Home  »  TGPSC 2022-23  »  Telangana Movement-7

Telangana Movement-7 (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Previous Questions and Answers in Telugu

Telangana Movement (తెలంగాణ ఉద్యమ చరిత్ర) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

జాబితా -1ని జాబితా -2 తో సరిపోల్చండి మరియు దిగువ ఇచ్చిన ఎంపికల,నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
(ఈవెంట్)

ఎ. హైదరాబాద్ 11 రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాటు

బి. జాగీర్దారీ వ్యవస్థ రద్దు
సి. రక్షిత అద్దెదారుల చట్టం  అమలు

డి. మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు

(సంబంధిత సంవత్సరం) 

1, 1950

2.1953

3. 1938

4. 1949

  1. ఎ-2, బి-1, సి-3, డి-4

  2. ఎ-3, బి-1, సి-4, డి-2

  3. ఎ-3, బి-4, సి-1, డి-2

  4. ఎ-2, బి-3, సి-1, డి-4

View Answer

Answer: 3

ఎ-3, బి-4, సి-1, డి-2

Explanation:

  • హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాటు: 1938
  • స్వామి రామానంద తీర్థ
  • జాగీర్దారీ వ్యవస్థ రద్దు: 1949
  • JN చౌదరి ప్రభుత్వం
  • నిజాం సర్ఫేఖాస్ భూములు స్వాదీనం
  • కౌలుదార్ల బలవంతపు పన్నుల చెల్లింపు నిషేదం.
  • జాగీర్దారీ భూముల్లో ఉండే కౌలుదార్లు చెల్లించాల్సిన భూమి శిస్తు: 12.5
  • హైదరాబాద్ రక్షిత కౌలుదారి- వ్యవసాయ భూముల చట్టం: 1950
  • భూస్వాముల ఆగడాల నుండి కలుదార్ల రక్షణ
  • 6 సంవత్సరాలు కౌలుదార్లుగా భూమిని సాగు చేస్తే వారిని రక్షిత కలుదార్లుగా గుర్తింపు.
  • కౌలుదార్లు భూస్వాముల నుండి మార్కెట్ ధరల కంటే తక్కువ రేటుకే భూమి కొనుగోలు హక్కు.
  • మొదటి SRC: 1953
  • సభ్యులు: సయ్యద్ ఫజల్ అలీ, H.N కుంజ్రూ , K.M ఫణిక్కర్

Question: 7

హైదరాబాద్ రాష్ట్రంపై పోలీసు చర్య సమయంలో కింది వారిలో భారత సైన్యం యొక్క జనరల్ ఆఫీసర్ కమాండర్ – ఇన్ – చీఫ్ సౌత్ కమాండ్ ఎవరు ?

  1. లెఫ్టినెంట్ జనరల్ EN గొడార్

  2. బ్రిగేడియర్ SD వర్మ

  3. మేజర్ జనరల్ JN చౌదరి

  4. మేజర్ జనరల్ AA రుద్ర

View Answer

Answer: 1

లెఫ్టినెంట్ జనరల్ EN గొడార్

Explanation:

ఆపరేషన్ పోలో:

  • 13 సెప్టెంబర్- 17 సెప్టెంబర్, 1948
  • ఈ సైనిక చర్యను ఆపరేషన్ పోలో, ఆపరేషన్ క్యాటర్‌పిల్లర్, గోడార్డ్ ప్లాన్ అని అంటారు
  • ఈ ప్రణాళికను రూపొందించింది: EN గోడార్డ్(దక్షిణ భారతదేశపు సైనిక విభాగాధిపతి)
  • ఆపరేషన్ పోలో సమయంలో:
  • భారత ప్రధాన సైన్యాధిపతి- సర్ రాయ్ బుచర్
  • భారత రక్షణ మంత్రి- బాల్దేవ్ సింగ్
  • భారత హోంమంత్రి- వల్లభాయ్ పటేల్
  • భారత గవర్నర్ జనరల్- C రాజ గోపాలచారి
  • భారత సంస్థానాల కార్యదర్శి- V.P మీనన్
  • హైదరాబాద్ సైన్యాధిపతి- జనరల్ L Edroos
  • హైదరాబాద్ ప్రధాని- మీర్ లాయక్ అలీ
  • హైదరాబాద్ పోలీస్‌కమిషనర్- దిన్ యార్ జంగ్

Question: 8

ముల్కీ ఆందోళనలపై కాల్పులపై విచారణకు నియమించిన కమిషన్ ఛైర్మన్ ఎవరు?

