Home  »  TSPSC  »  Environment-7

Environment-7(పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

పర్యావరణ విధ్వంసం, క్షీణత వీటి ద్వారా జరుగుతుంది.

ఎ. గాలి, నీరు, నేల వంటి వనరుల తరుగుదల

బి. ఆవరణ వ్యవస్థల విధ్వంసం

సి. వన్యప్రాణుల పెరుగుదల ప్రగతి

డి. వన్యప్రాణులు అంతరించిపోవడం

సరైన సమాధానం గుర్తించండి

  1. ఎ మాత్రమే
  2. బి డి మాత్రమే
  3. ఎ,బి, డి మాత్రమే
  4. ఎ, బి, సి మాత్రమే
View Answer

Answer : 3

ఎ,బి, డి మాత్రమే

Question: 2

మృత జీవుల దేహాలపై ప్రాథమికంగా పోషణ జరుపుకునే స్వేచ్ఛా సూక్ష్మ జీవులు?

  1. పరాన్న జీవులు
  2. రసాయన పూతికాహారులు
  3. రసాయన పరపోషితాలు
  4. పూతికాహారులు
View Answer

Answer : 4

పూతికాహారులు

Question: 3

ఆవరణ వ్యవస్థ సంబంధ సేవల గురించి క్రింది అంశాలు పరిశీలించండి.

ఎ. సూక్ష్మజీవులచే వరదల నియంత్రణ

బి. విచ్ఛిన్నకర ప్రక్రియల ద్వారా పోషకాల పునఃవలయికరణ

సి. సాంసృ్కతిక మరియు ప్రకృతి సౌందర్య పెంపొందించుట

డి. సారవంతమైన పదార్థాన్ని ఒకచోటి నుంచి ఇంకోచోటికి రవాణా చేయడం ద్వారా కొత్త మృత్తికను ఏర్పరచుట

పై అంశాలలో సరైనవి

  1. ఎ, బి
  2. బి, సి
  3. ఎ, డి
  4. ఎ, సి
View Answer

Answer : 2

బి, సి

Question: 4

కొన్ని దశల క్రింద డిడిటిని దోమలను చంపడానికి వాడేవారు. ఇటీవల సంవత్సరాలలో, డిడిటీ వాడి దోమలను చంపడం సాధ్యము కావడము లేదు. ” డిటిపై దోమలకు లభించిన నిరోధకతను ఏ సూత్రము వివరిస్తుంది?

  1. ప్రకృతి జోక్యపు సిద్ధాంతము
  2. నిరోధకత సిద్ధాంతము
  3. ప్రేడేటార్ – ప్రే సిద్ధాంతము
  4. ప్రకృతి వరణ సిద్ధాంతము
View Answer

Answer : 4

ప్రకృతి వరణ సిద్ధాంతము

Question: 5

వాయు నాణ్యతను కొలిచేందుకు జాతీయ వాయునాణ్యతా సూచిలో ఎన్ని కలుషిత పదార్థాలను పరిశీలిస్తారు?

  1. 3
  2. 5
  3. 7
  4. 8
View Answer

Answer : 4

8

Recent Articles