Home  »  TG TET  »  Social Studies-4

Social Studies-4 (సోషల్ స్టడీస్) Previous Questions and Answers in Telugu

These Social Studies (సోషల్ స్టడీస్) previous questions and answers in Telugu are very useful for TG TET Paper 1 and Paper 2 examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu

Question: 1

అభ్యసన లక్ష్యాలకు సంబంధించి జాబితా – శ్రీ కింద ఇచ్చిన వాటిని జాబితా – B కింది ఇచ్చిన వానితో
జతపరచండి.

జాబితా – A

A)  అనువర్తించుట

B)  మూల్యాంకనం చేయుట

C)  సృష్టించుట

D)  విశ్లేషించుట

జాబితా – B

i) ఇంటర్ నెట్ విపరీతంగా వాడటంపై నిర్ణయం తీసుకొనుట

ii) ప్రయాణంలో ట్రాఫిక్ రూల్స్ పాటించుట

iii) విషయాల మధ్య గల తార్కిక సంబంధాలు తెలుసుకొనుట

iv)  నూతన ఆలోచనలను ఆవిర్భవింపజేయుట

సరియైన సమాధానాన్ని గుర్తించుము:

  1. A-ii, B-iv, C-i, D-iii

  2. A – ii, B-iii, C-iv, D-i

  3. A – ii, B – i; C- iv; D- iii

  4. A – iii, B-i, C-iv; D – ii

View Answer

Answer : 3

A – ii, B – i, C- iv; D- iii

Question: 2

తొమ్మిదవ తరగతి విద్యార్థులకు పర్వతాలు, పీఠభూములు, ఎడారులు, లోయలకు సంబంధించిన భావనల గురించి బోధించుటకు ఈ క్రింది పటాలు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి.

  1. రిలీఫ్ పటాలు

  2. రాజకీయ పటాలు

  3. ఆవరణ రేఖా/ రూపురేఖా పటాలు

  4. థిమాటిక్ పటాలు

View Answer

Answer : 1

రిలీఫ్ పటాలు

Question: 3

సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులకు సంబంధించి, ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించుము.

  1. ఆగమన పద్ధతి – సాధారణీకరణములను రూపొందించుటలో కూడి ఉంటుంది.

  2. కథాకథన పద్దతి – విద్యార్ధి కేంద్రీకృత పద్ధతితో కూడి ఉంటుంది.

  3. ప్రాజెక్టు పద్ధతి సహజ పరిసరాలతో కూడి ఉంటుంది.

  4. సమస్యా – పరిష్కార పద్ధతి – నిగమనాత్మక దృక్పథాన్ని కలిగి ఉంటుంది.

View Answer

Answer : 2

కథాకథన పద్దతి – విద్యార్ధి కేంద్రీకృత పద్ధతితో కూడి ఉంటుంది.

Question: 4

తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ఈ క్రింది వాని మౌలిక మార్గదర్శకాల ప్రకారం రూపొందించబడినవి.

A) NCF 2005

B) RTE Act 2009

C) SCF-2011

D) NCFTE 2010

సరియైన సమాధానాన్ని గుర్తించుము:

  1. A, B & C మాత్రమే

  2. B, C & D మాత్రమే

  3. A, C & D మాత్రమే

  4. A, B, C & D

View Answer

Answer : 4

A, B, C & D

Question: 5

సామాజిక శాస్త్రవేత్తలు, స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్న వ్యక్తులు, సంఘ సంస్కర్తల జీవిత చరిత్రలను విద్యార్థులకు బోధించడం ద్వారా, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు వారిలో ముఖ్యంగా ఈ విలువలను పెంపొందింపజేయవచ్చును.

  1. మనో వైజ్ఞానిక
  2. సాంస్కృతిక
  3. వృత్తిపర
  4. ఉత్తేజాన్ని పెంపొందించే
View Answer

Answer : 4

ఉత్తేజాన్ని పెంపొందించే

Recent Articles