Home  »  TSPSC  »  Jainism

Jainism (జైన మతం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

అనువ్రత సిద్ధాంతమును బోధించింది.

  1. మహాయాన బౌద్ధమతం
  2. హీనయాన బౌద్ధమతము
  3. జైనమతము
  4. లోకాయతులు
View Answer

Answer: 3

జైనమతము

Question: 2

జైనమతానికి సంబంధించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి:
ఎ. వర్ధమాన మహావీరుడు జృంభికాగ్రామ పట్టణం వెలుపల రిజుపాలిక నది ఒడ్డున సామగా అనే గృహస్థుని పొలములో కైవల్యజ్ఞానం పొందెను
బి. కర్మ కణాలు వాస్తవానికి జీవాన్ని బంధించడానికి దాని వైపు పయనించడం ప్రారంభించిన స్థితిని ‘అశ్రవ’ అంటారు.
పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది/ఏవి సరైనవి?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి
  4. ఏదీ కాదు
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Question: 3

జైనమతంలోని శ్వేతాంబర శాఖకు సంబంధించిన ప్రకటనల్లో ఏది సరైనది కాదు?

  1. ఇది శ్వేత(తెల్లని) వస్త్రాలను ధరించే సన్యాసులను సూచిస్తుంది.
  2. ఇది క్రీ.పూ.4వ శతాబ్దంలో వింధ్య పర్వతాలకు దక్షిణ దిక్కుకి వలస వచ్చిన సన్యాసులను సూచిస్తుంది.
  3. వారు ద్వాదశాంగాలతో సహా సనాతన గ్రంథాల ఉనికిని గుర్తించారు.
  4. స్త్రీలు కూడా మోక్షాన్ని పొందగలరని వారు విశ్వసించారు.
View Answer

Answer: 2

ఇది క్రీ.పూ.4వ శతాబ్దంలో వింధ్య పర్వతాలకు దక్షిణ దిక్కుకి వలస వచ్చిన సన్యాసులను సూచిస్తుంది.

Question: 4

ఈ క్రింది వానిలో ఏది జైన మతానికి సంబంధించినంత వరకు సరికానటువంటి ప్రవచనము?

  1. జైనమత సంప్రదాయం ప్రకారము మహాభారత యుద్ధము నాటికి జైన మతానికి నేమినాథుడు నాయకత్వము వహిస్తున్నాడని అతడే 22వ తీర్థంకరుడిగా గుర్తింపు పొందెను.
  2. భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర నాటికే – సన్యాసులు సింధునది పరివాహ ప్రాంతములో ఉన్నట్లు తెలుస్తున్నది.
  3. ప్రసిద్ధి చెందిన గోమటేశ్వర్ విగ్రహాన్ని చెక్కించి నిలబెట్టినది 11వ శతాబ్దంలో గాంగ వంశస్థుడైన చాముండరాయుడు.
  4. మహావీరుడు తన బోధనలను అర్థమాగధిలో బోధించెను. ఈయన బోధనలు ‘శ్రుతంగాలు’ పేరుతో 12 గ్రంథములుగా పేరొందినాయి.
View Answer

Answer: 3

ప్రసిద్ధి చెందిన గోమటేశ్వర్ విగ్రహాన్ని చెక్కించి నిలబెట్టినది 11వ శతాబ్దంలో గాంగ వంశస్థుడైన చాముండరాయుడు.

Question: 5

ఈ క్రింది వాటిలో 23వ తీర్థంకరుడు పార్శ్వనాధుడు సూచించని సూత్రం ఏది?

  1. అపరిగ్రహ
  2. బ్రహ్మచర్యం
  3. అహింస
  4. సత్యం
View Answer

Answer: 2

బ్రహ్మచర్యం

Recent Articles