Home  »  TSPSC  »  Buddhism

Buddhism (బౌద్ద మతము) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

క్రింది వారిలో ఎవరు బౌద్ధ సంఘములో సభ్యులు కావడానికి అర్హులు?

(A) 15 సంవత్సరాలు పైబడిన స్త్రీలు

(B) రాజుసేవలో ఉన్నవారు

(C) కుష్టువ్యాధి లేనివారు .

(D) అప్పులో ఉన్నవారు

  1. (B) మరియు (D)
  2. (B) మరియు (C)
  3. (A) మరియు (B)
  4. (C) మరియు (D)
View Answer

Answer: 1

(B) మరియు (D)

Question: 17

క్రింది వాఖ్యానములలో ఏది సరిఅయింది కాదు

  1. మానవుల బాధలకు కారణం దాని నివారణ అను విషయంపై తన మొట్టమొదటి సందేశాన్ని బుద్ధుడు తన అయిదుగురు పూర్వ సహచరులకు బనారస్ సమీపములో గల జింకల పార్కులో వినిపించెను
  2. బుద్ధుని యొక్క సూత్రముల అంతిమ ఉద్దేశం ‘నిబ్బనను’ సాధించడం అనగా జనన మరణాలు అనే చక్రం నుండి విముక్తిని పొందడం
  3. బౌద్ధమత బిక్కినులు (nuns)ఈ క్రింది వాటిని పూర్తిగా త్యజించవలయును. అవి ఏమనగా: దొంగతనము, శృంగారములో పాల్గనడం, అబద్ధం చెప్పడం, మత్తు పదార్ధములు వాడడం, మధ్యాహ్నం తర్వాత భోజనం చేయడం, సుగంధపూరితమైన వస్తువులు వాడడం, ఆహ్లాదానికై జరిపే కార్యకలాపములకు దూరంగా ఉండడం మరియు ఆభరణములను ధరించడం
  4. బౌద్ధమత గ్రంధములు స్త్రీల విషయములో విప్లవాత్మకైన భావములను కల్గి ఉన్నాయి. తమ యొక్క భవిష్యత్తును, వ్యక్తిత్వమును నిర్ణయించుకునే అధికారము స్త్రీలకే అవి కట్టబెట్టినాయి.
View Answer

Answer: 4

బౌద్ధమత గ్రంధములు స్త్రీల విషయములో విప్లవాత్మకైన భావములను కల్గి ఉన్నాయి. తమ యొక్క భవిష్యత్తును, వ్యక్తిత్వమును నిర్ణయించుకునే అధికారము స్త్రీలకే అవి కట్టబెట్టినాయి.

Question: 18

కింది వాటిలో ఏ జత (పదము – అర్ధము) సరిగ్గా సరిపోల్చబడలేదు.

  1. నలకార – రీడ్ వర్కర్ (రెల్లు పనివాడు)
  2. పాపనిక – దుకాణదారు
  3. సార్ధవాహ – ఒంటెల వర్తకుల నాయకుడు
  4. యానకార – ఎనుగుదంతాల తయారీదారు
View Answer

Answer: 4

యానకార – ఎనుగుదంతాల తయారీదారు

Question: 19

కింది వాటిలో సప్త-భంగి-నయా (సెవెన్-ఫోల్డ్ నయాస్) సిద్ధాంతంగా అభివృద్ధి చేయబడింది ఏది?

  1. అనేకంటావద
  2. అరియ-సచ్చాని
  3. అత్తాంగ – వెలుగ్గ
  4. పటిచ్చ – సముప్పాద
View Answer

Answer: 1

అనేకంటావద

Question: 20

ఈ క్రింది వాటిలో బౌద్ధమతానికి సంబంధించి సరికానటువంటి ప్రవచనము ఏది?

  1. బుద్ధుని పుట్టుకకు సంబంధించిన జాతక కథలు అభిదమ్మ పీఠకములో పొందుపరచబడినాయి
  2. బౌద్ధ జాతక కథల ప్రకారం బుద్ధుడు 551 సార్లు జన్మించెను
  3. తొలి బౌద్ధ సాహిత్యము ‘పాళి’ భాషలో వ్రాయబడినాయి
  4. వినయ పీఠకము, బౌద్ధ సంఘ నియమావళితో వ్యవహరించబడును.
View Answer

Answer: 1

బుద్ధుని పుట్టుకకు సంబంధించిన జాతక కథలు అభిదమ్మ పీఠకములో పొందుపరచబడినాయి

Recent Articles