Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 151

వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులను పోలిన కారకాలను వాక్సిన్లు కలిగి ఉంటాయి. బలహీనమైన లేక చనిపోయిన సూక్ష్మజీవులు లేక వాటి ఉత్పాదకాల నుండి వాక్సిన్లను తయారు చేస్తారు. రేబిస్, వ్యాధికి వాక్సిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?

  1. జోనాస్ సాక్
  2. ఆల్బర్ట్ సాబిన్
  3. లూయిస్ పాశ్చర్
  4. ఎడ్వర్డ్ జెన్నర్
View Answer

Answer : 3

లూయిస్ పాశ్చర్

Question: 152

దోమకాటు వల్ల మలేరియా వస్తుంది అన్నది. అందరికి తెలిసిన విషయమే, ఈక్రింద ఇవ్వబడిన
దోమలలో ఏది మలేరియా రావడానికి కారణం?

  1. ఆడ అనోఫిలిస్ దోమ
  2. ఆడ క్యూలెక్స్ దోమ
  3. మగ అనోఫిలిస్ దోమ
  4. మగ క్యూలెక్స్ దోమ
View Answer

Answer : 1

ఆడ అనోఫిలిస్ దోమ

Question: 153

ఈ క్రింది ప్రకటనల్లో ఏది సరైనది కాదు?

  1. హెపటైటిస్-బి వైరస్ హెచ్ఐవి వైరస్ లాగానే ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సంక్రమిస్తుంది.
  2. హెపటైటిస్-బి వైరస్కు హెపటైటిస్-సికి ఉన్నట్టుగా వ్యాక్సిన్ లేదు
  3. ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ -బి వైరస్, హెపటైటిస్ – సి వైరస్లకు గురైనవారి సంఖ్య హెచ్ఐవికి గురైనవారి కంటే చాలా ఎక్కువ
  4. హెపటైటిస్-బి వైరస్, హెపటైటిస్ – సి వైరస్లకు TH/గురైనవారికి ఆ లక్షణాలు చాలా కాలం వరకు బయటపడవు
View Answer

Answer : 2

హెపటైటిస్-బి వైరస్కు హెపటైటిస్-సికి ఉన్నట్టుగా వ్యాక్సిన్ లేదు

Question: 154

‘నిక్షమ్ పోషణ యోజన’ ఏ వ్యాధికి సంబంధించినది ?

  1. డెంగ్యూ
  2. మశూచి
  3. మలేరియా
  4. క్షయ
View Answer

Answer :4

క్షయ

Question: 155

భారతదేశంలో రక్తహీనత నియంత్రణ కార్యక్రమం ద్వారా ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ పరిమాణంలో ప్రతి రోజు గర్భిణి స్త్రీలకు వంద రోజులు ఇస్తారు ?

  1. 40 మి.గ్రా, ఐరన్, 200 మైక్రో గ్రా. ఫోలిక్ యాసిడ్
  2. 20 మి.గ్రా. ఐరన్, 100 మైక్రో గ్రా. ఫోలిక్ యాసిడ్
  3. 100 మి.గ్రా, ఐరన్, 500 మైక్రో గ్రా. ఫోలిక్ యాసిడ్
  4. 60 మి.గ్రా. ఐరన్, 400 మైక్రో గ్రా. ఫోలిక్ యాసిడ్
View Answer

Answer : 3

100 మి.గ్రా, ఐరన్, 500 మైక్రో గ్రా. ఫోలిక్ యాసిడ్