- Environment-8
- Telangana Schemes-6
- Telangana Schemes-5
- Telangana Schemes-4
- Telangana Schemes-3
- Central Schemes-4
- Central Schemes-3
- TS Culture-10
- TS Culture-9
- Telangana History-7
- Telangana History-6
- Telangana History-5
- Telangana History-4
- TS Culture-8
- TS Culture-8
- TS Culture-7
- TS Culture-6
- TS Culture-5
- TS Culture-4
- Telangana Movement-17
- Telangana Movement-16
- Telangana Movement-15
- Telangana Movement-14
- Telangana Movement-13
- Telangana Movement-12
- Telangana Movement-11
- Telangana Movement-10
- Telangana Economy-5
- Telangana Economy-4
- Central Schemes-2
- Central Schemes-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Geography-15
- Environment-7
- Environment-6
- Environment-5
- Disaster Management-4
- Telangana Movement-9
- Environment-4
- Indian Geography-14
- Indian Geography-13
- Indian Geography-12
- Indian Geography-11
- General Science – Science and Technology-16
- General Science – Science and Technology-15
- General Science – Science and Technology-14
- General Science – Science and Technology-13
- General Science – Science and Technology-12
- General Science – Science and Technology-11
- Telangana Movement-8
- Telangana Movement-7
- Telangana Movement-6
- Disaster Management-3
- Environment-3
- Indian Geography-10
- Indian Geography-9
- Indian Geography-8
- Indian Geography-7
- Indian Geography-6
- Indian Geography-5
- Indian Geography-4
- Telangana Movement-5
- TS Culture-3
- Telangana Movement-4
- Indian Polity-17
- Disaster Management-2
- Disaster Management-1
- Environment-2
- Environment-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- Telangana Economy-3
- Telangana Economy-2
- Telangana Economy-1
- Indian Economy-19
- Indian Economy-18
- Indian Economy-17
- Indian Economy-16
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- General Science – Science and Technology-4
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- Telangana Movement-3
- Telangana History-3
- Telangana Movement-2
- General Science – Science and Technology-1
- Indian Economy-15
- Indian Economy-14
- Indian Economy-13
- Indian Economy-12
- Indian Economy-11
- Indian Economy-10
- Indian Economy-9
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Polity-16
- Indian Polity-15
- Indian Polity-14
- Indian Polity-13
- Indian Polity-12
- Indian Polity-11
- Indian Economy-6
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian Economy-2
- Indian Economy-1
- TS Culture-2
- Telangana History-2
- Telangana Movement-1
- TS Culture-1
- Telangana History-1
- Indian Polity-10
- Indian Polity-9
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Indian Polity-5
- Indian Polity-4
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Indian History-15
- Indian History-14
- Indian History-13
- Indian History-12
- Indian History-11
- Indian History-10
- Indian History-9
- Indian History-8
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Indian History-3
- Indian History-2
- Indian History-1
Question: 6
కింది కుతుబ్ షాహి సుల్తానులను వారి పరిపాలన కాలం క్రమంలో అమర్చండి
ఎ. మొహమ్మద్ కులీ కుతుబ్ షా
బి. అబుల్ హసన్ తానీషా
సి. ఇబ్రహీం కులీ కుతుబ్ షా
డి. అబ్దుల్లా కుతుబ్ షా
- బి, ఎ, సి, డి
- సి, డి, బి, ఎ
- సి, ఎ, డి, బి
- డి, సి, బి, ఎ
Answer: 3
సి, ఎ, డి, బి
Explanation:
- గోల్కొండ కుతుబ్ షాహీ ల పాలనా పరంపర :
- సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ ( క్రీ. శ. 1518 – క్రీ. శ. 1543 )
- జంషీద్ కులీ కుతుబ్ షా ( క్రీ. శ. 1543 – క్రీ. శ. 1550 )
- ఇబ్రహీం కులీ కుతుబ్ షా ( క్రీ. శ. 1550 – క్రీ. శ. 1580 )
- మహమ్మద్ కులీ కుతుబ్ షా ( క్రీ. శ. 1580 – క్రీ. శ. 1612 )
- సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా ( క్రీ. శ. 1612 – క్రీ. శ. 1626 )
- అబ్దుల్లా కుతుబ్ షా ( క్రీ. శ. 1626 – క్రీ. శ. 1672 )
- అబుల్ హసన్ తానీషా ( క్రీ. శ. 1672 – క్రీ. శ. 1687 )
- అతి ఎక్కువ కాలము పాలించింది అబ్దుల్లా కుతుబ్ షా – 46 సం,,లు .
