Home  »  TGPSC 2022-23  »  Telangana History-4

Telangana History-4 (తెలంగాణ హిస్టరీ (చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana History (తెలంగాణ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

అసఫ్ జాహీ కాలంలో సాలార్ జంగ్ యొక్క మొదటి సంస్కరణల గురించి సరైన ప్రకటనలు ఏవి?
ఎ. జిలాబందీ విధానాన్ని ప్రవేశపెట్టాడు.
బి. అతను మీర్ ఆలం ట్యాంకు నిర్మించాడు.
సి. అతను దార్-ఉల్-ఉల్మ్ పాఠశాలను స్థాపించాడు.
డి. ఆయన నిజాం కళాశాలను స్థాపించారు.
సరైన జవాబుని ఎంచుకోండి.

  1. బి మరియు డి మాత్రమే
  2. సి మరియు డి మాత్రమే
  3. బి మరియు సి మాత్రమే
  4. ఎ మరియు సి మాత్రమే
View Answer

Answer: 4

ఎ మరియు సి మాత్రమే

Explanation: 

  • సాలార్జంగ్ – 1 , 1865లో జిలాబందీ విధానం ప్రవేశపెట్టాడు.
  • సాలార్జంగ్ – 1, దారుల్ ఉలూమ్ పాఠశాలను ( విదేశీ విద్య విధానం కలిగిన ) 1855లో నెలకొల్పారు.
  • మీర్ ఆలం ట్యాంక్ ను నిర్మించినది మీర్ ఆలం బహదూర్. ఆయన 1804లో పునాది వేసి 1806లో మీరాలం ట్యాంకు నిర్మాణం పూర్తి చేశారు. మూడవనిజం సికిందర్ జా కాలంలో మీరాలం బహదూర్ హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రిగా 1804 నుండి 1808 మధ్య పనిచేశారు.
  • నిజాం కళాశాలను ఉస్మానియా యూనివర్సిటీ కి అనుబంధంగా 6 నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1887లో స్థాపించారు.

Question: 7

కింది వాటిలో శాతవాహనుల తొలి రాజధాని ఏది?

  1. ప్రతిస్థానపురం/పైఠాన్
  2. కోటిలింగాల
  3. అమరావతి
  4. ధాన్యకటకం/ధరణికోట
View Answer

Answer: 2

కోటిలింగాల

Explanation: 

  • కరీంనగర్ జిల్లాలోని గోదావరి, పెద్దవాగు సంగమ స్థానంలో ఉన్న కోటిలింగాల శాతవాహనుల సామ్రాజ్యానికి తొలి రాజధాని.
  • తెలంగాణానే కాకుండా, దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తొలి ప్రధాన రాజవంశం శాతవాహనులది.
  • దక్షిణ భారతదేశంలో మొదటి సువిశాల సామ్రాజ్యాన్ని వీరు స్థాపించారు. తెలంగాణలోని కోటిలింగాల (కరీంనగర్ జిల్లా)లో వీరి పాలన ప్రారంభమై, తరువాత ప్రతిష్టానపురం (పైఠాన్) రాజధాని అయింది.
  • మలి శాతవాహనుల కాలంనాటికి రాజధాని ధనకటకానికి (ధాన్యకటకం) మార్పు చేయడం జరిగింది.

Question: 8

ఈ క్రింది పరిశ్రమలను గత నిజాం కాలంలో స్థాపించబడిన ప్రదేశాలతో సరిపోల్చండి:
పరిశ్రమ పేరు
ఎ. ఆజం జాహీ టెక్స్ టైల్ మిల్స్
బి. ఆల్కహాల్ ఫ్యాక్టరీ
సి. హైదరాబాద్ కెమికల్స్ & ఫెర్టిలైజర్స్
డి. ఆయిల్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ
స్థలం
1. బోధన్
2. యాద్గిర్
3. వరంగల్
4. హైదరాబాద్
5. బెల్లంపల్లి
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

  1. ఎ-4, బి-5, సి-3, డి-2
  2. ఎ-2, బి-1, సి-3, డి-5
  3. ఎ-3, బి-2, సి-4, డి-5
  4. ఎ-3, బి-1, సి-5, డి-2
View Answer

Answer: 3

ఎ-3, బి-2, సి-4, డి-5

Explanation: 

  • ఆజం జాహి టెక్సటైల్ మిల్స్ ఒక వస్త్ర పరిశ్రమ. దీనిని వరంగల్లో 7 నిజం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1934లో నెలకొల్పారు.
  • హైదరాబాద్ కెమికల్స్ & ఫర్టిలైజర్స్ సంస్థ 1942లో స్థాపించబడింది.
  • యాద్గిర్ (కర్ణాటక) లో ఆల్కహాల్ ఫ్యాక్టరీ స్థాపించబడింది.
  • హైదరాబాదులో పారిశ్రామిక దశ 1874లో ప్రారంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధ కాలానికి హైదరాబాద్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగం పుంజుకుంది.

Question: 9

పుటకుటిల్లు’ అనే పదం కాకతీయుల కాలంలో కింది వాటిలో దేనిని సూచిస్తుంది?

  1. కులాంతర నివాసాలు
  2. దాణా/విశ్రాంతి గృహాలు
  3. సాగుదారుల నివాసాలు
  4. వేశ్యల గృహాలు
View Answer

Answer: 2

విశ్రాంతి/భోజన గృహాలు

Explanation: 

  • వినుకొండ వల్లభరాయడు రచించిన క్రీడాభిరామం కాకతీయుల జన సామాన్య జీవన విధానాన్ని ప్రతిబింబింపచేసింది. రావిపాటి త్రిపురాంతకుని సంస్కృత ప్రేమాభిరామానికి ఆంధ్రానుసరణం ( తెలుగు అనువాదం ) ఇది.
  • నగర నిర్మాణ తీరుతెన్నులు, నాటి వృత్తులు, కులాలు, ఆటలు, పూటకూటిల్లు (పూటకూళ్ల భోజనాలు), సామాన్య ప్రజల ఆచారాలు, విశ్వాసాలు మొదలైనవెన్నో ఈ గ్రంథంలో మనోజ్ఞంగా చిత్రింపబడ్డాయి.
  • కాకతీయ కాలం నాటి సాంఘిక ఆర్థిక పరిస్థితుకు అద్దం పట్టింది ఈ రచన. క్రీడాభిరామం ‘‘సిటీమ్యాప్’’ లాంటిదని అంటారు.

Question: 10

కుతుబ్ షాహీల ఆధ్వర్యంలో ఖిలాత్ ఆచారం ఏమిటి?

  1. న్యాయపరమైన అభ్యాసం
  2. గౌరవ వస్త్రం
  3. గౌరవ ఖడ్గం
  4. దండలు వేయడం
View Answer

Answer: 2

గౌరవ వస్త్రం

Explanation: 

  • ఖిలాత్ ఒక గౌరవ వస్త్రం. కుతుబ్ షాహీ నవాబులు ఖిలాత్‌ను విస్తృతంగా ఆచరించారు. ఖిలాత్ అందుకున్న వ్యక్తి ఉన్నతాధికారికి విధేయత చూపకపోవడం అమర్యాదగా పరిగణించబడింది. ఖిలాత్ ఆచారం సమర్థవంతమైన సామాజిక రాజకీయ ఆయుధంగా, ప్రజలను లొంగదీసుకోవడం మరియు అధికారులకు విధేయత చూపడం కోసం ఉపయోగించబడింది.
Recent Articles