Home  »  TGPSC 2022-23  »  Telangana History-5

Telangana History-5 (తెలంగాణ హిస్టరీ (చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana History (తెలంగాణ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కొలనుపాకలో త్రికూట శైలిలో జైన దేవాలయాన్ని కింది పాలకుల్లో ఎవరు నిర్మించారు?

  1. వేములవాడ చాళుక్యులు
  2. రాష్ట్రకూటులు
  3. కాకతీయలు
  4. కళ్యాణి చాళుక్య
View Answer

Answer: 2

రాష్ట్రకూటులు

Explanation: 

  • సాధారణంగా దేవాలయంలో ఒక్కరే ప్రధాన దేవుడు ఉంటాడు. కానీ కొన్ని దేవాలయాల్లో ముగ్గురు దేవుళ్ళు మూడు వేరువేరు గర్భ గృహాల్లో ఉంటారు.
  • ఇటువంటి ఆలయాలను త్రికూటాలయాలు అంటారు. కొలనుపాక జైన ఆలయం కూడా అటువంటిదే. ఇదీ త్రికూట శైలి ఆలయమే.
  • ఈ ఆలయం 2000ల ఏళ్ల నాటి శ్వేతాంబర జైన దేవాలయం. ఇందులో ఆదినాథుడు, మహావీరుడు, నేమినాథుడు  జైనదేవుళ్ళే ప్రధాన ఆకర్షణ. కొలనుపాక జైన త్రికూట ఆలయాన్ని నిర్మించిన వారు రాష్ట్రకూటులు. ఇది ఆలేరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది.

Question: 7

కాకతీయులు సైనిక సైన్యాధిపతులుగా తమ రాజకీయ జీవితాన్నిప్రారంభించారు:

  1. రాష్ట్రకూటులు
  2. వేంగి చాళుక్యులు
  3. బాదామి చాళుక్యులు
  4. శాతవాహనులు
View Answer

Answer: 1

రాష్ట్రకూటులు

Explanation: 

  • కాకతీయులు రాష్ట్రకూటులకు సేనలుగా, సైన్యాధిపతులుగా పనిచేశారు. రాష్ట్రకూటులకు సేనలుగా, చాళుక్యులకు రాష్ట్ర పాలకులుగా, దుర్గాధిపతులుగా సేవలందించిన కాకతీయులు వారి శౌర్య ప్రతాపాలు, నిజాయితీ వల్ల స్వతంత్రులై అ(హ)నుమకొండ, ఓరుగల్లు రాజధానులుగా తెలుగు భాష మాట్లాడే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రజలను పరిపాలించి శాశ్వత కీర్తిని గడించారు. నేటి తెలంగాణ సంస్కృతికి తొలి బీజాలు కాకతీయుల కాలంలోనే వేయబడ్డాయి.

Question: 8

కింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు?

  1. నీతిశాస్త్ర ముక్తావళి: బద్దెన
  2. నృత్య రత్నావళి: విద్యానాథ
  3. బసవ పురాణం: పాల్కురికి సోమనాథ
  4. శివయోగసారం: కొలను గణపతిదేవుడు
View Answer

Answer: 2

నృత్య రత్నావళి: విద్యానాథ

Explanation: 

  • నీతిసారం లేదా నీతి శాస్త్రముక్తావళి లేదా నీతిసార ముక్తావళి రచయిత బద్దెన. నీతిసారం ఒక తెలుగు భాషారచన.
  • ఈ రచన కాకతీయ రాజ్య, రాజకీయ వ్యవస్థ స్వభావ, స్వరూపాలను వర్ణిస్తుంది. అంతేకాకుండా రాజనీతిని, రాజధర్మ స్వరూపాన్ని కూడా వివరిస్తుంది.
  • నృత్త రత్నావళి రచయిత గణపతిదేవుని సేనాని అయిన జాయప. ఇది ఒక సంస్కృత రచన.
  • ఇది కాకతీయుల కాలం నాటి నాట్య, నృత్య రీతులను తెలియజేస్తుంది. పాలంపేట రామప్ప గుడి గోడలపై నృత్య భంగిమలను దీని నుంచే స్వీకరించి చెక్కారు.
  • బసవ పురాణము రచయిత పాల్కురికి సోమనాథుడు. ఇది ఒక తెలుగు భాషా రచన.
  • శివయోగసారం రచయిత కొలను గణపతి దేవుడు. ఇది తెలుగు భాషా రచన. గణపతి దేవుని కొలువులో ఉన్న ఇందులూరి నాయకులు చరిత్ర తెలియజేస్తుంది ఈ శివయోగసారం.
  • విద్యానాథుని రచన ప్రతాపరుద్ర యశోభూషణం

Question: 9

హైదరాబాదు రాష్ట్రంలో రైల్వేల పరిచయం ఈ కాలంలో ప్రారంభించబడింది:

  1. అరవ నిజాం
  2. ఐదవ నిజాం
  3. నిజాంతో పోరాడండి
  4. మూడో నిజాం
View Answer

Answer: 1

అరవ నిజాం

Explanation: 

  • నిజాం రాజ్యంలో మొట్టమొదటి రైల్వే లైను లేదా రైల్వే వ్యవస్థ ఆరవ నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ కాలంలో ప్రారంభమైంది.
  • 1864లో ఐదవ నిజాం కాలంలో భారత ప్రభుత్వం బొంబాయి నుంచి మద్రాస్ కు నడిపే రైలు మార్గం హైదరాబాదుకు కలపాలని బ్రిటిష్ ఇండియా ప్రభుత్వము మరియు హైదరాబాద్ రాష్ట్ర దివాన్ లేదా ప్రధానమంత్రి మధ్య ఒప్పందం కుదిరినా 1870లో రైల్వే లైన్ పనులు మొదలై 1874లో ఆరవ నిజాం కాలంలో  హైదరాబాద్లోని( నిజాం రాజ్యం) వాడి మరియు సికింద్రబాద్ మధ్య రైలు మార్గం ప్రజల సౌకర్యార్థం తెరిచారు.

Question: 10

స్థానికంగా ‘బురగుట్ట” అనే కొండపై మెగాలిథిక్ కాలం నాటి పురాతన రాక్-ఆర్ట్ సైట్ కనుగొనబడింది. ఈ ప్రదేశం ఎక్కడ ఉంది?

  1. నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం చెండుబట్ల గ్రామం దగ్గర
  2. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రేణవట్ల గ్రామం దగ్గర
  3. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మద్దికుంట గ్రామ శివారులో
  4. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామ శివారులో
View Answer

Answer: 4

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామ శివారులో

Explanation: 

  • కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు అల్లే రమేష్ రాజన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామ శివారులో బుర్కగుట్ట అనే గుట్టపై (నరసింహస్వామి ఆలయంగా స్థానికులు భావిస్తున్నారు) ఒక ప్రాచీన మెగాలిథిక్ కాలం నాటి గుహను కనుగొన్నారు.
  • గుహ గోడలపై బల్లి బొమ్మను రేఖాగణిత చిత్రాలను వృత్తాలను, త్రిభుజాకార చిత్రాలను, అడ్డ మరియు నిలువు గీతలను, రేఖలను , చేతులు పైకి ఎత్తి యున్న మనిషి చిత్రం మరియు 2 కుక్కల చిత్రాలను కనుగొన్నారు.
Recent Articles