Home  »  TGPSC 2022-23  »  TS Culture-3

TS Culture-3 (తెలంగాణ సంస్కృతి) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

హైదరాబాద్ లోని బ్రిటిష్ రెసిడెన్సీ ఒక ప్రత్యేకమైన నిర్మాణం. ప్రస్తుతం ఈ భవనాన్ని ఏ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు?

  1. జనరల్ హాస్పిటల్
  2. మహిళా విశ్వవిద్యాలయం
  3. మ్యూజియం
  4. మున్సిపల్ కార్యాలయం
View Answer

Answer: 2

మహిళా విశ్వవిద్యాలయం

Question: 7

అలంపూర్ దేవాలయాల గురించి సరైన ప్రకటనలను గుర్తించండి:
ఎ. అలంపూర్ లోని దేవాలయాలను ‘నవ బ్రహ్మ దేవాలయాలు’ అని పిలుస్తారు.
బి. అలంపూర్లో బ్రహ్మేశ్వరుడు ప్రధాన దైవం.
సి. అలంపూర్ ప్రధాన ఆలయం వేదవతి, సంగమేశ్వర నదుల మధ్య ఉంది.
డి. స్థలపురాణం ప్రకారం అలంపూర్ ను ‘బ్రహ్మపురి’ అంటారు.
సరైన జవాబుని ఎంచుకోండి :

  1. ఎ మరియు బి
  2. బి మరియు సి
  3. సి మరియు డి
  4. ఎ మరియు డి
View Answer

Answer: 4

ఎ మరియు డి

Question: 8

ఈ క్రింది వాటిని సరిపోల్చండి:

ఆశ్రిత కులం

ఎ. సదానాసురులు

బి. కాకిపడిగెలవారు

సి. విప్రవినోదులు

డి. మందేచ్చువారు

కులం

1. యాదవులు

2. పద్మశాలి

3. ముదిరాజ్ లు

4. బ్రాహ్మణులు

సరైన జవాబుని ఎంచుకోండి :

  1. A-I; B-II; C-III; D-IV
  2. A-II; B-IV, C-I; D-III
  3. A-III; BI; C-IV; D-II
  4. A-II; B-III; C-IV; D-I
View Answer

Answer: 3

A-III; BI; C-IV; D-II

Question: 9

జాబితా-1ని జాబితా-2తో సరిపోల్చండి మరియు దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
(పుస్తకం)
ఎ. జీవనయానం
బి. ఏడుపాయలు
సి. ముంగిలి
డి. నా గొడవ

(రచయిత/సంపాదకుడు)

1. కాళోజీ నారాయణరావు
2. నందిని సిద్ధా రెడ్డి

3. దాశరథి రంగాచార్య
4. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి

  1. ఎ-1, బి-2, సి-3, డి-4
  2. ఎ-3, బి-2, సి-4, డి-1
  3. ఎ-3, బి-2, సి-1, డి-4
  4. ఎ-2, బి-3, సి-4, డి-1
View Answer

Answer: 2

ఎ-3, బి-2, సి-4, డి-1

Question: 10

సాంప్రదాయ బిద్రి హస్తకళలో, ఉపయోగించే పదార్థం:

  1. బంగారు పల్చటి పలకలతో పొదగబడిన కాంస్య మరియు జింక్ నల్లబడిన మిశ్రమం
  2. బంగారు పల్చటి పలకలతో పొదిగిన కాంస్య మరియు రాగి యొక్క నల్లబడిన మిశ్రమం
  3. జింక్ మరియు ఇత్తడి యొక్క నల్లబడిన మిశ్రమం వెండి యొక్క పలుచని పలకలతో పొదగబడి ఉంటుంది.
  4. జింక్ మరియు రాగి యొక్క నల్లబడిన మిశ్రమం వెండి యొక్క పలుచని షీట్లతో పొదగబడి ఉంటుంది
View Answer

Answer: 4

జింక్ మరియు రాగి యొక్క నల్లబడిన మిశ్రమం వెండి యొక్క పలుచని షీట్లతో పొదగబడి ఉంటుంది

Recent Articles