Home  »  TGPSC 2022-23  »  Telangana History-6

Telangana History-6 (తెలంగాణ హిస్టరీ (చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana History (తెలంగాణ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

నిజాం కాలంలో బ్రిటిష్ వారు ‘స్టార్ ఆఫ్ ఇండియా’ బిరుదుతో వారిలో ఎవరిని సత్కరించారు?

  1. అఫ్టల్-ఉద్-దౌలా
  2. నాసిర్-ఉద్-దౌలా
  3. చందూలాల్
  4. సాలార్ జంగ్-1
View Answer

Answer: 4

సాలార్ జంగ్-1

Explanation: 

  • 1861లో 5వ నిజాం అఫ్జల్ ఉద్దౌలకు బ్రిటిష్ ప్రభుత్వం G.C.S.I ( Grand Commander Star of India ) హోదా ఇచ్చింది.
  • 1870లో సాలర్జంగ్ – 1 కి కూడా ఇవ్వబడింది.
  • 1857 తిరుగుబాటు జరిగిన కొన్ని ఏళ్ళ తర్వాత భారతదేశంలో బ్రిటిష్ అధికారం ఏకీకృతం అయిన తరుణంలో  భారతీయ యువరాజులను మరియు ముఖ్యులను అలాగే బ్రిటిష్ అధికారులను మరియు నిర్వాహకులను గౌరవించటానికి ఒక కొత్త నైట్ హుడ్ ఆర్డర్ ని రూపొందించాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది.
  • దానికి అనుగుణంగా సృష్టించబడిన గౌరవమే ఈ స్టార్ ఆఫ్ ఇండియా.
  • గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఇండియా లేదా స్టార్ ఆఫ్ ఇండియా అనేది విక్టోరియా మహారాణి 1861లో సృష్టించిన ఒక హోదా.
  • రాజకుటుంబం శూరత్వానికి ఇచ్చే ఒక గుర్తింపు. ఇది ఆర్డర్ ఆఫ్ చివల్రీ (Order of Chivalry). Chivalry అంటే శూరత్వం.
  • బ్రిటిష్ కి పాలనలో సహకరించిన వారికి ఇది ఇవ్వబడింది.

Question: 12

శాతవాహన రాజులు తమ సామంతులను ఈ క్రింది ఏ బిరుదులతో గౌరవించారు:
ఎ. సమరథి
బి. మహారథి
సి. మహాభోజ
డి. ప్రంథాధిపతి
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. ఎ మరియు డి మాత్రమే
  4. సి మరియు డి మాత్రమే
View Answer

Answer: 2

బి మరియు సి మాత్రమే

Explanation: 

  • శాతవాహనులు తమ సామంతులను మహా భోజులు, మహారధులు అనేవారు. శాతవాహనుల కాలంలోనే ప్రాంతీయ ప్రభుత్వాలు ఉన్నాయి.
  • అప్పటి నుండే ప్రాంతీయ ప్రభుత్వాలు సామంత ప్రభువుల చేతిలోకి రావడం మొదలైంది. చక్రవర్తికి వార్షిక కప్పం చెల్లిస్తూ, సైనిక సహాయం అందిచే మహాభోజులు, మహారధులు అనే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పదవులు సామంతులకు ఉండేవి.
  • వీరే ఆ తరువాత శాతవాహనుల పతనానంతరము స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు.

Question: 13

ఈ క్రింది వారిలో విష్ణుకుండి రాజు కానివారు ఎవరు?

  1. ఇంద్రవర్మ
  2. గోవిందవర్మ
  3. రవివర్మ-1
  4. మాధవవర్మ-2
View Answer

Answer: 1

ఇంద్రవర్మ

Explanation: 

  • రవి వర్మ  విష్ణుకుండినుల రాజు కాదు.
  • సుమారు 210 సంవత్సరాల పాటు కృష్ణా నది ఉత్తరంగా ఉన్న తెలంగాణను మరియు ఉత్తరాంధ్రను పరిపాలించిన అత్యంత ప్రాధాన్యం కల రాజవంశాల్లో విష్ణుకుండులది ప్రముఖమైనది.

