Home  »  TGPSC 2022-23  »  Telangana History-1

Telangana History-1 (తెలంగాణ హిస్టరీ (చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana History (తెలంగాణ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

‘శివయోగసారం’ ఏ కాకతీయ సామంతుల కుటుంబ చరిత్ర గురించి
వివరాలు ఇస్తుంది?

  1. ఇందులూరి ముఖ్యులు
  2. చెరకు ముఖ్యులు
  3. కోట ముఖ్యులు
  4. మలయాళ ముఖ్యులు
View Answer

Answer: 1

ఇందులూరి ముఖ్యులు

Explanation: 

  • శివయోగసారం రచయిత కొలను గణపతి .
  • గణపతి దేవుని కొలవులో ఉన్న కాకతీయ సామంతులైన ఇందులూరి నాయకుల చరిత్ర ఈ శివయోగసారంలో ఉంది.

Question: 7

తెలంగాణలో సూఫీయిజం గురించి ఈ క్రింది వాటిని పరిశీలించండి మరియు సరికాని ప్రకటనను గుర్తించండి

  1. కంభాలు సూఫీ సాధువుల సమాధులు.
  2. కుతుబ్ షాహీ కాలంలో షేక్ బాబా షర్ఫుద్దీన్ మరియు షియాబుద్దీన్ సూఫీ మతాన్ని ప్రచారం చేశారు.
  3. సూఫీ సెయింట్స్ హిందువులు మరియు ముస్లింల మధ్య మిశ్రమ సంస్కృతి మరియు ఐక్యతను ప్రచారం చేశారు.
  4. హజ్రత్ బాబా షర్ఫుద్దీన్ సుహ్రావర్డి దర్గా హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ లో ఉంది.
View Answer

Answer: 4

హజ్రత్ బాబా షర్ఫుద్దీన్ సుహ్రావర్డి దర్గా హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్లో ఉంది.

Explanation: 

  • హజ్రత్ బాబా షర్ఫుద్దీన్ సుహ్రావర్డి దర్గా హైదరాబాద్ లోని నాంపల్లి లో ఉంది.
  • దర్గాలు సూఫీ సాధువుల సమాధులు. ఈ సమాధులను మజార్ అంటారు .
  • తెలంగాణలోని కొన్ని ప్రముఖ దర్గాలు :
  1. షర్ఫుద్దీన్ దర్గా – నాంపల్లి
  2. జాన్ పహాడ్ సైదులు దర్గా – జాన్ పహాడ్ , నల్గొండ
  3. పహాడీ షరీఫ్ దర్గా – పహాడీ షరీఫ్, శంషాబాద్కా
  4. జీపేట దర్గా – హనుమకొండ
  • భారతదేశానికి వచ్చిన మొదటి సూఫీ క్వాజా మొయినుద్దీన్ చిస్తీ.
  • దక్షిణ భారతదేశంలో మొదటి సూఫీ గేసుధరాజ్.

Question: 8

రామప్ప దేవాలయానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని ప్రకటనలు ఏవి?
ఎ. దీనిని రుద్రదేవుడు నిర్మించాడు.
బి. ఇది శివాలయం.
సి. పేరిణి నృత్య భంగిమలు ఆలయంలో చెక్కబడ్డాయి.
డి. దీనిని UNESCO 2020లో ప్రపంచ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించింది.
సరైన జవాబుని ఎంచుకోండి :

  1. ఎ, సి & డి మాత్రమే
  2. ఎ, బి & సి మాత్రమే
  3. బి & సి మాత్రమే
  4. ఎ & డి మాత్రమే
View Answer

Answer: 3

బి & సి మాత్రమే

Explanation:

  • రామప్ప దేవాలయం( రుద్రేశ్వర ఆలయం )  ఎలకుర్తి రేచర్ల వంశానికి చెందిన రేచర్ల రుద్రునిచే నిర్మించబడినది. ఇది ఒక ఏకశిలా శివాలయం. 1173లో ప్రారంభమై 1213లో దీని నిర్మాణం పూర్తయింది. ఈ  ఆలయాన్ని చెక్కిన శిల్పి పేరు రామప్ప. భారతదేశంలో  శిల్పి పేరు మీదుగా పిలవబడుతున్న ఒకే ఒక్క ఆలయం ఇది . ప్రస్తుతం ఇది పాలంపేట, ములుగు జిల్లాలో ఉంది.
  • ఈ దేవాలయం కర్ణాటకలోని బేలూరు చెన్నకేశవ ఆలయం ఆధారంగా నిర్మించబడింది.
  • ఈ ఆలయంలో పేరిణి , శివతాండవం, చిందు, కోలాటం, శివప్రియనాట్యరీతులలో ఏకశిల చెక్కబడింది.
  • 2021లో UNESCO world heritage జాబితాలో రామప్ప ఆలయం చేర్చబడింది. యునెస్కో జాబితాలో చేరిన 39వ కట్టడం ఇది.
  • 40వది  దోలవిర : హరప్పా నగరం ( ప్రస్తుతం గుజరాత్లో ఉంది )
  • 41వది శాంతినికేతన్, పశ్చిమ బెంగాల్
  • 42వది హొయసలుల ఆలయాలు, కర్ణాటక
  • 43వది మైదమ్స్( అహోం రాజవంశుల సమాధులు), అస్సాం

