Home  »  TGPSC 2022-23  »  Telangana Movement-4

Telangana Movement-4 (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana Movement (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

2004లో TRSతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఈ క్రింది విధంగా పేర్కొంది:

  1. \”తెలంగాణ సమస్యపై మేము ఒక కమిటీని నియమిస్తాము”

  2. “తెలంగాణ సమస్యపై మొదటి SRC అభిప్రాయాలను మేము గౌరవిస్తాము”

  3. “2009కి ముందే తెలంగాణ ఏర్పాటు చేస్తాం”.

  4. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తెలంగాణ ఏర్పాటు

View Answer

Answer: 2

“తెలంగాణ సమస్యపై మొదటి SRC అభిప్రాయాలను మేము గౌరవిస్తాము”

Explanation: 

  • 2004 ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ తో పొత్తు కుదుర్చుకోడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేసీఆర్ దగ్గరకు గులాం నబీ ఆజాద్ పంపండి ఇరువర్గాల మధ్య చర్చలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ప్రస్తావిస్తే టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు అంగీకరించింది.
  • ఎన్నికల ప్రణాళికలో ‘తెలంగాణ విషయంలో మొదటి ఎస్సార్సీ నివేదికలో వెల్లడించిన అభిప్రాయాలు గౌరవిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది’.
  • అప్పటి పి.సి.సి అధ్యక్షుడు – డి శ్రీనివాస్.
  • ఈ పొత్తులో భాగంగా ఎన్నికల్లో అసెంబ్లీకి 26 మంది లోక్‌సభకు ఐదుగురు టీఆర్ఎస్ నుండి ఎన్నికయ్యారు.
  • కెసీఆర్- కరీంనగర్, ఆలె నరేంద్ర- మెదక్, బోయినపల్లి వినోద్‌కుమార్- హన్మకొండ, రవీంద్రనాయక్- వరంగల్ మధుసూధన రెడ్డి-  ఆదిలాబాద్.

Question: 7

1999లో తెలంగాణ అనుకూల NRIలచే న్యూయార్క్ ఏర్పాటైన సంస్థ ఏది ?

  1. అమెరికన్ తెలుగు అసోసియేషన్

  2. తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం

  3. ఉత్తర అమెరికాలో తెలంగాణ అసోసియేషన్

  4. తెలంగాణ ఎన్.ఆర్.ఐ ల సంఘం

View Answer

Answer: 2

తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం

Explanation:

  • 1998 లో ఆచార్య జయశంకర్ సలహా మేరకు అమెరికాలో స్థిరపడిన తెలంగాణకు చెందిన వారు తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం స్థాపించారు.
  • ఇది ప్రారంభమైన ప్రదేశం: న్యూయార్క్
  • ప్రెసిడెంట్: మధు. K రెడ్డి
  • చైర్మన్: D.V. రెడ్డి.
  • ఇతర దేశాల్లో:
  • తెలంగాణ ఎన్నారై ఫోరం: వేణుగోపాల్(అధ్యక్షుడు)- లండన్‌లో
  • తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా: కె సుబ్బారావు.
  • అమెరికన్ తెలుగు అసోసియేషన్
  • మెల్ బోర్న్ తెలంగాణ ఫోరం.

Question: 8

తెలంగాణ మహా సభ లక్ష్యం:

  1. ప్రజాస్వామిక తెలంగాణ సాధన

  2. దళితులు మరియు బహుజనులచే రాష్ట్ర ఏర్పాటు

  3. సోషలిస్టు తెలంగాణ ఏర్పాటు

  4. భౌగోళిక తెలంగాణ సాధన

View Answer

Answer: 2

దళితులు మరియు బహుజనులచే రాష్ట్ర ఏర్పాటు

Explanation:

  • 1997 ఆగస్టు లో తెలంగాణ మహాసభ ఏర్పడింది
  • దీని లో కీలక పాత్ర పోషించింది: మారోజు వీరన్న
  • 1997 ఆగస్టు 11న “ధోఖాతిన్న తెలంగాణ” పేరుతో సూర్యాపేటలో  సదస్సు జరిగింది
  • ఈ సదస్సుకు అధ్యక్షత వహించింది – డా. చెరుకు సుధాకర్
  • ఈ సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారు –వి ప్రకాష్
  • 17 డిమాండ్లతో “సూర్యాపేట డిక్లరేషన్” ను చెరుకు సుధాకర్ ప్రతిపాదించారు. మారోజు వీరన్న  ఈ సంస్థ
  • ఆధ్వర్యంలో  తెలంగాణ ఉద్యమంలోకి దళిత, బహుజనులను అందరినీ  సమీకరించారు
  • ఆ తరువాత మారోజు వీరన్న ఎన్ కౌంటర్ లో మరణించారు
  • తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తెలంగాణ మహాసభ మాస పత్రికను వి. ప్రకాష్ వెలువరించారు.
  • 1997 లో తెలంగాణ మహాసభ నిర్వహించిన సదస్సులు:
    1. మోత్కూర్ సదస్సు- గంజి రాములు
    2. మహబూబ్ నగర్ సదస్సు- చెరుకు సుధాకర్
    3. మెదక్ సదస్సు- బాలరాజుగౌడ్
    4. వరంగల్ సదస్సు- చెరుకు సుధాకర్.

Question: 9

ఒక ఓటు రెండు రాష్ట్రాలు పరిష్కారానికి బీజేపీ కాకినాడ సదస్సు ఏ సంవత్సరంలో జరిగింది?

  1. 1996

  2. 1997

  3. 1998

  4. 1999

View Answer

Answer: 3

1998

Explanation:

  • 1998 లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరిగిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ కాకినాడలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది.
  • ఈ సమావేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు మద్దతు తెలిపారు
  • తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌తో  ముందుకు వచ్చిన మొదటి జాతీయ పార్టీ-   బీజేపీ
  • (తెలంగాణకు మద్దతు తెలిపిన తొలి పార్టీ- స్వతంత్ర పార్టీ)
  • కాకినాడ సభలో ‘ ఒక్క ఓటు- రెండు రాష్ట్రాలు’ అనే నినాదంతో బిజెపి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది.
    ఈ ఎన్నికల్లో బీజేపీ మూడు నియోజకవర్గాల్లో గెలిచింది- మహబూబ్ నగర్, సికింద్రాబాద్, కరీంనగర్.

Question: 10

NDAలో భాగమైన తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నదని 2004 ఎన్నికల సమయంలో ఏ బిజెపి జాతీయ నాయకుడు విలపించారు?

  1. ఎల్. కె అద్వానీ

  2. ప్రమోద్ మహాజన్

  3. సుష్మా స్వరాజ్

  4. ఎ.బి వాజ్ పేయి

View Answer

Answer: 1

ఎల్. కె అద్వానీ

Explanation:

  • 2004 ఎన్నికల సందర్భంలో L.K. అద్వానీ NDA లో  భాగస్వామ్యమైన టిడిపి అడ్డ్డుకోవడం వల్లనే 2000 లో తెలంగాణను ఏర్పాటు చేయలేకపోయామని తెలిపారు.
  • 2008 లో సంకల్ప యాత్ర చేపట్టిన అద్వానీ రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే వందరోజుల్లో తెలంగాణ ఇస్తామని ప్రకటించాడు.
  • 2009 లో నిరాహార దీక్ష చేసిన కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అద్వానీ మాట్లాడుతూ తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో టీఆర్ఎస్ అధినేత ప్రాణాలు కాపాడ డం కూడా అంతే ముఖ్యమని వాదించాడు.
  • L.K అద్వానీ:
  • లాల్ కృష్ణ అద్వానీ 2002 నుండి 2004 వరకు భారతదేశానికి 7వ ఉప ప్రధానమంత్రిగా పనిచేసారు. అతను భారతీయ జనతా పార్టీ (BJP) సహ వ్యవస్థాపకులలో ఒకరు మరియు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సభ్యుడు
    – భారతరత్న (2024)
    – పద్మవిభూషణ్ (2015)
    – హోం వ్యవహారాల మంత్రి (1998-2004)
    – లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు (2004-2009, 1990-1993)
    – భారత ఉప ప్రధాన మంత్రి (2002-2004)
    – సమాచార మరియు ప్రసార మంత్రి (1977-1979)
Recent Articles