- తరువాత అతి ఎక్కువ కాలం పాలించింది మహమ్మద్ కులీ కుతుబ్ షా – 32 సం,,లు.
- అతి తక్కువ కాలం పరిపాలించింది జంషీద్ కులీ కుతుబ్ షా – 7 సం,,లు
Question: 7
ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. మోటుపల్లి అభయ శాసనాన్ని రుద్రదేవుడు జారీ చేశాడు.
బి. ‘పండితారాధ్య చరిత’ రచించినది పాల్కురికి సోమనాథుడు
సీ. ‘నృత్త రత్నావళి’ గ్రంథాన్ని బద్దెన రచించారు
డీ. బయ్యారం శాసనం కాకతి మైలాంబ జారీ చేసింది,
ఈ క్రింది వాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- ఎ & బి
- బి & సి
- సి & డి
- బి & డి
Answer: 4
బి & డి
Explanation:
- మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించింది గణపతి దేవుడు. విదేశీ వర్తకులకు అభయం ఇచ్చే వివరాలు ఈ శాసనంలో ఉన్నాయి. అందుకే దీనిని అభయ శాసనం అంటారు.
- పండితారాధ్య చరిత్ర లేదా పండితారాధ్య చరితం రచయిత పాల్కురికి సోమనాథుడు. కాకతీయుల కాలంనాటి శైవ మత స్థితిని, శైవ మత ఉజ్వల దశను మరియు ఆనాటి ఇతర మత స్థితిగతులను ఈ పండితారాధ్య చరిత్ర తెలియజేస్తుంది. పాల్కురికి సోమనాథుని మరొక రచన బసవ పురాణం. పండితారాధ్య చరిత్ర , బసవపురాణం రెండు తెలుగు రచనలు.
- నృత్త రత్నావళి రచయిత జాయపసేనాని. ఇది ఒక సంస్కృత రచన. నృత్య మరియు నాట్య లక్షణాలను వివరిస్తుంది.
- బయ్యారం శాసనాన్ని వేయించింది గణపతి దేవుని సోదరి కాకతి మైలాంబ. ఈ శాసనం ఖమ్మం జిల్లాలో లభ్యమయింది.
- బద్దెన రచన “నీతిసార ముక్తావళి” . ఈ రచన కాకతీయ రాజ్య రాజకీయ వ్యవస్థ స్వభావం మరియు స్వరూపాలను వర్ణిస్తుంది.
Question: 8
జాబితా -ఎ లోని అంశాలను జాబితా – బి లోని అంశాలతో సరిపోల్చండి మరియు దిగువ ఇవ్వబడిన కోట్ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి:
జాబితా-ఎ
ఎ. ఆచార్య నాగార్జున
బి. అణచివేయబడిన వైదిక మతం
సి. అజంతా పెయింటింగ్స్
డి. కీసరగుట్ట వద్ద కోట
జాబితా – బి
1. వాకాటకులు
2. విష్ణుకుండినులు
3. మధారి పుత్ర వీర పురుషదత్త
4. యజ్ఞ శ్రీ శాతకర్ణి
- A- ii, B – i, C- iii, D – iv
- A-iv, B – iii, C- i, D-ii
- A-iii, B-iv, C-ii, D-i
- A-i, B-ii, C-iv, D-iii
Answer: 2
A-iv, B – iii, C- i, D-ii
Explanation:
- యజ్ఞశ్రీ శాతకర్ణి తరువాత ముగ్గురు శాతవాహన రాజులు దాదాపుగా 17 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ శాతవాహన రాజులలో చివరి గొప్ప వాడిగా పరిగణింపబడతాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడిని, బౌద్ధ మతాన్ని పోషించాడు.
