Home  »  TGPSC 2022-23  »  Telangana History-3

Telangana History-3 (తెలంగాణ హిస్టరీ (చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana History (తెలంగాణ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

సరికాని జంటను గుర్తించండి:

  1. నాగనాథ : మదనవిలాసబనం
  2. గౌరన : నవనాథ చరిత్ర
  3. మదనాయక : రాఘవీయం
  4. పోతన : సుగ్రీవ విజయం
View Answer

Answer: 4

పోతన : సుగ్రీవ విజయం

Explanation:

  • సుగ్రీవ విజయం రచయిత కందుకూరి రుద్ర కవి. ఇతడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలోని కవి.
  • అనవోతు ఆస్థానంలో ఉన్న నాగనాథకవి మదన విలాస బాణం రచించాడు.
  • నవనాథ చరిత్ర 14-15వ శతాబ్దానికి చెందిన ద్విపద కావ్యము. దీనిని గౌరన రచించాడు. ఇందులో తొమ్మిది మంది శైవ సిద్దుల మహాత్మ్యం వర్ణించబడిండి.

Question: 12

ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
ఎ. నిజాం నసీర్-ఉద్-దౌలా నిజాం రాష్ట్రంలో సతిని నిషేధించార
బి. ప్రెస్స్ ముబారిజ్ ఉద్దౌలా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేట్లో వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించాడు.
సి. నిజాం 1853లో బేరార్ ఒప్పందంపై సంతకం చేసి బేదార్, రాయచూర్ మరియు ఉస్మానాబాద్ల ను బ్రిటిష్ వారికి అప్పగించాడు.
డి. తుర్రేబాజ్ ఖాన్ మరియు మౌల్వీ అల్లావుద్దీన్ నేత అత్వంలో దాదాపు 500 మంది వ్యక్తులు 1857 జూలై 17న కోటిలోని రెసిడెన్సీపై దాడి చేశారు, కానీ తిప్పికొట్టారు.
పై వాక్యాలలో ఏది సరైనది?

  1. ఎ, బి, సి మరియు డి
  2. ఎ, బి మరియు సి
  3. బి, సి మరియు డి
  4. ఎ, బి మరియు డి
View Answer

Answer: 1

ఎ, బి, సి మరియు డి

Explanation:

  • నసిర్ ఉద్దౌల కాలంలో 1848లో సతి నిషేధించబడింది.
  • హైదరాబాదులో వహాబీ ఉద్యమం 1838లో ముజారిజూద్దౌలా నేతృత్వంలో మొదలైంది.
  • నిజాం 1853 మే 21న బేరారు ఒప్పందం పై సంతకం చేసాడు. ఈ ఒప్పందం వల్ల బేరార్ రాష్ట్రం, ఉస్మానాబాద్ మరియు రాయచూరు జిల్లాలు బ్రిటిష్ వారికి అప్పగించబడ్డాయి.
  • జూలై 17, 1857లో తుర్రెభాజ్ ఖాన్ మరియు మౌల్వి అల్లావుద్దీన్ వందల మందితో బేగం బజార్ గుండా కోటిలోని బ్రిటిష్ రెసిడెన్సి పై దాడి చేశారు.
  • అప్పటి బ్రిటీష్ ప్రెసిడెంట్ డేవిడ్సన్ కు గట్టి యుద్ధ సవాల్ విసిరారు. బ్రిటిష్ రెసిడెంట్ డేవిడ్సన్ కూడా గట్టిగా వాళ్లని తిప్పి కొట్టాడు.
  • తుర్రెభాజ్ ఖాన్ ను కరమాత్ అలీ మ్యాజిస్ట్రేట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరు పరిచారు. జీవిత ఖైదు విధించారు .
  • అండమాన్ తరలిస్తుండగా మహబూబ్నగర్ జిల్లా మొగిలిగిద్ద వద్ద అతడు తప్పించుకున్నాడు.
  • ఆ తరువాత అతన్ని తూప్రాన్ దగ్గర అరెస్టు చేసే క్రమంలో జరిగిన పెనుగులాటలో తుర్రెభాజ్ ఖాన్ మరణించాడు.
  • అప్పటి బ్రిటిష్ రెసిడెన్సీనే నేటి కోటి ఉమెన్స్ కాలేజ్.కోటి ఉమెన్స్ కాలేజ్  తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మారింది.

Question: 13

ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
ఎ. కుతుబ్-షాహీలు స్థిరమైన పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశా
బి. వేలంలో అత్యధిక ధర పలికిన వ్యక్తికి భూ రెవెన్యూ వసూళ్లు లభించిన
పై వాక్యాలలో ఏది సరైనది?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఏదికాదు
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Explanation:

  • దక్కన్ లో గోల్కొండ కేంద్రంగా పరిపాలించిన కుతుబ్  షాహీలు గతంలో భారతదేశాన్ని ఢిల్లీ కేంద్రంగా పరిపాలించిన ఢిల్లీ సుల్తానుల కంటే, గుల్బర్గా కేంద్రంగా పరిపాలించిన బహమనీ సుల్తానుల కంటే సమర్థవంతమైన ప్రజారంజకమైన పరిపాలన వ్యవస్థను రూపొందించి, ఆచరణలో పెట్టారు.
  • వేలంలో అత్యధిక ధర పలికిన వ్యక్తికి భూ రెవెన్యూ వసూలు అధికారం ధారాదత్తం చేసే సంఘటనలు ఆసఫ్ జాహీల కాలంలో జరిగాయి.