  1. జస్టిస్ జగన్మోహన్ రెడ్డి

  2. వెల్లోడి

  3. డాక్టర్ వాఘ్రే

  4. పండిట్ సుందరియల్

View Answer

Answer: 1

జస్టిస్ జగన్మోహన్ రెడ్డి

Explanation:

  • 1952 సెప్టెంబర్ 3 – సిటీ కాలేజీ లో జరిగిన జరిగిన కాల్పుల విచారణకు జస్టిస్ పింగలి  జగన్మోహన్ రెడ్డి కమిటీ ని నియమించారు
  • ఇది ఏకసభ్య కమిటీ
  • ఈ కమిటీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణ, పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ తో సహ అనేక మందిని విచారించి 28 Dec 1952 న నివేదిక సమర్పించింది.
  • జగన్మోహన్ రెడ్డి ఆత్మకథ: The judiciary I served.

Question: 9

కింది వాటిలో 1952 ముల్కీ ఉద్యమం యొక్క పర్యవసానం కానిది ఏది?

  1. సీమాంధ్ర ఆధిపత్యాన్ని నిరసించారు.

  2. స్థానిక ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఆకాంక్షించారు

  3. 1919లో చివరి నిజాం జారీ చేసిన ఫిర్మానా రద్దు

  4. ప్రత్యేక తెలంగాణ కోరికను బలపరచడం

View Answer

Answer: 3

1919లో చివరి నిజాం జారీ చేసిన ఫిర్మానా రద్దు

Explanation:

1952 ముల్కీ ఉద్యమంలో భాగంగా :

  • సీమాంధ్ర ఆడిపత్యాన్ని నిరసిస్తూ ‘ఇడ్లీ-సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్’ నినాదాలు ఇచ్చారు.
  • స్థానిక ఉద్యోగాలు స్థానీకులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
  • 1952 లో జరిగిన గైర్ ముల్కీ ఉద్యమం తరువాత తెలంగాణ ప్రాంత ప్రజలలో హైదరాబాద్ రాజధానిగా  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోరికను బాలపరిచారు.
  • 1952 ముల్కీ ఉద్యమ ప్రధాన సంఘటనలు:
  • వరంగల్ లో నిరసనలు: హాయగ్రీవచారి  
  • హైదరాబాద్ హిత రక్షణ సమితి: G. రామాచారి.
  • సిటీ కాలేజీ ఘటన:
  • పోలీసు:శివకుమార్ లాల్
  • కమిటీ: జగన్మోహన్ రెడ్డి

Question: 10

1952లో ముల్కీ ఉద్యమం ప్రారంభమైన మొదటి జిల్లా ఏది?

  1. వరంగల్

  2. రంగారెడ్డి

  3. నల్లగొండ

  4. హైదరాబాద్

View Answer

Answer: 1

వరంగల్

Explanation:

  • 1952 వరంగల్ లో ముల్కీ ఉద్యమం ప్రారంభం అయింది.
  • పార్దసారధి అనే ఆంధ్ర విధ్యాధికారి ఉపాదయాయ బదిలీలలో నాన్-ముల్కీ లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ
  • స్థానీకులను మారుమూల గ్రామాలకు బదిలీ చేయడంతో నిరసనలు మొదలయ్యాయి
  • 26-జులై 1952: హాయగ్రీవచారి నాయకత్వంలో హనుమకొండ-సుబేధారి వరకు 4000 ల విద్యార్థులతో ర్యాలీ.
  • 28 జులై 1952: బుచ్చయ్య కన్వీనర్ గా విద్యార్థి JAC
  • 27 ఆగస్టు 1952: ముల్కీ సమస్య పై హైదరాబాద్ లో తొలి బహిరంగ సమావేశం
  • అధ్యక్షుడు: సికింద్రాబాద్ మేయర్ డాక్టర్ తిమ్మరాజు.
Recent Articles