Home  »  TSPSC  »  Environment-9

Environment-9 (పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఢిల్లీలోని వాయు కాలుష్యానికి క్రింది వాటిలో ఏది ఎక్కువ కారణము?

  1. రాజస్తాన్లో పంట కోసిన తరువాత మోళ్లను (గడ్డి/ మోళ్లు)  తగుల పెట్టడము
  2. పంజాబ్లో పంట కోసిన తరువాత మోళ్ళను తగుల పెట్టడము
  3. పంజాబ్ లో వంట చెరుకు వాడటము
  4. రాజస్థాన్లో వంట చెరుకు వాడకము
View Answer

Answer : 2

పంజాబ్లో పంట కోసిన తరువాత మోళ్ళను తగుల పెట్టడము

Question: 2

పౌరులు నగర వాయు నాణ్యతను తెలుసు కొనేందుకు (ప్రస్తుతము 4 నగరాలలో) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మీటిరియాలజీ విడుదల చేసిన మొబైల్ అప్లికేషన్ పేరు ఏమిటి (క్రింది వాటిలో)?

  1. సఫర్ – ఎయిర్
  2. శుద్ధ – వాయు
  3. వాయు – మాప్
  4. నగర్ – ఎయిర్
View Answer

Answer : 1

సఫర్ – ఎయిర్

Question: 3

ఘన వ్యర్థాల సమస్యను తగ్గించడానికి క్రింది వాటిలో ఏ పద్ధతి మెరుగైనది?

  1. చెత్త గుట్టల వద్ద తగుల పెట్టడము
  2. పునర్వినియోగము (పునఃచక్రీయమ్)
  3. సముద్రములో పారవేయడము
  4. ఒత్తిడి ద్వారా కుదించడము
View Answer

Answer : 2

పునర్వినియోగము (పునఃచక్రీయమ్)

Question: 4

పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ యొక్క మార్గదర్శకాల ప్రకారము, “జీవావరణ సున్నితమండలము” (ఎకో సెన్సిటివ్ జోన్) వలన ప్రయోజనము ఏమిటి?

  1. ఒక జీవ పరిణామ వ్యవస్థ (బయోమ్)లో జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించడము
  2. ఒక ఆవాసములో జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించడము
  3. రక్షిత ప్రాంతాలకు హాని కలుగకుండా ఉండే (షాక్ అబ్సార్బర్) మధ్యస్థ ప్రాంతముగా ఉండటానికి
  4. సామర్ధ్య నిర్మాణానికి శిక్షణ మైదానముగా ఉండటానికి
View Answer

Answer : 3

రక్షిత ప్రాంతాలకు హాని కలుగకుండా ఉండే (షాక్ అబ్సార్బర్) మధ్యస్థ ప్రాంతముగా ఉండటానికి

Question: 5

పెట్రోల్ యంత్రాల నుండి విడుదలయ్యే ప్రధాన కాలుష్యాలు?

ఎ. కాల్చని హైడ్రోకార్భన్లు

బి. సల్ఫర్ ఆక్సైడ్

సి. కార్బన్ మోనాక్సైడ్

డి. సీసం

క్రింది ఐచ్ఛికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ, బి మరియు డి మాత్రమే
  2. ఎ, బి మరియు సి మాత్రమే
  3. ఎ, సి మరియు డి మాత్రమే
  4. ఎ, బి, సి మరియు డి
View Answer

Answer : 2

ఎ, బి మరియు సి మాత్రమే

Recent Articles