Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 131

కింది వాటిలో వాహక జనిత వ్యాధులు ఏవి?

  1. క్షయ, విషపూరిత ఆహారము తినడము వలన కలిగే బొట్యులిజం అనే వ్యాధి.
  2. డిప్తీరియా, క్షయ, విషపూరిత ఆహారము తినడము వలన కలిగే బొట్యులిజం అనే వ్యాధి.
  3. బొబ్బల రోగం, మలేరియా, మెదరు వాపు వ్యాధి
  4. క్షయ, సాధారణ జలుబు
View Answer

Answer : 3

బొబ్బల రోగం, మలేరియా, మెదరు వాపు వ్యాధి

Question: 132

ఈ క్రింది. ప్రవచనాలను అధ్యయనం చేసి సరైన మేళవింపును గుర్తించండి.

ఎ. టైఫాయిడ్ బాక్టీరియా వలన వస్తుంది.

బి. సాధారణ జలుబు వైరస్ వలన వస్తుంది.

సి. మలేరియా బ్యాక్టీరియా వలన వస్తుంది.

డి. ఎయిడ్స్ ఒక వైరస్ వలన వస్తుంది.

  1. సి, డి సరైనవి కాని ఎ సరైనది కాదు
  2. బి, డి సరైనవి కాని ఎ సరియైనది కాదు
  3. బి, సి సరైనవి కాని డి సరైనది కాదు.
  4. ఎ, బి, డి సరైనవి కాని సి సరియైనది కాదు
View Answer

Answer : 4

ఎ, బి, డి సరైనవి కాని సి సరియైనది కాదు

Question: 133

మూత్రపిండ వ్యాధి ‘ఆక్యూట్ గ్లోమరులో నేప్రిటిస్’ వ్యాధిగ్రస్థుల ప్రత్యేక ఆహారములో ఉండవలసిన, నిశితమైన ఆహార పదార్థములు?

  1. తక్కువ మాంసకృతులు, తక్కువ సోడియం మరియు పోటాషియం, ఎక్కువ పిండి పదార్థము గల ఆహారం
  2. ఎక్కువ మాంసకృతులు, తక్కువ సోడియం మరియు పోటాషియం, తక్కువ పిండి పదార్థము గల ఆహారం
  3. ఎక్కువ మాంసకృతులు, తక్కువ సోడియం మరియు పొటాషియం, ఎక్కువ పిండి పదార్థము గల ప్రత్యేక ఆహారము
  4. తక్కువ మాంసకృతులు, సోడియం, పొటాషియం మరియు పిండి పదార్ధము గల ప్రత్యేక ఆహారము
View Answer

Answer : 1

తక్కువ మాంసకృతులు, తక్కువ సోడియం మరియు పోటాషియం, ఎక్కువ పిండి పదార్థము గల ఆహారం

Question: 134

చిన్న పిల్లలకు అంటువ్యాధుల నుండి రక్షణ కల్పించే టీకాలు ?

  1. బి.సి.జి, ఒ.పి.వి., డి.పి.టి., హైపటైటీస్ ఎ&బి టీకా
  2. హెపాటైటిస్, ఎ మరియు బి, ఒ.పి.వి. క్యాన్సర్ నివారణ టీకా
  3. టి.టి., డి.పి.టి., గవదబిళ్లల నివారణ టీకా
  4. బి.జి.సి., ఒ.పి.వి., నట్టల నివారణ టీకా
View Answer

Answer : 1

బి.సి.జి, ఒ.పి.వి., డి.పి.టి., హైపటైటీస్ ఎ&బి టీకా

Question: 135

ఆహారములో లేదా నీటిలో ఫ్లోరిన్ అధికము కావడము వలన కలిగే అనర్ధము ?

  1. దంతములు క్షీణించడము (దంత క్షయము)
  2. కండరము క్షణించడము
  3. దంతము మరియు ఎముకలు క్షీణించడము
  4. ఎముకలు క్షీణించడము
View Answer

Answer : 3

దంతము మరియు ఎముకలు క్షీణించడము