Home  »  TGPSC 2022-23  »  Telangana History-1

Telangana History-1 (తెలంగాణ హిస్టరీ (చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana History (తెలంగాణ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

అసఫ్ జాహీ కాలంలో కింది వార్తాపత్రికలు / మ్యాగజైన్ లను వాటి వ్యవస్థాపకులతో సరిపోల్చండి: వార్తాపత్రిక
వ్యవస్థాపకుడు

ఎ. ఆసిఫ్-ఉల్-అక్బర్

బి. సఫీర్–ఎ–డక్కన్

సి. ముషీర్-ఎ-డక్కన్ ఇజ్

డి. ఇమ్రోజ్
1. అమద్ అలీ

2. ఎన్. నారాయణరావు
3. షూబుల్లా ఖాన్
4. ఖాజా అబ్దుల్ గఫార్

5. పండిట్ కిషన్ రావు

సరైన జవాబుని ఎంచుకోండి :

  1. A-3; B-2; C-4; D-5
  2. A-2; B-1; C-5; D-3
  3. A-4; B-3; C-2; D-1
  4. A-5; B-4; C-3; D-2
View Answer

Answer: 2

A-2; B-1; C-5; D-3

Explanation:

  • అసిఫ్ ఉల్ అక్బర్ – N నారాయణ రావు
  • సఫీర్ ఈ డెక్కన్ –  ఆంజాద్ ఆలీ
  • ముషీర్ ఈ డెక్కన్ – పండిట్ కిషన్ రావు
  • ఇమ్రోజ్ పత్రిక స్థాపకులు షోయబుల్లాఖాన్. 1947, నవంబర్ 15 న ఈ పత్రిక తొలి ప్రతి వెలువడింది. నిష్పక్షపాత వార్తలు ఈ పత్రిక ప్రచురించింది. రజాకార్ల హెచ్చరికలను లెక్క చేయకుండా ఆయన వార్తలను ప్రచురించే వారు.

Question: 12

ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ – సోషల్ సైన్సెస్ భవన నిర్మాణ రూపకర్త ఎవరు?

  1. స్పానిష్ ఆర్కిటెక్ట్ ఆండ్రియా పల్లాడియో
  2. ఇంగ్లీష్ ఆర్కిటెక్ట్ జాన్ అబెల్
  3. బెల్జియన్ ఆర్కిటెక్ట్ ఎర్నెస్ట్ జాస్పర్
  4. ఈజిప్షియన్ ఆర్కిటెక్ట్ అలీ ఖలీద్ ఎలెవా
View Answer

Answer: 3

బెల్జియన్ ఆర్కిటెక్ట్ ఎర్నెస్ట్ జాస్పర్

Explanation:

  • ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించడానికి 7వ నిజాం ఆగస్టు 28, 1918న ఒక రాజ శాసనాన్ని, స్థాపనను కచ్చితంగా నిర్ణయిస్తూ ఆగస్టు 7, 1919న ఇంకొక రాజ శాసనాన్ని జారీ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపనకు ఏడవ నిజాం ఎదుర్కొన్న ప్రధాన సమస్యలలో ఒకటి యూనివర్సిటీ కాలేజీ డిజైన్ మరొకటి యూనివర్సిటీ నిర్మించే ప్రాంతం. ప్రొఫెసర్ సర్ పాట్రిక్ జెడెస్ అనే ఆంగ్లేయుడు సర్వే చేసి 1400 ఎకరాల యూనివర్సిటీ ప్రాంతాన్ని నిర్మాణం కోసం నిర్ణయించాడు.
  • నిజాం రాజ్యశిల్పి నవాబ్ జైన్ యార్ జంగ్ మరియు ప్రైవేటు శిల్పి సయ్యద్ అలీ రాజా ఐరోపాదేశాలు తిరుగుతూ ఈజిప్టు విశ్వవిద్యాలయ నిర్మాణ పనులలో ఉన్న బెల్జియన్ శిల్పి జాస్పర్ ను కలిసి అతని డిజైన్ను చూసి ఆకర్షితులై 1933లో అతన్ని హైదరాబాద్కు రప్పించారు. భారతదేశానికి వచ్చిన తర్వాత జాస్పర్ ప్రధాన పట్టణాలలో ఉన్న వివిధ కట్టడాలను తిలకించారు. వాటన్నిటినీ పరిశీలించిన తరువాత ప్రాచీన హిందూ, మద్యయుగ ముస్లిం, ఆధునిక ఐరోపా కట్టడాలతో మిళితమైన ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ డిజైన్ రూపొందించారు. ఉస్మానియా యూనివర్సిటీ నిర్మాణం 1934 లో మొదలు అయి 1939లో  పూర్తయింది. దీనికైన మొత్తం ఖర్చు 36 లక్షలు. యూనివర్సిటీ నిర్మాణం కాకమునుపే ఈ యూనివర్సిటీకి సంబంధించిన తరగతులు అబిడ్స్ లోని కిరాయి ఇండల్లో జరిగేవి. ఉస్మానియా లా కాలేజీ, ఇంజనీరింగ్, సైన్స్ కళాశాల నిర్మాణాలు కూడా ఈ విధంగానే ఉంటాయి.

