Home  »  TGPSC 2022-23  »  Telangana History-5

Telangana History-5 (తెలంగాణ హిస్టరీ (చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana History (తెలంగాణ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

కాకతీయ ఆలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర ఏమిటి?

  1. అంతరాల మరియు గోపుర తోరణం
  2. ఉపపీఠం మరియు మకర తోరణం
  3. ప్రాకార మరియు అంతరాల
  4. రంగ మండపం
View Answer

Answer: 2

ఉపపీఠం మరియు మకర తోరణం

Explanation: 

  • రామప్ప గుడి లేదా రుద్రేశ్వరాలయము ఆరున్నర అడుగుల ఎత్తు గల ఉపపీఠంపై నిర్మించారు. ప్రదక్షిణపథం 10 అడుగుల వెడల్పు ఉంది దీనికి నాలుగు అంతస్తుల విమానం కలదు. మూడు వైపులా ప్రవేశ ద్వారాలు కలవు ఆలయంలో తట్టున నంది శిల్పం కలదు.

కాకతీయుల వాస్తు –  శిల్పకళ ప్రధాన లక్షణాలు

  • ఎతైన అధిష్టానం, వివిధ శిల్పాలతో చెక్కిన స్తంభాలు, జాలాలంకృతాలైన పిట్టగోడలున్న మండపాలు, తోరణ స్తంభాలు , ఎత్తైన విమానాలు, రంగమంటపాలు, ముఖపంటపాలు మొదలైనవి.

Question: 12

నిజాం కాలంలో హైదరాబాదులో హిందూ అబ్బాయిలకు సంస్కృతంలో శిక్షణ ఇవ్వడానికి కింది వారిలో ఎవరు వేద ధర్మ ప్రకాశిక పాఠశాలను ప్రారంభించారు?

  1. వినాయక్ రావు విద్యాలంకర్
  2. కాళోజీ రంగారావు
  3. శివ రామ్ శాస్త్రి
  4. గోపాల్ రావ్ ఎక్బోటే
View Answer

Answer: 3

శివ రామ్ శాస్త్రి

Question: 13

కాకతీయుల కాలంలో గ్రామాలు కింది వాటిలో ఏ వ్యవస్థ ద్వారా పాలించబడేవి?

  1. నర్వాది వ్యవస్థ
  2. నటవాది వ్యవస్థ
  3. రెడ్డి వ్యవస్థ
  4. ఆయగర్ వ్యవస్థ
View Answer

Answer: 4

ఆయగర్ వ్యవస్థ

Explanation: 

  • కాకతీయుల కాలంలో కూడా గ్రామమే పరిపాలన వ్యవస్థకు పునాదిగా ఉండేది. గ్రామాధికారులందరినీ కలిపి ఆయగార్లని వ్యవహరించేవారు.
  • ఆ కాలంలోని గ్రామ పరిపాలన వ్యవస్థను ఆయగార్ల వ్యవస్థ అనేవారు. కాకతీయులకు ముందే గ్రామస్థాయిలో ఆయగార్ల వ్యవస్థ ఏర్పడింది.
  • ఆయాగార్ల సంఖ్య 12. కమ్మరి, కంసాలి, వడ్రంగి, కుమ్మరి, చాకలి, మంగలి, వెట్టి, పురోహితుడు, చర్మకారుడు మున్నగు 9 కులాల వారు ఈ ఆయగార్ల లో ఉన్నారు .
  • కరణం, రెడ్డి , తలారి  3 ప్రభుత్వ సేవకులు( ఈ ముగ్గురికి పంటలో కొంత వాటా ఉంటుంది). మొత్తం 12 మంది.

Question: 14

వేములవాడలోని భీమేశ్వరాలయం నిర్మించిన గ్రామము:

  1. యుద్ధమల్ల
  2. నరసింహ-ల్
  3. అరికేసరి
  4. బద్దేగ
View Answer

Answer: 4

తో గ్రామాలు కింది వాటిలో

Explanation: 

  • తెలంగాణ ప్రాంతంలో వేములవాడలో నిర్మించిన దేవాలయాలన్ని 9వ, 10వ శతాబ్దానికి చెందినవి. వీటిలో భీమేశ్వర ఆలయం ముఖ్యమైనది.
  • ఈ ఆలయం 9వ శతాబ్దానికి చెందింది.దీన్ని బద్దెగ నిర్మించాడు. పూర్వం బద్ధిగేశ్వర ఆలయం అనేవారు. ఇదే ప్రస్తుత వేములవాడ భీమేశ్వరాలయము. బద్దెగ వేములవాడ చాళుక్యుడు. బద్దెగ పాలనా కాలం క్రీ. శ. 850 నుండి 895.
  • భీమేశ్వరాలయ గర్భగృహ ముఖ ద్వారం పై గజలక్ష్మి ఉంది. గర్భగృహపు గోడల్లో నాలుగు స్తంభాలు ఉన్నాయి. ఇది తొలి చాళుక్యుల సాంప్రదాయము.
  • ఆలయ అంతరాళపు ఉత్తర గోడపై మహిషాసురమర్దిని శిల్పం చెక్కబడి ఉంది.

Question: 15

కింది వారిలో శాతవాహనుల సామంతులుగా ఎవరు పరిగణించబడ్డారు.

  1. ఇక్ష్వాకులు
  2. కదంబులు
  3. కాకతీయులు
  4. చోడులు
View Answer

Answer: 1

ఇక్ష్వాకులు

Explanation: 

  • శాతవాహనులకు సామంతులుగా ఇక్ష్వాకులు వ్యవహరించారు.
  • శాతవాహనుల సామంత రాజ్యాల్లో శాంతిభద్రతలను కాపాడే మహా తలవరులుగా ఇక్ష్వాకులు పనిచేశారు.
  • మహాసేనాపతులుగా కూడా పనిచేశారు. శాతవాహనుల లాగా ఇక్ష్వాకులు వారి పేర్లకు మాతృనామాలు ధరించేవారు. శాతవాహనుల ప్రభావం వీరిపై ఉంది.
  • శాతవాహన సామ్రాజ్యం పతనమైన తర్వాత దక్షిణాపథంలో వెలసిన వివిధ ప్రాంతీయ రాజ్యాలలో ఇక్ష్వాకులది ప్రధానమైనది.
  • వీరు తెలంగాణ – కోస్తాంధ్ర ప్రాంతంలో పరిపాలన సాగించారు. క్రీస్తుశకం 220 నుంచి క్రీస్తు శకం 300 వరకు రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయించారు.
  • నాగార్జునకొండ నుంచి ప్రారంభమై శ్రీశైల పర్వతం చుట్టూ ఉన్న నల్లమల కొండల వరకు గల పర్వతశ్రేణిని శ్రీ పర్వతమని, ఆ పర్వత శ్రేణికి నలువైపులా ఉన్న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గుంటూరు,కర్నూలు, ప్రకాశం జిల్లాలు మరియు తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం మహబూబ్ నగర్ వరకు విస్తరించిన ప్రాంతాలను పరిపాలించారు కాబట్టి వీరిని శ్రీ పర్వతీయులు అని పేర్కొంటారు
Recent Articles