Home  »  TGPSC 2022-23  »  Indian Polity-8

Indian Polity-8 (ఇండియన్ పాలిటి) Previous Year Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

భారత రాజ్యాంగంలోని యూనియన్ జాబితాలో కింది అంశాలలో ఏది చేర్చబడింది?

ఎ. అడవులు

బి. రక్షణ

ఎంపికలు :

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమ
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదు
View Answer

Answer: 2

బి మాత్రమే

Explanation:

  • రక్షణ కేంద్ర లేదా యూనియన్ జాబితా అంశం .
  • అడవులు ఉమ్మడి జాబితా అంశం.
  • కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాలు 3 జాబితాల రూపంలో విడదీయబడ్డాయి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా.ఈ అధికార విభజన జాబితాలు 7వ షెడ్యూల్ లో ఉన్నాయి.
  • కేంద్ర జాబితాలోని మొత్తం అంశాలు ( విషయాలు )  – 98
  • రాష్ట్ర జాబితాలోని మొత్తం అంశాలు  –  66
  • ఉమ్మడి జాబితాలోని మొత్తం అంశాలు  – 52

యూనియన్ జాబితా కొన్ని విషయాలు:

  • రక్షణ, సైన్యం, అంతర్జాతీయ సంబంధాలు, ఓడరేవులు, రైల్వేలు, హైవేలు, కమ్యూనికేషన్, అణు శక్తి , విదేశీ వ్యవహారాలు, యుద్ధం & శాంతి , బ్యాంకింగ్ , తంతి తపాలా , విమానయానం , నౌక మార్గాలు , ఓడరేవులు , విదేశీ వాణిజ్యం, కరెన్సీ & నాణాలు.

రాష్ట్ర జాబితా కొన్ని విషయాలు:

  • పబ్లిక్ ఆర్డర్, పోలీసు, ప్రజారోగ్యం మరియు పారిశుధ్యం, ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీలు, బెట్టింగ్ మరియు జూదం, వ్యవసాయం , జైలు, స్థానిక ప్రభుత్వం , భూమి, మద్యం , పశువులు & పశుసంవర్ధకం , రాష్ట్ర సర్వీసులు.

ఉమ్మడి జాబితా కొన్ని విషయాలు:

  • చదువు, అడవులు, వర్తక సంఘం, వివాహం, దత్తత, వారసత్వం, కల్తీ, ట్రస్ట్లు , కాంట్రాక్ట్లు , న్యాయ, వైద్య మరియు ఇతర వృత్తులు , విద్య ( సాంకేతిక & వైద్య విద్య), విశ్వవిద్యాలయాలు , దివాళా, సామాజిక భద్రత, బాయిలర్స్, ఫ్యాక్టరీలు, విద్యుత్, తూనికలు మరియు కొలతలు, జనన & మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్, దినపత్రికలు, పుస్తకాలు & ప్రింటింగ్ ప్రెస్లు.

Question: 17

కింది వాటిలో 30 కంటే ఎక్కువ లోక్సభ నియోజకవర్గాలను కలిగి ఉన్న రాష్ట్రం ఏది?
ఎ. పశ్చిమ బెంగాల్

బి. మధ్యప్రదేశ్
ఎంపికలు :

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ లేదా బి కాదు
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Explanation:

  • భారతదేశంలో అత్యధిక లోక్ సభ స్థానాలు కలిగిన రాష్ట్రము ఉత్తర ప్రదేశ్.
  • ఉత్తర ప్రదేశ్ లో 80 లోక్ సభ స్థానాలు కలవు.

రాష్ట్రాలు – లోక్ సభ స్థానాల సంఖ్య :

  1. ఉత్తర ప్రదేశ్ – 80
  2. మహారాష్ట్ర – 48
  3. పశ్చిమ బెంగాల్ – 42
  4. బీహార్ – 40
  5. తమిళనాడు – 39
  6. మధ్య ప్రదేశ్ – 29
  7. గుజరాత్ – 26
  8. ఆంధ్రప్రదేశ్ – 25
  9. రాజస్థాన్ – 25

Question: 18

ఒక వ్యక్తి పదవిలో ఉన్నాడని, అయితే ఆ పదవిని నిర్వహించడానికి అర్హత లేదని కోర్టు గుర్తిస్తే, అది ….. యొక్క రిట్ను జారీ చేస్తుంది.

  1. కో వారెంటో
  2. హెబియస్ కార్పస్
  3. మాండమస్
  4. సేర్టియోరరీ
View Answer

Answer: 1

కో వారెంటో

Explanation:

  • ఒక వ్యక్తి నిర్వహిస్తున్న ఆఫీసుకు అతడు ఆ పదవిని కలిగి ఉండడానికి అనర్హుడు అని కోర్ట్ భావిస్తే అది జారీ చేసే రిట్ కో వారంటో.

 

Question: 19

రాజ్యసభకు ఎక్స్-అఫీషియో చైర్మన్ గా వ్యవహరిస్తారు.

  1. రాష్ట్రపతి
  2. ఉపరాష్ట్రపతి
  3. ప్రధాన మంత్రి
  4. కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్
View Answer

Answer: 2

ఉపరాష్ట్రపతి

Explanation:

  • ఒక పదవి చేపట్టడం ద్వారా వేరే పదవికి లేదా ఆఫీసుకి అర్హుడైతే దానిని ఎక్స్ అఫిషియో ఆఫీసు అంటారు.
  • ఉపరాష్ట్రపతి అవడం వల్ల రాజ్యాంగం దృష్ట్యా ఆయనే/ఆమెనే రాజ్యసభ చైర్మన్ అవుతారు. ఆ కారణంగా ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్.

అధికరణ 64 :

  • ఉపరాష్ట్రపతి రాష్ట్రాల మండలి ( రాజ్యసభ )కు ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉంటారు మరియు ఇతర ఏ లాభదాయకమైన పదవిని కలిగి ఉండరు.
  • ఏదైనా సమయంలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా పనిచేసిన  లేదా ఆర్టికల్ 65 ప్రకారం ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి  విధులు నిర్వర్తించినపుడు రాజ్యసభ చైర్మన్ పదవి విధులు నిర్వహించరు మరియు అధికరణ 97 ప్రకారం చెల్లింపబడు జీతభత్యాలు అతనికి వర్తింపవు.

అధికరణ 97  :

  • చట్టం ద్వారా పార్లమెంటుచే నిర్ణయించబడిన జీతాలు మరియు భత్యాలు రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ లకు, లోక్ సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్లకు చెల్లింపబడతాయి.

Question: 20

పశ్చిమ బెంగాల్లో శాసన మండలి (విధాన పరిషత్) లేదు. ఇది పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (విధానసభ) తో ఏకసభ శాసనసభను కలిగి ఉంది.భారతదేశంలో, ఒక రాష్ట్ర గవర్నరును నియమిస్తుంది.

  1. ప్రధాన మంత్రి
  2. రాష్ట్రపతి
  3. మంత్రి మండలి
  4. ఉపరాష్ట్రపతి.
View Answer

Answer: 2

రాష్ట్రపతి

Explanation:

అధికరణ 155 :

  • రాష్ట్రానికి గవర్నర్ రాష్ట్రపతిచే నియమించబడతారు.
Recent Articles