- హిరణ్యకులు , పూగియ వంశీయులతో కలిసి శాతవాహన రాజు నాలుగో పులుమావిని తొలగించి స్వాతంత్రాన్ని ప్రకటించుకొని స్వతంత్ర ఇక్ష్వాక రాజ్య స్థాపన చేసాడు వాసిష్టీపుత్ర శాంతమూలుడు. మాఠరీపుత్ర శ్రీవీరపురుష దత్తుడు శాంతమూలుని కుమారుడు. వీరపురుష దత్తుడు మొదట వైదిక మతాన్ని అనుసరించినా తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఇతడి పాలనా కాలాన్ని ఆంధ్రదేశ బౌద్ధమత చరిత్రలో ఉజ్వలమైన ఘట్టంగా పేర్కొంటారు. వీర పురుష దత్తునికి ఐదుగురు భార్యలు. వీరు కూడా బౌద్ధ మతాన్ని ఆచరించి పోషించారు.
- వాకాటకుల వాస్తు శిల్పం వారు నిర్మించిన దేవాలయాల్లో, అజంతా గుహల్లో కనిపిస్తుంది. అజంతా శిల్పాలు, చిత్రాలు మానవుడి అసాధారణ కళా సృష్టిగా అద్భుతమైన కళాఖండాలుగా విమర్శకులు వర్ణిస్తారు. అజంతాలో 30 గుహలు ఉన్నాయి. వీటిని 1819లో కెప్టెన్ జాన్ స్మిత్ గుర్తించారు. బుద్ధుని జీవితంలోని ముఖ్య ఘట్టాలను, బౌద్ధ జాతక కథలను ఇందులో చిత్రించారు.
- విష్ణుకుండుల రాజు గోవింద వర్మ భుజబలంతో విష్ణుకుండి రాజ్యాన్ని శ్రీపర్వతానికి రెండువైపులా విస్తరింపజేశాడు. శ్రీశైలం నాగార్జున కొండల మధ్య విస్తరించి ఉన్న పర్వతాలను శ్రీ పర్వతాలు అంటారు. ఉత్తరాన మూసీ నదికి ఆవలి ప్రాంతాలు కూడా ఆయన రాజ్యంలో ఉండేవి. వీటికి సాక్ష్యాలుగా హైదరాబాదులోని చైతన్యపురిలో గల అతని కాలపు శిలాశాసనం, హైదరాబాద్ శివారులో గల కీసరగుట్ట (కేసరిగుట్ట) పైన గల విష్ణుకుండికోట, దేవాలయ శిథిలాలు మొదలైన వాటిని గూర్చి చెప్పుకోవచ్చు.
Question: 9
జాబితా -ఎ లోని అంశాలను జాబితా- బి లోని అంశాలతో సరిపోల్చండి మరియు దిగువ ఇవ్వబడిన కోట్ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి:
జాబితా ఎ
ఎ. అమరావతి బౌద్ధ స్థూపం
బి. నేలకొండపల్లి బుద్ధ విగ్రహం
సి. ఉండవల్లిలో నాలుగు అంతస్తుల గుహ దేవాలయం
డి. అలంపురం వద్ద నవ బ్రహ్మ దేవాలయాలు
జాబితా – బి
1. విష్ణుకుండినులు
2. ఇక్ష్వాకులు
3. చాళుక్యులు
4. శాతవాహనులు
- A-i, B-ii, C-iv, D-ii
- A-iii, B-i, C-ii, D-iv
- A-iv, B-ii, C-i, D-iii
- A-ii, B -iii, C-iv, D -i
Answer: 3
A-iv, B-ii, C-i, D-iii
Explanation:
- శాతవాహనుల కాలం నాటి శిల్పకళకు అమరావతి శిల్పకళ అని పేరు. అమరావతి, నాగార్జున కొండ, జగ్గయ్యపేట కేంద్రాలుగా ఈ శిల్పకళారీ అభివృద్ధి చెందింది. బౌద్ధమతం దక్కన్కు వ్యాప్తి చెందడం వల్ల శాతవాహనుల కాలంలో అనేక స్థూపాలు, విహారాలు, చైత్యాలు నిర్మించబడ్డాయి. స్థూపమనగా బుద్ధుడు లేదా బౌద్ధ భిక్షువుల అవశేషాలపై నిర్మించే ఒక కట్టడం. అమరావతి స్తూపంపై నలువైపులా వేదికపై ఐదు స్తంభాలు నిర్మించబడ్డాయి. ఇవి బుద్ధుడి జీవితంలోని ఐదు ఘట్టాలను సూచిస్తాయి. కమలం పుట్టుకను, గుర్రం మహాభినిష్క్రమణాన్ని, బోధి వృక్షం అతని జ్ఞానోదయాన్ని, ధర్మచక్రం అతని దివ్య సందేశాన్ని, స్తూపం అతని మహాపరినిర్వాణాన్ని సూచిస్తాయి.
