాభా మరియు గ్రామము పదాల నిర్వచనాలు కలిగి ఉంది.
 
Question: 12
గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి కింది రాజ్యాంగ సవరణలు ఏవి?
- 72వ సవరణ
 - 73వ సవరణ
 - 74వ సవరణ
 - 75వ సవరణ
 
Answer: 2
73వ సవరణ
Explanation:
- రాజ్యాంగబద్ధం కాక మునుపు కూడా పంచాయతీ రాజ్ వేర్ వేరు రూపాలలో వివిధ రాష్ట్రాలలో ( వాటి వారసత్వ వ్యవస్థలకనుగుణంగా ) అమలులో ఉంది. స్వాతంత్ర్యానంతరం పంచాయతీ రాజ్ వ్యవస్థను మొట్టమొదటి సారి అమలు చేసిన రాష్ట్రం రాజస్తాన్ . ఇక్కడ 1959 లో గాంధీ జయంతి నాడు నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు చేతుల మీదుగా పంచాయతీ వ్యవస్థ ఆరంభించబడింది.
 - 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 – గ్రామీణ స్థానిక పరిపాలన (24 ఏప్రిల్ , 1993 నుండి అమలులోకి వచ్చింది). ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9వ భాగం (Part – IX) మరియు 11వ షెడ్యూల్ రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. 9వ భాగంలో ఆర్టికల్ 243 నుండి ఆర్టికల్ 243(O) వరకు మొత్తం 16 ఆర్టికల్స్( అధికరణలు )ఉన్నాయి. 11వ షెడ్యూల్లో పంచాయితీల పరిధిలో ఉంచబడిన 29 అంశాలు ( విషయాలు ) ఉన్నాయి.
 
Question: 13
రాజ్యాంగ సవరణలు స్థానిక ప్రభుత్వాలకు …… విషయాలను కేటాయించాయి.
- 16
 - 19
 - 24
 - 29
 
Answer: 4
29
Explanation:
- సంస్థాగతంగా ప్రజాస్వామ్య లేదా పరిపాలన వికేంద్రీకరణ ను ప్రోత్సహించింది 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణలు. దేశంలో వీటి ద్వారా స్థానిక స్వయం పరిపాలన ఉచ్ఛ దశకు చేరుకుంది.
 - 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 – గ్రామీణ స్థానిక పరిపాలన ( పంచాయితీలు ) (24 ఏప్రిల్ , 1993 నుండి అమలులోకి వచ్చింది)
 - 24 ఏప్రిల్ – జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంగా జరపబడుతుంది.
 - 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 – పంచాయతీలు – 11వ షెడ్యూల్ ( 29 అంశాలు)
 - 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 – పట్టణ స్థానిక పరిపాలన ( 1 జూన్ , 1993 నుండి అమలులోకి వచ్చింది)
 - 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 – మున్సిపాలిటీలు – 12వ షెడ్యూల్ ( 18 అంశాలు (functional items) )
 
Question: 14
భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ ‘పంచాయతీల అధికారాలు, అధికారం మరియు బాధ్యతలకు’ సంబంధించినది?
- తొమ్మిదవ
 - పదవ
 - పదకొండవ
 - పన్నెండ
 
Answer: 3
పదకొండవ
Explanation:
- పంచాయతీల అధికారాలు మరియు బాధ్యతలు 11వ షెడ్యూల్లో ఉన్నాయి . ఇందులో 29 అంశాలు ఉన్నాయి. 11వ షెడ్యూల్ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో భాగమైంది .
 
Question: 15
లోక్సభ అధికారాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది ?
ఎ. ఇది మనీ మరియు నాన్ మనీ బిల్లులను ప్రవేశపెట్టి అమలు చేయగలదు.
బి. రాష్ట్ర జాబితాలో చేర్చబడిన విషయాలపై చట్టాలను రూపొందించే అధికారాన్ని ఇది యూనియన్ పార్లమెంటుకు ఇవ్వగలదు.
ఎంపికలు :
- ఎ మాత్రమే
 - బి మాత్రమే
 - ఎ మరియు బి రెండూ
 - ఎ లేదా బి కాదు
 
Answer: 1
ఎ మాత్రమే
Explanation:
- మనీ బిల్లు కేవలం లోక్ సభ లో మాత్రమే ప్రవేశపెట్టబడుతుంది. ఇతర బిల్లులు ఆమోదానికి లోక్ సభ తరువాత రాజ్య సభ లో ప్రవేశపెట్టాలి.
 - రాష్ట్ర జాబితా లోని అంశాలపై చట్టం చేయగల అధికారం పార్లమెంట్ కు కలదు.
 