విష్ణుకుండినుల పరిపాలన క్రమం :

  1. ఇంద్ర వర్మ (క్రీ. శ. 358 – 370)
  2. మొదటి మాధవవర్మ (క్రీ. శ. 370 – 398)
  3. గోవింద వర్మ (క్రీ. శ. 398 – 440)
  4. రెండవ మాధవవర్మ (క్రీ. శ. 440 – 495)
  5. దేవ వర్మ (క్రీ. శ. 495 – 496)
  6. మూడో మాధవవర్మ (క్రీ. శ. 496 – 510)
  7. మొదటి విక్రమేంద్ర వర్మ (క్రీ. శ. 510 – 525)
  8. రెండో ఇంద్ర (భట్టారక) వర్మ (క్రీ. శ. 525 – 555)
  9. రెండో విక్రమేంద్ర వర్మ (క్రీ. శ. 555 – 569)

Question: 14

ఈ క్రింది రాజవంశాలలో ఏ రాజవంశం క్షీణించడం శాతవాహనులకు దక్కన్ లో స్వతంత్ర అధికారాన్ని స్థాపించడానికి అవకాశాన్ని కల్పించింది?

  1. నందాలు
  2. మౌర్యులు
  3. గుప్తులు
  4. చోళులు
View Answer

Answer: 2

మౌర్యులు

Explanation: 

  • దక్కన్ లో మౌర్యుల పతనానంతరం శాతవాహనుల యుగం ప్రారంభమైంది. క్రీస్తుపూర్వం రెండు, ఒకటి శతాబ్దాల్లో మౌర్యుల పతనం తర్వాత స్థానిక రాజులు చిన్నచిన్న రాజ్యాలను పాలించారు.
  • ఆ తరువాత శాతవాహనుల ప్రధాన పరిపాలన మొదలైంది.
  • మౌర్య చక్రవర్తి బృహదృతున్ని అతని సేనాధిపతి పుష్యమిత్ర శుంగుడు సంహరించి స్వతంత్ర శుంగ సామ్రాజ్యాన్ని మగధ కేంద్రంగా ఉత్తర భారతంలో స్థాపించాడు.
  • ఆ తరువాతనే దక్షిణంలో శాతవాహనుల సామ్రాజ్యం ఆవిర్భవించింది.

Question: 15

కింది వాటిని చదివి, సరైన ప్రకటన(ల)ను ఎంచుకోండి.
ఎ. భోంగీర్ కోట పశ్చిమ చాళుక్య పాలకుడు త్రిభువనమల్ల విక్రమాదిత్య VI చే నిర్మించబడింది.
బి. భోంగీర్ కోట 12వ శతాబ్దంలో నిర్మించబడింది.
ఎంపికలు :

  1. కేవలం ఎ
  2. కేవలం బి
  3. ఎ మరియు బి రెండూ
  4. ఏదికాదు
View Answer

Answer: 1

కేవలం ఎ

Explanation: 

  • భువనగిరి లేదా భోనగిరి కోటను కళ్యాణి లేదా పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు అనబడు ఆరవ విక్రమాదిత్యుడు నిర్మించాడు.
  • ఈయన పశ్చిమ చాళుక్య రాజుల్లో గొప్పవాడు.
  • త్రిభువనమల్ల బిరుదు కలిగినవాడు. ఆయన పేరు మీదుగానే ఈయన నిర్మించిన కోటను భువనగిరి కోట అంటారు.
  • విక్రమాదిత్యుడు రాజ్యాధికారం చేపట్టిన తొలి నాళ్లలోనే శాలివాహన శకాన్ని మారుస్తూ విక్రమ శకాన్ని ఆరంభించాడు.
  • క్రీ. శ. 1076 నుంచి చాళుక్య విక్రమ శకం ప్రారంభమైంది. ఈయన పాలన కాలం క్రీ. శ. 1076 – 1126.
  • భువనగిరి కోట 11వ శతాబ్దంలో నిర్మించబడింది.
Recent Articles