Home  »  TSPSC  »  Plant Physiology

Plant Physiology (వృక్ష శరీర ధర్మ శాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 96

సరియైన వ్యాఖ్యలను గుర్తించండి?

ఎ. 19వ శతాబ్దపు ‘గ్రేట్ ఐరిష్ కరువు’ కు కారణహేతువు బంగాళాదుంపకు వచ్చిన లేట్ బైట & వ్యాధి.

బి. వరి, గోధుమ రంగు మచ్చ వ్యాధి, 1940 దశకంలో వచ్చిన బెంగాల్ కరువుకు కారణం

సి. బిటి పత్తిలో ప్రవేశపెట్టిన అన్యజన్యువు బాక్టీరియల్ వ్యాధులనుండి రక్షణ కలిపిస్తుంది.

డి. క్రౌన్గాల్ అనేది ఒక వైరస్ వ్యాధి.

సరియైన వ్యాఖ్యాలు:

  1. ఎ, బి
  2. బి, సి
  3. ఎ, సి
  4. బి, డి
View Answer

Answer : 3

ఎ, సి

Question: 97

కింది వాటిలో ఏది సముచితమైన సమ్మేళనం?

ఎ. బార్లీ: వరి, ఓట్లు, జొన్న

బి. అవిసెలు, బాదం, జీడిపప్పు, వాల్నట్లు

సి. అవిసెలు, ఓట్లు, మొక్కజొన్న, రాగి

డి. ఓట్లు, మొక్కజొన్న, రాగి, జొన్న

  1. ఎ మరియు బి
  2. బి, సి మరియు డి.
  3. ఎ, బి మరియు డి
  4. సి మరియు డి
View Answer

Answer : 3

ఎ, బి మరియు డి

Question: 98

ప్రతి పోషక స్థాయి లోని జీవుల సంఖ్య, శక్తి లేక జీవరాశిని ఆవరణ పిరమిడ్లు సూచి స్తాయి. సాధారణంగా ఆవరణ పిరమిడ్ల లు నిటారుగా ఉ ౦టాయి. కాని ఈ క్రింది పిరమిడ్ లలో ఒకటి తలక్రిందులుగా ఉంటుంది. దానిని గుర్తించండి.

  1. అరణ్య ఆవరణ వ్యవస్థకు సంబంధించిన జీవరాశి పిరమిడ్
  2. చెట్టు ఆవరణ వ్యవస్థకు సంబంధించిన సంఖ్య పిరమిడ్
  3. సముద్రపు ఆవరణ వ్యవస్థ సంబంధించిన శక్తి పిరమిడ్
  4. పచ్చి బయలు ఆవరణ వ్యవస్థకు సంబంధించిన శక్తి పిరమిడ్
View Answer

Answer : 2

చెట్టు ఆవరణ వ్యవస్థకు సంబంధించిన సంఖ్య పిరమిడ్

Question: 99

నిశ్చితం (ఎ): ‘శ్రీ’ వరిలో శ్రీ అనగా ‘సిస్టమ్ ఆఫ్  రైస్ ఇంటెన్సిఫికేషన్’

కారణం (ఆర్) : ఏ వరి రకాన్ని అయినా తక్కువ విత్తనం ఉపయోగించి మరియు తక్కువ నీటితో అర్ధశుష్క పంట పండించవచ్చు.

  1. ఎ మరియు ఆర్ రెండూ సరియైనవి, ఆర్ అనేది ఎ కు సరియైన వివరణ
  2. ఎ మరియు ఆర్ రెండూ సరియైనవి, ఆర్ అనేది .ఎ కు సరియైన వివరణ కాదు
  3. ఎ.సరియైనది మరియు ఆర్ సరియైనది కాదు
  4. ఎ సరియైనది కాదు మరియు ఆర్ సరియైనది
View Answer

Answer : 2

ఎ మరియు ఆర్ రెండూ సరియైనవి, ఆర్ అనేది .ఎ కు సరియైన వివరణ కాదు

Question: 100

క్రింది జాబితాలను గమనించండి మరియు సరియైన మేళవింపు చేయండి?

జాబితా-ఎ

ఎ. అధిక సాంద్రతతో కూడిన జీవ ఎరువు

బి. స్థూల జీవ ఎరువు

సి. పచ్చి రొట్ట ఎరువు

డి. రైతుమిత్ర ఎరువు

ఇ. రసాయనిక ఎరువు

జాబితా-బి

1. నీలి ఆకుపచ్చ శైవలాలు

2. సూపర్ ఫాస్పేట్

3. వేప విత్తనాల పొడి

4. పిల్లి పెసర

5. జంతు సంబంధ విసర్జక పదార్థాలు

సరియైన సమాధానం?

ఎ బి సి డి

  1. 3 1 5 4 2
  2. 3 5 1 4 2
  3. 3 5 4 1 2
  4. 3 2 5 1 4
View Answer

Answer : 3

3 5 4 1 2