Home  »  TGPSC 2022-23  »  Telangana Movement-1

Telangana Movement-1 (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana Movement (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

1940 లో అదిలాబాద్ జిల్లా బాబిఝురి లో జరిగిన గిరిజన తిరుగుబాటులో ఏ ఆదివాసీ తెగవారు తిరుగుబాటు చేశారు ?

  1. కోయలు
  2. గోండులు
  3. కొండ రెడ్డిలు
  4. బంజారాలు
View Answer

Answer: 2

గోండులు

Explanation: 

  • నిజాం పాలనను వ్యతిరేకిస్తూ గోండులు రెండు సార్లు పోరాటం చేశారు.
  1. 1857 లో రాంజీ గోండు నాయకత్వంలో నిర్మల్ కేంద్రంగా స్వాతంత్ర గోండ్వానా రాజ్యాన్ని స్థాపించాలని పోరాటం జరిగినది.ఈ పోరాటాన్ని కల్నల్ రాబర్ట్ అణిచివేసి రంజిగోండు తో పాటు 1000 మంది ని మర్రిచెట్టు కు ఉరి తీశారు దీన్నే వెయ్యి ఉరుల మర్రి అని పిలుస్తారు.
  2. రాంజీ గోండు స్పూర్తి తో కొమురంభీం 1938-1940 వరకు జాగీర్దార్ల దోపిడి కి నిజాం నిరంకుశ పాలన కు వ్యతిరేకంగా పోరాడాడు.
  • 1938 లో జోడేఘట్ నుండి జల్-జంగల్-జమీన్, మన జెండా-రగల్ అనే నినాదంతో  12 గ్రామాలను కలిపి స్వాతంత్ర గోండ్వానా రాజ్యాన్ని ప్రకటించాడు.
  • వీటిలో బాబేఝురీ, చాల్ బడి, జోడేఘాట్, పాట్నాపూర్, అంక్సాపూర్ మొదలైన గ్రామాలున్నాయి.
  • కొమురంభీం స్థావరం గురించి నిజాం అధికారులకు సమాచారం ఇచ్చిన ద్రోహి: కుర్దు పటేల్.
  • కొమురంభీం ను హత్య చేసింది:అక్టోబర్ 8, 1940న  అబ్దుల్ సత్తార్( తాలుకదార్) బలగాలు.
    సమాధి ఉన్న ప్రాంతం: జోడేఘాట్.

Question: 7

ఇండియన్ యూనియన్ లో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన తర్వాత మొదటి ముఖ్యమంత్రి ఎవరు?

  1. జె.ఎన్.చౌదరి
  2. రామానంద తీర్ధ
  3. జి.ఎస్. మెల్కోటే
  4. ఎమ్.కె. వెల్లోడి
View Answer

Answer: 4

ఎమ్.కె. వెల్లోడి

Explanation: 

  • ముల్లత్ కాడింగ్ వెల్లోడి కేరళ కు చెందిన సివిల్ సర్వీసెస్ అధికారి.
  • హైదరాబాద్ రాష్ట్రం భారత్ యూనియన్ లో కలిసిన తర్వాత JN చౌదరి తో మిలిటరీ ప్రభుత్వం (1948-49) ఏర్పడింది.
  • JN చౌదరి తీస్కున్న ప్రధాన చర్యలు:
  • హాలిసిక్కా నాణేలు రద్దు, సర్ఫ్-ఎ-ఖాస్ భూముల స్వాధీనం, శుక్రవారం కి బదులు ఆదివారం సెలవు.
  • భూస్వామ్య వ్యవస్థ రద్దు చట్టం(1949), హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగులేషన్ చట్టం-1 నవంబర్ 1949.
  • ఈయన కాలంలో హైదరాబాద్ రాజ్యంలో భయంకరమైన హత్య కాండ కొనసాగి 30000 కు పైగా ముస్లీములు చనిపోయారు.
  • దీని గురించి ఏర్పడ్డ విచారణ కమిటీ: పండిత్ సుందరలాల్ కమిటీ(1949) దీని తర్వాత భారత ప్రభుత్వం మిలిటరీ పాలనను ముగించి, MK వెల్లోడి ని ముఖ్యమంత్రిగా నియమించింది.
  • MK వెల్లోడి చర్యలు: 1950 లో హైదరాబాద్ టెనాన్సి అండ్ అగ్రికల్చర్ లాండ్స్ చట్టం.
  • మంత్రి మండలి: బూర్గుల రామకృష్ణ- విద్య, ఎక్సైజ్,రెవెన్యూ.
  • జైన్ యార్ జంగ్ బహదూర్- pwd శాఖ.
  • వళ్లూరి బసవరాజు- కార్మిక, పరిశ్రమల శాఖ.
  • పూల్ చంద్ గాంధీ- వైద్య, స్థానిక సంస్థలు.
  • వినాయకరవు విద్యాలంకార్ – వ్యవసాయం, పశుసంవర్ధక.
  • C.V.S రావు: వాణిజ్య, ఆర్థిక శాఖ.
  • శేషాద్రి- హోం, న్యాయశాఖ.