- అమరావతి శిల్ప నిర్మాణ చివరి ఘట్టం ఇక్ష్వాకుల కాలంలో కూడా సాగింది. శాతవాహన అనంతర కాలంలో నిర్మించబడ్డ అతి ముఖ్యమైన స్తూపం నేలకొండపల్లిలో ఉంది. దీనిని విరాట్ స్థూపం అని పిలుస్తారు. ఒక మహా స్థూపం, చతుశాల రకం విహారాలు, నిలువెత్తు బుద్దుని విగ్రహాలు అనేకం ఇక్కడ బయటపడ్డాయి. క్రీ. శ. మూడో శతాబ్దం నుండి ఆరో శతాబ్దం వరకు ఈ నిర్మాణాలు జరిగాయి.
- విష్ణుకుండినుల రాజధానులు అమరపురం, ఇంద్రపాలనగరం, దెందులూరు. ఆంధ్రప్రదేశ్ లోని బెజవాడ లేదా విజయవాడ కూడా విష్ణుకుండులకు కొంతకాలం రాజధానిగా ఉన్నట్లు తెలుస్తుంది. విష్ణుకుండుల మరో రాజధాని అయిన విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఉండవల్లి, మొగల్రాజపురం, ఇంద్రకీలాద్రి అనే గుట్టల్లో కూడా అంతస్తులుగా చెక్కి బౌద్ధ ఆరామ విహారాలను నిర్మించారు. ఉండవల్లి వద్ద గల 4 అంతస్తుల గుహాలయం ముఖ్యమైనది.
Question: 10
వేములవాడలో ఉన్న భీమేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు?
- అరికేసరి-I
- అరికేసరి – II
- బద్దెగా
- వెంగరాజు
Answer: 3
బద్దెగా
Explanation:
- బద్దెగ తన పేరు మీద వేములవాడలో బద్దిగేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయమే ఇప్పుడు వేములవాడ లో ఉన్న భీమేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది. బద్దెగ వేములవాడ చాళుక్యుడు.
- రాష్ట్ర కూటులకు సామంతులు వేములవాడ చాళుక్యులు. పశ్చిమోత్తర తెలంగాణ ప్రాంతాలను పరిపాలించారు.వీరు కరీంనగర్ జిల్లా వేములవాడ రాజధానిగా చేసుకుని పరిపాలించారు కనుక వీరిని వేములవాడ చాళుక్యులు అంటారు. వీరి పరిపాలనా కాలం క్రీస్తుశకం 750 నుంచి 973 వరకు దాదాపుగా 225 సంవత్సరాలు సాగింది.
- వేములవాడ చాళుక్య వంశానికి మూలపురుషుడు సత్యాశ్రయ రణవిక్రముడు.
- వేములవాడ చాళుక్య రాజ్యానికి మూలపురుషుడు వినయాదిత్య యుద్ధమల్లుడు ( క్రీ.శ. 750 – 775).
- వినయాదిత్య యుద్ధమల్లుని కుమారుడు మొదటి అరికేసరి లేదా అరికేసరి – 1 ( క్రీ. శ. 775 – 800 )
- అరికేసరి – 1 కుమారుడు నరసింహుడు – 1 లేదా మొదటి నరసింహుడు ( క్రీ. శ.800 – 825 ).
- మొదటి నరసింహుని కుమారుడు రెండో యుధ్ధమల్లుడు లేదా యుద్ధమల్లుడు – 2 ( క్రీ. శ. 825 – 850 ).
- రెండో యుధ్ధమల్లుడు లేదా యుద్ధమల్లుడు – 2 ( క్రీ. శ. 825 – 850 ) కుమారుడు బద్దెగ.
- బద్దెగ పాలనా కాలం క్రీ. శ. 850 నుండి 895.