Home  »  TGPSC 2022-23  »  Telangana Movement-2

Telangana Movement-2 (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana Movement (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఏప్రిల్, 1975లో శ్రీ జలగం వెంగళరావు హయాంలో హైదరాబాద్ లో తెలుగువారి సమైక్యత పేరుతో జరిగిన మహాసభలను ఏమనిపిలుస్తారు.

  1. NRIల జాతీయ సమావేశాలు
  2. ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహాసభలు
  3. ప్రపంచ తెలుగు మహాసభలు
  4. ఆంధ్ర మహాసభ
View Answer

Answer: 3

ప్రపంచ తెలుగు మహాసభలు

Explanation:

  1. తెలంగాణ అస్తిత్వాన్ని కనుమరుగు చేసే ప్రక్రియ లో భాగంగా 1975 ఏప్రిల్ 12-18 వరకు మొదటిసారి హైదరాబాద్ లో జలగం వెంగళరావు ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు లాల్ బహదూర్ స్టేడియం లో నిర్వహించింది.
  2. ప్రపంచ తెలుగు మహాసభలు:
  •  మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు(1975)- హైదరాబాద్
  • రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు(1981)- కౌలాలంపూర్, మలేసియా.
  • మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు(1990)- మారిషస్.
  • నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు(2012)- తిరుపతి.
  • ప్రపంచ తెలుగు మహాసభలకు వ్యతికరేకంగా నిరసన తెలిపినవారు – శ్రీశ్రీ, చెరబండ రాజు, MT ఖాన్, రంగనాథం, నగ్నముని, జ్వాలాముఖి.

Question: 7

1983లో తెదేపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్యాకెట్ల ద్వారా మద్యాన్ని పంపిణీ చేసే పథకానికి ఇచ్చిన అధికారిక పేరు :

  1. మధు వాహిని
  2. నీరా వాహిని
  3. వారుణి వాహిని
  4. స్వర్గ వాహిని
View Answer

Answer: 3

వారుణి వాహిని

Explanation:

  • 1983లో ముఖ్యమంత్రి అయిన nt రామారావు ప్రభుత్వం ‘ వారుని వాహిని’ అనే పేరుతో ఎక్సైజ్ శాఖ ద్వారా సారాయ్ అమ్మ కాలనీ ప్రోత్సహించింది.
  • దీనితో అప్పటివరకు ఆరోగ్యవంతమైన కళ్లు సంస్కృతి ఉన్న తెలంగాణ లో ప్రమాధకరమైన సారాయి సంస్కృతి ప్రవేశించింది.
  • ఇది మాత్రమే కాకుండా టిడిపి ప్రభుత్వం అప్పటివరకు ఉన్న పటేల్-పట్వారీ వ్యవస్థ ను 1983లో రద్దు చేసి, vao/vro వ్యవస్థను ప్రారంభించింది.
  • (ఆ తరువాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం vro  వ్యవస్థను రద్దు చేసి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది).
  • తాలుకాలు రద్దు చేసి మండలాలు ఏర్పాటు చేశారు.
  • ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి గా కొనసాగుతున్న దాశరథి కృష్ణమాచార్యలు ని తొలగించి, ఆ పదవిని శాశ్వతంగా రద్దు చేసారు.

Question: 8

“నక్సలైట్లు మాత్రమే దేశభక్తులు” మరియు “నా ఎజెండా నక్సలైట్ల ఎజెండా” అని ప్రచారం చేసిన ముఖ్యమంత్రి ఎవరు?

  1. మర్రి చెన్నా రెడ్డి
  2. కె. చంద్రశేఖర్ రావు
  3. భవనం వెంకట్రామ్
  4. ఎన్.టి. రామారావు
View Answer

Answer: 4

ఎన్.టి. రామారావు

Explanation:

  • 1982 లో తెలుగు దేశం పార్టీని స్థాపించిన ప్రముఖ నటుడు  NT. రామారావు, తెలంగాణలోని వివిధ జిల్లాల గిరిజనులను, ఆదివాసీలను,  ప్రజలను ఆకర్షించడానికి ‘నక్సలైటులే నిజమైన దేశభక్తులు నక్సలైటుల అజెండానే నా అజెండా’ అని ఎన్నికల్లో ప్రచారం చేసి పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
  • ఆయన 1983 జనవరి 9 న తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
  • 1983 నుండి 1995 మధ్య 3 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు.
  • నోట్: ఉమ్మడి రాష్ట్రం లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం స్థాపించింది కూడా టిడిపి నే.

Question: 9

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1983లో ఈ క్రింది వ్యవస్థలలో ఏది రద్దు చేయబడింది?