Question: 8

‘రయ్యత్’ వార్తాపత్రిక ఏ భాషలో ప్రచురించబడింది?

  1. తెలుగు
  2. కన్నడ
  3. ఆంగ్లం
  4. ఉర్దూ
View Answer

Answer: 4

ఉర్దూ

Explanation: 

రయ్యత్ వారపత్రిక :

  • మందముల నరసింగరావు ఎడిటర్ గా 1927 లో ప్రారంభమైంది.
  • ఇది హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం వ్యతిరేక ఉద్యమాల వార్తలు ప్రచురించేది.
  • తొలి సంచిక లో సరోజినీ నాయుడు, 2 వ సంచికలో మహారాజ కిషన్ పెర్షద్ కవితలను ప్రచురించింది.
  • ఈ పత్రికను 1929 లో నిజాం ప్రభుత్వం నిషేదించగా 1932 లో తిరిగి ప్రారంభం అయింది.

మందముల నర్సింగరావ్: 

  • రంగారెడ్డి జిల్లా  చేవెళ్ళ గ్రామం.
  • ఆంధ్ర జన సంఘం(1921) వ్యవస్థాపక సభ్యుడు.
  • రయ్యత్ వార్తాపత్రిక(1927)
  • 6 వ ఆంధ్ర మహా సభ (1937)-నిజామాబాద్(ఇందురు) ఆధ్యక్షుడు.
  • 1952: కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున హైదరాబాద్ శాసనసభ కు ఎన్నిక.
  • స్వీయ జీవిత చరిత్ర: ‘50 సంవత్సరాల హైదరాబాదు’ గ్రంథం.

Question: 9

కింది వారిలో హైదరాబాద్ లో “హ్యూమానిటేరియన్ లీగ్” ని ఎవరు ప్రారంభించారు?

  1. కేశవరావు
  2. అబ్దుల్ ఖయ్యూమ్
  3. రాయ్ బాలముకుంద్
  4. ప్రేమీలాల్
View Answer

Answer: 3

రాయ్ బాలముకుంద్

Explanation: 

  • హ్యూమనిటేరియన్  లీగ్: భాగ్యరెడ్డి వర్మ, రాయి బాలముకుంద్ లు కలిసి 1913 లో స్థాపించారు.
  • రాయి బాలముకుంద్: 1885 లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి. ఎ. పట్టా పొంది, నిజాం రాజ్యం లో డిగ్రీ పట్టా పొందిన తొలి ముల్కీ హిందువు.
  • 1908 లో హై కోర్టు జడ్జి గా పని చేశారు.
  • భాగ్యరెడ్డి వర్మ: నిజాం రాజ్య దళిత ఉద్యమ పితామహుడు.
  • స్థాపించిన సంస్థలు: జగన్ మిత్ర మండలి(1906), మన్య సంఘం(1911), ధర్మప్రచారిణి సభ(1910),
    భాగ్యనగర్ పత్రిక(1931)-(తరువాత దీని పేరు ను ‘ఆదిహిందు’ గా మార్చారు).

Question: 10

1923లో మొదటి హైదరాబాద్ రాజకీయ సమావేశం ఎక్కడ జరిగింది?

  1. హైదరాబాద్
  2. రాయచూర్
  3. కాకినాడ
  4. నాందేడ్
View Answer

Answer: 3

కాకినాడ

Explanation: 

  • 1918లో వామన్ నాయక్ అధ్యక్షునిగా హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ స్థాపించబడినది.
  • ఈ సంస్థ ను నిజాం రాజ్యంలో నిషేదం విధించడంతో రాజ్యానికి వెలుపల నాలుగు సదస్సులు
  • నిర్వహించారు:
    1. 1923: కాకినాడ –  మాధవరావు ఆనయ్
    2. 1926: బొంబాయ్ – Y.M. కాలే
    3. 1928: పూణే – N.C. కేల్కర్
    4. 1931: అకోలా – రామచంద్ర నాయక్.
Recent Articles