Question: 13

అసఫ్ జాహీల కాలంలో ఈ క్రింది వాటిలో ఏ ‘సిక్కాస్”/నాణేలు ఉపయోగించబడ్డాయి?
ఎ. హాలి సిక్కా
బి. మహబూబియా సిక్కా
సి. మాలి సిక్కా
డి. ఉస్మానియా సిక్కా
సరైన జవాబుని ఎంచుకోండి :

  1. A, B & C only
  2. A, B & D only
  3. A, C&D only
  4. B, C & D only
View Answer

Answer: 2

A, B & D only

Explanation:

  • అఫ్జల్ ఉద్దౌలా కాలంలో సాలార్జంగ్ 1 , హాలీ సిక్కా లను తీసుకువచ్చారు. అంతవరకూ మొఘల్ నాణేలు వాడేవారు. 1858లో హాలీ సిక్కాల వాడకం మొదలైంది. హాలీ సిక్కా ఒక వెండి నాణెం. ఈ నాణానికి ఒకవైపు చార్మినార్ బొమ్మ ఉండి.. బొమ్మ చుట్టూ పర్షియన్ భాషలో ‘నిజాం-ఉల్-ముల్క్ బహదూర్ అసఫ్ జాహీ’ అని రాసి ఉంటుంది. ఇక రెండో వైపు నాణెం విలువ ఉంటుంది.  బ్రిటిష్ నాణేల కన్న 15% విలువ తక్కువ కలవి హాలీ సిక్కాలు. 1955లో ఇవి పూర్తిగా రద్దు చేయబడ్డాయి.
  • ఉస్మానియా సిక్కా,  7వ నిజాం ఉస్మాన్ ఆలీ ఖాన్ తన పేరు మీదుగా తీసుకువచ్చిన కరెన్సీ ఇది. ఉస్మానియా సిక్కా ను హైదరాబాదీ రూపాయి అంటారు. 1918లో ఇది వచ్చింది.

Question: 14

శాతవాహనుల శాసనాలు తెలంగాణ ప్రాంతంలో అనేక మంది హస్తకళాకారుల ఉనికిని నమోదు చేస్తాయి. ఈ క్రింది హస్తకళాకారులను వారి వృత్తులతో సరిపోల్చండి:

హస్తకళాకారుల
ఎ. కులారికాలు
బి. మణికారాలు
సి. మిథికాస్
డి. కొలికాస్
వృత్తి
1. స్టోన్ పాలిషర్లు
2. కుమ్మరులు

3. నేత కార్మికులు
4. ఇనుము కార్మికులు

5. స్వర్ణకారులు

  1. A-2; B-5; C-1; D-3
  2. A-4; B-3; C-5; D-1
  3. A-5; B-2; C-4; D-3
  4. A-3; B-2; C-5; D-4
View Answer

Answer: 1

A-2; B-5; C-1; D-3

Explanation:

  • శాతవాహనుల కాలంలో ఒక్కొక్క వృత్తిని అనుసరించిన వారు ఒక్కొక్క శ్రేణిగా ఏర్పడ్డారు ప్రతి శ్రేణికి శ్రీ అనే అధ్యక్షుడు ఉండేవారు. ఈ విషయాలు ఆనాటి శాసనాల ద్వారా తెలిసాయి.
  • జున్నార్ శాసనాలు ధన్నుక,  కాసాకార , తెసకార శ్రేణులను పేర్కొన్నాయి.
  • నాసిక్ శాసనాలు కులరిక శ్రేణి, తిలపసకశ్రేణి , ఒదయంత్రిక మొదలైన శ్రేణులను పేర్కొన్నాయి.
  • ఆనాటి శాసనాల ప్రకారం శాతవాహనుల కాలంలో 18 రకాల వృత్తులు ఉండేవి.
  • కోలికులు అంటే నేతకారులు లేదా నేత కార్మికులు.
  • తిలపిషకులు అంటే నూనె తీసేవారు.
  • కులరికులు అంటే కుమ్మరులు.
  • తెసకారులు అంటే మెరుగుపెట్టేవారు.
  • మణికారులు అంటే రత్నపని చేసేవారు ( స్వర్ణకారులు )
  • సేలవధకులు అంటే రాతి పనివారు.
  • కాసాకారులు అంటే ఇత్తడి పని చేసేవారు.

