Home  »  TGPSC 2022-23  »  Telangana History-6

Telangana History-6 (తెలంగాణ హిస్టరీ (చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana History (తెలంగాణ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

మధ్యయుగ తెలంగాణలో వేటగాళ్లను, ఆహార సేకరణదారులను ఎలా పిలిచేవారు?

  1. హాలికులు
  2. కౌండాలికులు
  3. అసంఖ్యతలు
  4. గిరిజనులు
View Answer

Answer: 2

కౌండాలికులు

Explanation: 

  • మధ్యయుగ తెలంగాణలో వేటగాళ్లను, ఆహార సేకరణదారులను “కౌండాలికులు” అని పిలిచేవారు.
  • హాలికులు అంటే హలంతో పనిచేసేవారు. హలం అంటే నాగలి. హాలికులు అంటే నాగలితో పనిచేసేవారు అంటే రైతులు లేదా వ్యవసాయదారులు.
  • గిరిజనులు అంటే గిరులలో ( కొండల్లో ) నివసించేవారు.
  • కొండజాతులు – వివిధ రకాల తెగలు.

Question: 7

తెలంగాణలో ఈ క్రింది చారిత్రక దశలలో దేనికి రాక్షసులు సంబంధం కలిగి ఉన్నారు?

  1. మెగాలిథిక్
  2. నవీన శిలాయుగం
  3. మధ్యరాతియుగం
  4. ప్రాచీన శిలాయుగం
View Answer

Answer: 1

మెగాలిథిక్

Explanation: 

  • క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నుంచి క్రీస్తుశకం 300 సంవత్సరాల మధ్య తెలంగాణలోని ప్రజలు చనిపోయిన వారి, అస్థిపంజరాలను మట్టి శవపేటికలు గాని, రాతి గూడులో గాని పెట్టి, పూడ్చి ఆ గూడు చుట్టూ పెద్ద పెద్ద రాళ్లను వలయాకారంలో నిలిపేవారు కొన్నిచోట్ల గూడు నిర్మాణంలో వాడిన రాళ్లు కూడా భారీ పరిమాణంలో ఉన్నాయి కాబట్టి ఈ యుగాన్ని రాక్షసగూళ్ళ  యుగం లేదా పెద్ద రాతియుగమని, ఆ యుగంలో మొదటిసారిగా ఇనుప వస్తువులను విరివిగా వాడారు కాబట్టి అయోయుగమని పిలుస్తారు.

Question: 8

ఈ క్రింది వాటిలో ఏ ప్రదేశంలో ఆయుధాల కళ కలిగిన మానవ బొమ్మలు కనిపిస్తాయి?

  1. కొల్లాపూర్
  2. పెద్దమరూర్
  3. పాండవులగుట్ట
  4. ఓరుగల్లు
View Answer

Answer: 3

పాండవులగుట్ట

Explanation: 

  • పాండవుల గుట్టలు జయశంకర్  భూపాలపల్లి జిల్లా కేంద్రానికి 22  కి.మీ. దూరంలో, వరంగల్ –   మహదేవపూర్ రహదారిపై రేగొండ మండలం రావులపల్లె పరిసరాల్లో ఈ పాండవులగుట్టలున్నాయి.
  • ఎక్కువ మటుకు సున్నపురాళ్ళతో, అవక్షేపశిలలతో ఏర్పడిన ఈ గుట్టల్లో పొరలు పొరలుగా ఒకదాని మీదొకటి పేర్చినట్టుగా అనేక శిలాకృతులు కన్పిస్తాయి.
  • ఎత్తైన బండరాళ్ళ మధ్య లోతైన అగాధాలతో లోయలు, అడుగడుగునా అబ్బురపరిచేవిధంగా పడిగెలెత్తి నిల్చున్న కొండవాళ్ళు. ఆ కొండగోడలపై అపురూపమైన ప్రాచీన రాతిచిత్రాలు ఇక్కడ కనిపిస్తాయి.
  • ప్రాక్ యుగం నుండి చారిత్రకయుగం దాకా వేయబడిన రాతిచిత్రాలెన్నో అప్పటి జీవనశైలీ వైవిధ్యాల్ని కనువిందు చేస్తున్నాయి.
  • పాండవులగుట్టల్లో ఎదురుపాండవులు, గొంతెమ్మగుహ, పంచపాండవులు, పోతిరాజు చెలిమె, మేకలబండ, ముంగీసబండ, తుపాకులగుండు, యానాదుల గుహలు చూడాల్సిన ప్రదేశాలు.
  • వాటిలో ఎదురుపాండవులు దానికి కుడిపక్కన వెనకవైపు గుహలు, గొంతెమ్మగుహ, పంచపాండవుల దొనెల్లో అద్భుతమైన శిలాశ్రయచిత్రాలున్నాయి.

