Home  »  TGPSC 2022-23  »  Telangana History-2

Telangana History-2 (తెలంగాణ హిస్టరీ (చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana History (తెలంగాణ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

కుతుబ్ షాహీ కాలంలో చీఫ్ పోర్ట్ ఆఫీసర్ ను ఎలా పిలిచేవారు:

  1. షా ముబారక్
  2. షా ఖిలాదార్
  3. షా బందర్
  4. షా ఇన్సాఫ్
View Answer

Answer: 3

కుతుబ్ షాహీ కాలంలో చీఫ్ పోర్ట్ ఆఫీసర్ ను షా బందర్ అని పిలిచేవారు

Explanation: 

  • కుతుబ్ షాహీ పాలనా కాలంలో రేవు పట్టణంలో ఉన్నతాధికారినీ( Chief Port Officer) షాబందర్ అనేవారు.

Question: 12

ప్రముఖ కన్నడ కవి పంపాను ఎవరు ఆదరించారు.

  1. వినయాదిత్య
  2. అరికేసరి -II
  3. అరికేసరి-I
  4. భద్రదేవుడు
View Answer

Answer: 2

అరికేసరి -II

Explanation: 

  • ప్రముఖ కన్నడ కవి పంప కవిని ఆదరించినది రెండో అరికేసరి. రెండో అరికేసరి వేములవాడ చాళుక్య నాయకుడు. అతన్ని పండితుడిగా, యుద్ధ వీరుడిగా, మంచి పాలకుడిగా, కవి పోషకుడిగా కీర్తిస్తారు. ఇతని పోషణలోనే కన్నడ సాహిత్యంలో మొట్టమొదటి గొప్ప గ్రంథం విక్రమార్జున విజయం పంప కవిచే రచింపబడింది.

Question: 13

రేచర్ల కుటుంబ స్థాపకుడు ఎవరు?

  1. సింగమ నాయక
  2. బేతాళ నాయక
  3. అనపోత నాయక
  4. కుమార సింగమ నాయక
View Answer

Answer: 2

బేతాళ నాయక

Explanation: 

  • రేచర్ల వంశస్థాపకుడు బేతాళ నాయుడు లేదా బేతాళ నాయక.
  • రేచర్ల వెలమరాజులు మొదటి కాకతీయులకు సామంతులుగా పనిచేశారు. ఆనాటి రైతు బృందాల్లో ప్రబలమైన వెలమ కులానికి చెందిన బేతాళ నాయుడు అనే వ్యక్తి రేచర్ల వంశ స్థాపకుడు. బేతాళ నాయుని జన్మస్థలం నేటి నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలోని ఆమనగల్లు. రేచర్ల వెలమలు కాకతీయ సామంతులుగా ఆమనగల్లు, పిల్లలమర్రిని  పాలించేవారు.  కాకతీయ గణపతిదేవ చక్రవర్తి బేతాళ నాయుని ఆమనగల్ స్థానిక పాలకుని గా నియమించాడు. అతనికి బేతాళ నాయకుడు అనే బిరుదు కూడా గణపతి దేవుడే ఇచ్చాడు.
  • తుగ్లక్ల చేతిలో కాకతీయ సామ్రాజ్యం పతనమైన తరువాత నేటి నల్గొండ , మహబూబ్ నగర్ జిల్లాల్లో స్వతంత్రంగా రేచర్ల వెలమరాజులు రాజ్యం పరిపాలించారు. కాపయనాయుని మరణానంతరం తెలంగాణలోని ముసునూరు రాజ్యాన్ని కూడా ఆక్రమించి మొత్తం తెలంగాణకు పరిపాలనాధిపతులయ్యారు.
  • సుమారు 150 సంవత్సరాలు రాచకొండ, దేవరకొండలను రాజధానిగా చేసుకుని సుపరిపాలన చేస్తూ నాటి తెలుగు దేశ లేదా ఆంధ్ర దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. వీరినే వెలమలు లేదా పద్మనాయకులు అని కూడా అంటారు. విష్ణు పాద పద్మాల నుంచి జన్మించడం వల్ల వీరికా పేరు వచ్చిందని ప్రతీతి.

Question: 14

చారిత్రక ‘గోల్కొండ కవుల సంచిక’ను సురవరం ప్రతాపరెడ్డి ఏ సంవత్సరంలో ప్రచురించారు?

  1. 1910
  2. 1925
  3. 1930
  4. 1936
View Answer

Answer: 4

1936

Explanation: 

  • తెలంగాణలో కవులు లేరన్న అపవాదుపై స్పందించి తెలంగాణకు చెందిన కవులు రాసిన కవితలతో గోలకొండ కవుల సంచిక ప్రచురించింది సురవరం ప్రతాపరెడ్డి.
  • తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన “గోల్కొండ కవుల సంచిక” గ్రంథాన్ని, కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి.  గోలకొండ కవుల సంచిక 1934లో ప్రచురితమైంది.

Question: 15

నిజాం కాలంలో నల్గొండ నుంచి నీలగిరి పత్రికను ప్రచురించినవారు ఎవరు?

  1. సురవరం ప్రతాప రెడ్డి
  2. షబ్నవీ స్వెంకటరామనర్సింహరావు
  3. మందుముల నర్సింగరావు
  4. మాడపాటి హనుమంతరావు
View Answer

Answer: 2

షబ్నవీ స్వెంకటరామనర్సింహరావు

Explanation: 

  • నీలగిరి పత్రికను ప్రచురించినవారు షబ్నవీసు వెంకట రామనరసింహరావు.
  • మందముల నరసింహ రావు సంపాదకత్వంలో రయ్యత్ పేరుతో ఉర్దూ వార పత్రిక 1927లో ప్రారంభమైంది.
  • సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వం వహించిన పత్రిక గోలకొండ పత్రిక.
Recent Articles