Question: 15

కొల్లిపర మరియు కురువగట్ట శాసనాలు మనకు దేని గురించి తెలియజేస్తాయి:

  1. వేములవాడ చాళుక్యుల చరిత్ర
  2. కాకతీయుల చరిత్ర
  3. శాతవాహనుల చరిత్ర
  4. గౌతమీపుత్ర శాతకర్ణి యాత్రలు
View Answer

Answer: 1

వేములవాడ చాళుక్యుల చరిత్ర

Explanation:

  • కురువగట్టు శిలా శాసనం మరియు కొల్లిపర తామ్ర శాసనం వేములవాడ చాళుక్యులకు సంబంధించినవి. వేములవాడ చాళుక్యుల చరిత్ర తెలుసుకోవడానికి లభించిన ఆరు శిలా శాసనాలు మరియు రెండు తామ్ర శాసనాలలో ఇవి ప్రధానమైనవి. రాష్ట్ర కూటులకు సామంతులు వేములవాడ చాళుక్యులు.  పశ్చిమోత్తర తెలంగాణ ప్రాంతాలను పరిపాలించారు.వీరు కరీంనగర్ జిల్లా వేములవాడ రాజధానిగా చేసుకుని పరిపాలించారు కనుక వీరిని వేములవాడ చాళుక్యులు అంటారు. వీరి పరిపాలనా కాలం క్రీస్తుశకం 750 నుంచి 973 వరకు దాదాపుగా 225 సంవత్సరాలు సాగింది.
  • వేములవాడ చాళుక్య వంశానికి మూలపురుషుడు సత్యాశ్రయ రణవిక్రముడు.
  • వేములవాడ చాళుక్య రాజ్యానికి మూలపురుషుడు వినయాదిత్య యుద్ధమల్లుడు (క్రీ.శ. 750 – 775). వినయాధిత్య యుద్దమల్లుడు రాష్ట్రకూట సామ్రాజ్య స్థాపకుడు అయినా దంతిదుర్గుని వద్ద సేనాధిపతిగా చేరి అతని యుద్ధాల్లో పాల్గొన్నాడు. శత్రుదుర్భేద్యమైన చిత్రకూట దుర్గాన్ని జయించి దంతిదుర్గనీ మెప్పు పొందాడు. యుద్ధ మల్లుడు తురుష్క, యవన, బర్బర, కాశ్మీర ,కాంభోజ, మగధ, కళింగ ,గాంగ ,పల్లవ ,పాండ్య కేరళ ప్రాంతాలను జయించాడని ఆయా రాజ్యాల ప్రభువులు యుద్ధమల్లుని పాదపూజ చేశారని కొల్లిపర తామ్ర శాసనం తెలుపుతుంది.
  • తన తండ్రి వినయాదిత్య యుద్ధమల్లుని తరువాత మొదటి అరికేసరి (క్రీ.శ. 775 – 800) అధికారాన్ని చేపట్టాడు. ఇతడు రాష్ట్ర కూట ధ్రువుని (ధృవ రాజు)కి సామంతుడు. ధ్రువునికి, అతని సోదరుడు రెండో గోవిందునికి జరిగిన వారసత్వ యుద్ధంలో మొదటి అరికేసరి ధృవున్ని సమర్థించాడు.  రెండో గోవిందునికి తూర్పు చాళుక్యరాజు నాలుగో విష్ణువర్ధనుడు సహాయం చేశాడు. దీనికి ప్రతీకారంగా దృవుడు విష్ణువర్ధనుడు పై యుద్ధాన్ని ప్రకటించాడు. ఈ యుద్ధాలను నిర్వహించింది మొదటి అరికేసరి. ఈ యుద్ధాల్లో విష్ణువర్ధనుడు ఓడి తన కూతురైన శీలమహాదేవిని రాష్ట్ర కూట ధ్రువరాజుకి ఇచ్చి వివాహం చేసి సంధి చేసుకున్నాడనీ ఇత్యాది విషయాలు కొల్లిపర తామ్ర శాసనంలో ఉన్నాయి.
  • ఈ విజయాలకు సూచికగా ద్రువుడు మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలో రామడుగు ప్రాంతాలను మొదటి అరికేసరికి బహుకరించాడని కురువగట్టు(మహబూబ్ నగర్) శాసనం తెలియజేస్తుంది.