Question: 9

కింది వాటిలో సర్వాయి పాపన్న తన కోటలను ఏ ప్రదేశంలో నిర్మించాడు?
ఎ. తాటికొండ

సి. గీసుకొండ
బి. షాపురం
డి. వేములకొండ
సరైన జవాబుని ఎంచుకోండి :

  1. ఎ, బి & సి మాత్రమే
  2. ఎ, బి & డి మాత్రమే
  3. బి, సి & డి మాత్రమే
  4. ఎ & సి మాత్రమే
View Answer

Answer: 2

ఎ, బి & డి మాత్రమే

Explanation:

  • సర్దార్ సర్వాయి పాపన్న సొంత ఊరు తారికొండ. ఈయన కల్లు గీత లేదా గౌండ్ల కులానికి చెందినవాడు. తెలుగు జానపద సాహిత్యంలో ఆయన తల్లితో ఈ విధంగా అన్నట్టు తెలుపబడింది “ తాటి చెట్లకు కల్లు కుండలు కట్టడం, దించడం, వాటిలో వాటా పొందడం నాకు రుచింపవు. నా హస్తం గోల్కొండ కోట గోడపై పడాలి “ .
  • చిన్నప్పటి నుండే రాజ్యాధికార కాంక్ష , నాయకత్వ లక్షణాలు కలవాడు సర్వాయి పాపన్న.
  • క్రీ. శ . 1695 – 1710 మధ్య మొఘల్ వైస్రాయ్ పాలన నుంచి తెలంగాణ ప్రజానీకాన్ని విముక్తి కలిగించే ప్రయత్నం చేశాడు.
  • తారికొండలో ఒక చిన్న కోటను నిర్మించుకొన్నాడు. మొఘల్ చక్రవర్తికి అండగా నిల్చిన పౌజుదార్లను, జమీందార్లను ఆయన ఎదిరించాడు. తనను అణచివేయడానికి ఔరంగజేబు నియమించిన కొలనుపాక పౌజుదారు ఖాసిం ఖాన్ ను పాపన్న, ఆయన సైన్యాలు మట్టుబెట్టాయి. ఈ విధంగా పాపన్న మొఘల్ సార్వభౌమాధికారానికి పెద్ద సవాలు విసిరాడు.
  • ఖిలాషపూర్లో రాతికోట నిర్మించుకున్నాడు. మొఘల్ సైన్యం పన్ను వసూలు చేసి ఖజానా కు తరలిస్తున్న సమయంలో వాటిని కొల్లగొట్టి ఆ సొత్తుతో కోటలను నిర్మించుకున్నాడు.
  • దాదాపుగా 20 కోటలు నిర్మించుకున్నారు. అందులో కొన్ని తారికొండ (తాటికొండ) కోట, ఖిలాషాపూర్ కోట, షాపూర్ కోట, సర్వాన్న పేట కోట.

Question: 10

కింది వాటిలో కాకతీయుల కాలంలో “అయగర్” వ్యవస్థలో చేర్చబడని కులం ఏది?

  1. కుమ్మరి
  2. కంసాలి
  3. కోమటి
  4. మంగలి
View Answer

Answer: 3

కోమటి

Explanation:

  • కాకతీయులు తమ రాజ్యాన్ని పరిపాలన సౌలభ్యం కోసం విభజించుకున్నారు. విభజన కింది విధంగా ఉంది.
  1. పరిపాలనా విభాగం – అధిపతి
  2. రాజ్యం – రాజు
  3. నాడు   – మండలేశ్వరుడు
  4. స్థలం    – స్థలకపతి
  5. గ్రామం  – ఆయగార్
  • స్థలం 24 గ్రామాల సమూహం . గ్రామమే పరిపాలనలో చిట్టచివరి స్థాయిది. గ్రామాధికారులు అందరినీ కలిపి ఆయగార్లు అని వ్యవహరించేవారు. కాకతీయులకు ముందే గ్రామస్థాయిలో ఈ ఆయగార్ల వ్యవస్థ ఉంది. ఆయాగార్ల సంఖ్య 12. కమ్మరి, కంసాలి, వడ్రంగి, కుమ్మరి, చాకలి, మంగలి, వెట్టి, పురోహితుడు, చర్మకారుడు మున్నగు 9 కులాల వారు ఈ ఆయగార్ల లో ఉన్నారు . కరణం, రెడ్డి , తలారి  3 ప్రభుత్వ సేవకులు( ఈ ముగ్గురికి పంటలో కొంత వాటా ఉంటుంది). మొత్తం 12 మంది.
Recent Articles