Question: 14

ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
ఎ. కాకతీయుల పాలనలో వ్యవసాయం ప్రధాన వృత్తి.
బి. కాకతీయ సమాజంలో సతి ఆచారం తరచుగా కనిపించింది.
సి. తిక్కన మహాభారతంలోని 15 ఖండాలను పూర్తి చేశాడు.
డి. పద్మాక్షి ఆలయాన్ని వరంగల్లో గణపతిదేవుడు నిర్మించాడు.
పై వాక్యాలలో ఏది సరైనది?

  1. ఎ, బి మరియు డి
  2. ఎ, బి మరియు సి
  3. బి, సి మరియు డి
  4. ఎ, సి మరియు డి
View Answer

Answer: 4

ఎ, సి మరియు డి

Explanation:

  • కాకతీయుల కాలంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. కాకతీయ పాలకులు ముఖ్యంగా ప్రతాపరుద్రుడు అడవులను నరికి వేయించి వ్యవసాయం కోసం సాగు భూమినీ తయారు చేయడానికి ప్రయత్నించాడు.
  • గోల్కొండ కుతుబ్  షాహీల కాలంలో హిందువుల్లో, ముస్లింలలో మూఢ విశ్వాసాలు అనేకం ఉండేవి. జాతకాలు చెప్పించుకునేవారు. సతి సహగమనం కూడా ఉన్నది.
  • తిక్కన మహాభారతంలోని 15 పర్వాలను తెలుగులోకి అనువదించారు.తిక్కన లేదా తిక్కన సోమయాజి కాకతీయుల కాలంలోని  తెలుగు కవి. కవిత్రయంలో రెండో వాడు.
  • పంచమ వేదంగా కీర్తించబడే భారత పురాణేతిహాసం మహాభారతం ను తెలుగులోకి అనువదించిన ముగ్గురు కవులను కవిత్రయంగా పిలుస్తారు.
  • నన్నయ, తిక్కన మరియు ఎర్రాప్రగడ ను కవిత్రయం అంటారు. నన్నయ మహాభారతంలోని రెండున్నర పర్వాలను తెలుగులోకి అనువదించాడు.
  • నన్నయ అనువదించని అరణ్యపర్వములోని సగభాగాన్ని ఎర్రాప్రగడ అనువదించారు.
  • పద్మాక్షి ఆలయం కాకతీయుల కాలంలో రామప్ప గుడి కంటే ముందే నిర్మింపబడింది.

Question: 15

గోలకీ మరానికి సంబంధించిన వివరణాత్మక వృత్తాంతాన్ని ఏ అందిస్తుంది?

  1. గణపవరం
  2. హనుమకొండ
  3. మల్కాపురం
  4. త్రిపురాంతకం
View Answer

Answer: 3

మల్కాపురం

Explanation:

  • రుద్రమదేవి వేయించిన క్రీ.శ. 1261 నాటి మల్కాపురం శాసన ప్రకారం రుద్రమదేవి తన తండ్రి కోరిక మేరకు విశ్వేశ్వర శంభుకు వెలనాటి విషయంలో కృష్ణ తీరాన మందరం అనే గ్రామాన్ని దానంగా ఇచ్చింది.
  • ఈ గ్రామంలో విశ్వేశ్వర శంభు ఒక శుద్ధ శైవ మఠాన్ని, అన్నదాన సత్త్రాన్ని, శివాలయాన్ని నిర్మించాడు. ఇదే ప్రసిద్ధ గోళకీమఠంగా పేరు పొందింది.
  • కాకతీయుల కాలంలో శైవ మతం ఆదరణ పొందింది. శైవంలో కాలాముఖ, కాపాలిక , పాశుపత, ఆరాధ్యశైవ, వీరశైవం మొదలైన ఉపశాఖలు ఉండేవి.
  • మధ్యప్రదేశ్లోని జబల్ పూర్ చుట్టూ విస్తరించిన కాలచురి రాజ్యం శైవ సిద్ధాంత సంప్రదాయానికి కేంద్ర స్థానంగా వెలుగొందింది.
  • రన్నాడ్, కడ్వాహ మఠాలు మొదటి శైవ మఠాలు. మఠానికి గోళళీ మఠం అని పేరు. 13వ శతాబ్దం నాటికి కాలచురి రాజ్యంలో ఏర్పడిన రాజకీయ అశాంతి అస్థిరతల వల్ల కాలచురి రాజ్యంలోని శైవ గురువులు ఆంధ్రదేశానికి వలస వచ్చారు.
  • ధర్మశివుడు అనే గురువు క్రీ. శ. 1234 కి ముందే వచ్చి స్థిరపడ్డారు. ఇతడే గణపతిదేవుని గురువు.
Recent Articles