Question: 9

శాతవాహనుల కాలంలో ఈ క్రింది వాటిలో బంగారు నాణెం ఏది?

  1. మద
  2. గద్య
  3. సువర్ణ
  4. కర్షపణ
View Answer

Answer: 3

సువర్ణ

Explanation: 

  • శాతవాహనుల కాలంలో బంగారు నాణెం పేరు సువర్ణ లేదా స్వర్ణ. శాతవాహనులు సీసం, రాగి నాణాలను అధిక సంఖ్యలో ముద్రించారు.
  • రాగి, తగరం లోహాల మిశ్రమంతో  పోటీన్ నాణాలను ముద్రించారు. బంగారం మరియు వెండి నాణాలను తక్కువగా ఉపయోగించారు.
  • గౌతమీపుత్ర శాతకర్ణి నుంచి ఈ వెండి నాణాలను  ఉపయోగించారు. శాతవాహన రాజులు తమ నాణాలపై రాజు పేరు, బిరుదులు కొన్ని సందర్భాల్లో తండ్రి పేరును కూడా ముద్రించేవారు.
  • నాణేలపై కొన్ని సంకేతాలను – వృషభం, ఏనుగు, సింహం, కొండ లేదా గుట్ట, ఉజ్జయిని చిహ్నం, ఓడ, కమలం, శంఖం వంటివి ముద్రించేవారు.

Question: 10

నిజాం కాలంలో వడ్డీ వ్యాపారం చేసిన కంపెనీ పేరేమిటి?

  1. రామ్ , కిషనీ & బ్రదర్స్
  2. గ్రోవర్ & కంపెనీ
  3. పామర్ & కంపెనీ
  4. ముసద్దిలాల్ & కంపెనీ
View Answer

Answer: 3

పామర్ & కంపెనీ

Explanation: 

  • నిజాం కాలంలో వడ్డీ వ్యాపారం చేసిన కంపెనీ పామర్ అండ్ పామర్. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు విలియం పామర్.
  • ఇతడు నిజాం సైన్యంలో చేరిన తొలి బ్రిటిష్ పౌరుడు. చాలా కాలం సైన్యంలో పనిచేసి వ్యాపారం ప్రారంభించడానికి సైన్యానికి వీడ్కోలు చెప్పి బ్రిగేడియర్ స్థాయిలో పదవి విరమణ చేశాడు.
  • 1814లో గవర్నర్ జనరల్ కౌన్సిల్కు హైదరాబాద్ రాజ్యంలో బ్యాంకింగ్ సంస్థ తెరవడానికి అనుమతి తీసుకొని పామర్ అండ్ పామర్ కంపెనీ నెలకొల్పాడు.
  • రస్సెల్ బ్రిగేడ్ దళాల ఖర్చు తలకు మించిన భారం కావడంతో వీటిని చెల్లించడం నిజాం కు అసాధ్యమని భావించిన రస్సెల్,  పామర్ అండ్ పామర్ వ్యాపార సంస్థతో ఒక ఒప్పందం చేసుకోవాలనుకున్నాడు.
  • అందుకే పామర్ అండ్ పామర్ కంపెనీ అనుమతికి మరియు స్థాపనకు రస్సెల్ ప్రత్యేక ఆసక్తి చూపాడు. ఈ వ్యాపార సంస్థ తెరవడం హైదరాబాద్ రాజ్య ఆర్థిక దోపిడీకి శ్రీకారం అయ్యింది.
Recent Articles