Home  »  TGPSC 2022-23  »  Telangana Movement-6

Telangana Movement-6 (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana Movement (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

AP పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, AP మరియు తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు కొనసాగుతుంది:

  1. అపాయింట్ మెంట్ రోజు నుండి 5 సంవత్సరాల కాలానికి

  2. ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పడే వరకు

  3. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడే వరకు

  4. అపాయింట్ మెంట్ రోజు నుండి 10 సంవత్సరాల కాలానికి

View Answer

Answer: 2

ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పడే వరకు

Explanation:

  • AP పునర్వ్యవస్తీకరణ చట్టం, 5 వ భాగం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేవరకు ప్రస్తుత హైకోర్టు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు గా నే ఉంటుంది.
  • ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసిన తర్వాత హైదరాబాద్ లోని జుడీయేచర్ తెలంగాణ హైకోర్టు గా మారుతుంది.
  • ఏర్పాటు అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిది లోని కేసు లు బదిలీ చేస్తారు.
  • బదిలీ అయిన కేసుల్లో హైదరాబాద్ హైకోర్టు న్యాయవాది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదించే హక్కు ఉంటుంది.

Question: 7

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని ఏ నిబంధన రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కార్యనిర్వాహక / ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా సవరించడం ద్వారా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏదైనా చట్టాన్ని ఆమోదించడానికి అధికారం ఇస్తుంది?

  1. సెక్షన్ 100

  2. సెక్షన్ 90

  3. సెక్షన్ 104

  4. సెక్షన్ 101

View Answer

Answer: 4

సెక్షన్ 101

Explanation:

  • AP పునర్వ్యవస్తీకరణ చట్టం, 12 వ భాగం, 102 సెక్షన్ ప్రకారం అపాయింటెడ్ డే కు ముందు చేసిన చట్టాలను వర్తింపచేసుకోవడానికి సెక్షన్ 101 కింద నియమాలు చేయలేదని భావించకుండా ఆ చట్టాలని అమలు చేయడానికి అవసరమైన అధికారం ఉన్న న్యాయస్థానం ట్రిబ్యూనల్ రెండు రాష్ట్రాలకు సంబంధించి వర్తింపచేయడంలో విచారించాల్సిన వివాదాలకు సంబంధించి అవసరమని భావించినంత మేరకు ఆ చట్టంలోని లక్ష్యం దెబ్బ తినకుండా దాన్ని సవరణ చేసుకోవాలి.

Question: 8

డిసెంబర్ 24, 2009న తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పరచడానికి కారణమేమిటి?

  1. ఫ్రీ జోన్ పై సుప్రీంకోర్టు తీర్పు

  2. డిసెంబర్ 9 ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం U-టర్న్

  3. 610 GO అమలు కానిది

  4. కె. చంద్రశేఖర్ రావు అరెస్ట్

View Answer

Answer: 2

డిసెంబర్ 9 ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం U-టర్న్

Explanation:

  • KCR నిరాహార దీక్షతో తెలంగాణ లో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చినందుకు  Dec 9 2009 న కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేశాడు.
  • కానీ ఈ ప్రకటనతో ఆంధ్రాలో ఆందోళనలు జరగడంతో Dec 23 న మరొక ప్రకటన చేస్తూ అసెంబ్లీ లో తీర్మానం చేసిన తరువాత నే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం.
  • అప్పటివరకు ఏర్పాటు వాయిదా వేస్తున్నాం అని ప్రకటించడంతో, తెలంగాణ ఉద్యమం ముందుకి తీసుకుపోవడానికి Dec 24 2009 న వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ(TJAC) ని ఏర్పాటు చేసుకున్నాయి.
  • దీని చైర్మెన్: ప్రొ. కోదండ రాం 

Question: 9

\”మేము తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాము. రాష్ట్ర అసెంబ్లీలో అవసరమైన తీర్మానాన్ని ప్రవేశపెడతాము\”. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన ఏ తారీఖున చేసింది:

  1. డిసెంబర్ 23, 2009

  2. జూలై 30, 2013

  3. జూలై 2, 2014

  4. డిసెంబర్ 9, 2009

View Answer

Answer: 4

డిసెంబర్ 9, 2009

Explanation: 

  • మేము తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాము. రాష్ట్ర అసెంబ్లీలో అవసరమైన తీర్మానాన్ని ప్రవేశపెడతాము\”అని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9, 2009 ప్రకటన చేసింది.
  • Dec 9 న పార్లమెంటు లో KCR ఆరోగ్యం పై విస్తృత స్థాయి చర్చ జరిగినది.
    L.K. అద్వానీ మాట్లాడుతూ ‘తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో తెరాస అధినేత ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. దీని పై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని’ అన్నారు.
  • హోం మంత్రి చిదంబరం Dec 9,2009 న రాత్రి 11.30 గంటలకు ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించి అసెంబ్లీ లో తీర్మానం ప్రవేశ పెడతాము’ అని ప్రకటించారు.
  • ఈ ప్రకటనతో ప్రొ. జయసంహకర్ కేసీఆర్ కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు.
    ఈ ప్రకటనతో ఆంధ్ర లో ఆందోళనలు జరగడంతో Dec 23 న మరూ ప్రకటన చేస్తూ ‘అసెంబ్లీ లో తీర్మానం చేసిన తరువాత రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం’ అని అన్నారు.
  • దీని పర్యావసనంగా తెలంగాణ ఉద్యమం ముందుకి సాగడానికి T-JAC Dec 24 2009ప్రొ. కోదండరామ్ చైర్మెన్ గా ఏర్పాటు చేశారు.

Question: 10

తెలంగాణా సమస్యకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన నివేదికలో ఆరు ఎంపికలు ఇచ్చింది. కింది వాటిలో మొదటి ఎంపిక ఏది?

  1. గ్రేటర్ హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది.

  2. తెలంగాణ ఏర్పాటు

  3. AP యథాతథ స్థితిని కొనసాగించడం

  4. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది

View Answer

Answer: 3

AP యథాతథ స్థితిని కొనసాగించడం

Explanation:

2010 Feb 3 న కేంద్ర ప్రభుత్వం శ్రీ కృష్ణ కమిటీ ని నియమించింది.
సభ్యులు:
1. SC రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ B.N శ్రీకృష్ణ- అధ్యక్షుడు.
2. వినోద్ కుమార్ దుగ్గల్( హోం శాఖ మాజీ కార్యదర్శి)
3. రణబీర్ సింగ్( హైదరాబాద్ లోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం(NALSAR) వ్యవస్థాపక డైరెక్టర్)
4. రవీందర్ కౌర్( ఢిల్లీ ఐఐటి లో మానవ సామాజిక శాస్త్రాల ప్రొఫెసర్)
5. అబుసలే షరీఫ్(ఆర్థికవేత్త)
నివేదిక: 2010 Dec 30.
668 పేజీలు, 9 అధ్యాయాలు( 8- చీకటి అధ్యాయం)
6 ప్రతిపాదనలు/సూచనలు:
1. Ap యథాతథ స్థితి కొనసాగింపు
2. సీమాంధ్ర, తెలంగాణ లుగా విడగొట్టి హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చేయడం.
3. రాయల తెలంగాణ, కోస్తాంధ్ర గా విభజన.
4. సీమాంధ్ర, తెలంగాణగా విభజన, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం.
5. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు.
6. సమైఖ్యంగానే ఉంచి తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు.

Recent Articles