  1. రక్షిత అద్దెదారు వ్యవస్థ
  2. బాల కార్మిక వ్యవస్థ
  3. గిరిజనుల భూ అలెనేషన్ వ్యవస్థ
  4. పటేల్ – పట్వారీ వ్యవస్థ
View Answer

Answer: 4

పటేల్ – పట్వారీ వ్యవస్థ

Explanation:

  • 1983 లో టిడిపి ప్రభుత్వం పటేల్-పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, vao/vro వ్యవస్థను ప్రారంభించింది.
  • ఈ నిర్ణయం అమలు కారణంగా తెలంగాణ సమాజంలో విపరీత పరిణామాలు చోటు చేసుకున్నాయి.
  • ప్రాచీన కాలం నుండి తెలంగాణ గ్రామీణ వ్యవస్థ కు పునాదులుగా  ఉండే చెరువుల బాగోగులను ‘నీరడి’ సహాయంతో చూసుకునేవారు.
  • భూముల వ్యవహారం, శిస్తులు, నీటి వనరులు పటేల్-పట్వారీలు చూసుకునేవారు.
  • ఆ తరువాత వచ్చిన VRO లకు ఈ వ్యవహారాల పై అనుభవం లేకపోవడం వల్ల గ్రామ పరిపాలన అస్తవ్యస్తమైపోయింది.
  • ఆ తరువాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 1996 లో VRO  వ్యవస్థను రద్దు చేసి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది.

Question: 10

షెడ్యూల్డ్ ప్రాంతం మరియు షెడ్యూల్డ్ తెగల పరిపాలన మరియు నియంత్రణకు సంబంధించి రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ నిబంధనలను రూపొందించింది?

  1. 6వ షెడ్యూల్
  2. 7వ షెడ్యూల్
  3. 8వ షెడ్యూల్
  4. 5వ షెడ్యూల్
View Answer

Answer: 4

5వ షెడ్యూల్

Explanation:

  • భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్, షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ తెగల పరిపాలన, నియంత్రణకు సంబంధించినది.
  • గిరిజన వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడానికి రూపొందించబడింది, ఇది గణనీయమైన గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటించడానికి రాష్ట్రపతికి అధికారం ఇస్తుంది, వారికి ప్రత్యేక రక్షణలు మరియు స్వయంప్రతిపత్తిని కల్పిస్తుంది.

ముఖ్య నిబంధనలు :

  1. కార్యనిర్వాహక అధికారాలు: షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు తెగలకు సంబంధించిన విషయాలపై సలహా ఇవ్వడానికి రాష్ట్రపతి ఒక కమిషన్‌ను నియమిస్తారు.
  2. శాసన అధికారాలు: షెడ్యూల్డ్ ప్రాంతాల కోసం చట్టాలను రూపొందించడానికి పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలకు పరిమిత అధికారం ఉంటుంది.
  3. పరిపాలనా అధికారాలు: షెడ్యూల్డ్ ప్రాంతాలు కలిగిన రాష్ట్రాల గవర్నర్లకు ప్రత్యేక బాధ్యతలు మరియు అధికారాలు ఉంటాయి.
  4. భూ బదలాయింపు నిషేధం: గిరిజనేతరులు గిరిజన యాజమాన్యాన్ని కాపాడుతూ, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూమిని సేకరించకుండా ఆంక్షలు విధించారు.
  5. సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి: షెడ్యూల్డ్ తెగల సంక్షేమం మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం షెడ్యూల్ లక్ష్యం.

భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ కు సంభందించిన ఆర్టికల్స్‌:

  • ఆర్టికల్స్ 244(1) మరియు 244(2) – షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు తెగల పరిపాలన
  • ఆర్టికల్ 275(1) – షెడ్యూల్డ్ తెగల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్రాలకు గ్రాంట్స్-ఇన్-ఎయిడ్
  • ఆర్టికల్ 19(5) మరియు 19(6) – షెడ్యూల్డ్ ప్రాంతాలలో కదలిక మరియు నివాస స్వేచ్ఛపై పరిమితులు
  • ఆర్టికల్ 13(3)(ఎ) – షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి చట్టం యొక్క నిర్వచనం
  • ఆర్టికల్ 164(1) – షెడ్యూల్డ్ ప్రాంతాలతో కూడిన రాష్ట్రాల శాసన సభలలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ ప్రాతినిధ్యం
  • ఆర్టికల్ 170(1) – షెడ్యూల్డ్ ప్రాంతాలతో కూడిన రాష్ట్రాల శాసన సభల కూర్పు
  • ఆర్టికల్ 198(2) – శాసన సభలలో షెడ్యూల్డ్ తెగలకు సీట్ల రిజర్వేషన్
  • ఆర్టికల్ 242 – షెడ్యూల్డ్ ప్రాంతాలకు పార్లమెంటు చట్టం వర్తించదని ఆదేశించే రాష్ట్రపతి అధికారం.
  • ఆర్టికల్ 243 – రాష్ట్ర శాసనసభ చట్టం షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తించదని ఆదేశించే రాష్ట్రపతి అధికారం
Recent Articles