Home  »  TSPSC  »  Five Year Plans-Goals

Five Year Plans-Goals (పంచవర్ష ప్రణాళికలు-లక్ష్యాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

క్రింది వానిలో ఏవి 10వ పంచవర్ష ప్రణాళికలో పర్యవేక్షించదగిన లక్ష్యాలు?
ఎ. 2007 నాటికి అటవీ మరియు చెట్ల విస్తీర్ణాన్ని 31% నికి పెంచటం
బి. 2007 నాటికి అక్షరాస్యత మరియు వేతనరేట్లలో లింగ వ్యత్యాసాల్ని కనీసం 50% తగ్గించటం
సి. 2007 శిశుమరణాల రేటును ప్రాణంతో జన్మించిన ప్రతి 1000 మందికి 85 కు తగ్గించటం
డి. 2007 నాటికి పేదరిక నిష్పత్తిని 5 పర్సేంటేజ్ పాయింట్లకు తగ్గించటం
సరై సమాధానాన్ని ఎంచుకోండి :

  1. ఎ & బి మాత్రమే
  2. బి, సి & డి మాత్రమే
  3. బి & సి మాత్రమే
  4. ఎ & డి మాత్రమే
View Answer

Answer: 3

బి & సి మాత్రమే

Question: 27

11వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు
ఎ. ఈ ప్రణాళికలో సాధించిన సగటు ఆర్థికవృద్ధి రేటు 8%

బి. ఈ ప్రణాళికలో సాధించిన ఆర్థిక వృద్ధిరేటు, ఈ ప్రణాళికలో నిర్ణయించుకున్న ఆర్థిక వృద్ధిరేటు లక్ష్యం కంటే ఎక్కువ.

సి. 11వ పంచవర్ష ప్రణాళికలో సాధించిన వృద్ధిరేటు, 10వ పంచవర్ష ప్రణాళికలో సాధించిన వృద్ధిరేటు కంటే ఎక్కువ,

డి. 11వ ప్రణాళికలో సాధించిన వృద్ధిరేటును, అంతకుముందు ప్రణాళికలలో సాధించిన వృద్ధిరేటుతో పోల్చినట్లయితే అధికంగా ఉంది.

సరైన సమాధానాన్ని ఎంచుకోండి : 

  1. ఎ, సి & డి మాత్రమే
  2. బి, సి & డి మాత్రమే
  3. ఎ,బి & డి మాత్రమే
  4. ఎ,బి & సి మాత్రమే
View Answer

Answer: 1

ఎ, సి & డి మాత్రమే

Question: 28

11వ పంచవర్ష ప్రణాళిక యొక్క పర్యవేక్షిత లక్ష్యాలలో క్రింది ఒకటి?

  1. వ్యవసాయ రంగములో సగటున సాలీన 5 శాతం వృద్ధి రేటు సాధించడము
  2. విద్యావంతులలో నిరుద్యోగితను సాలీన 3 శాతం చొప్పున తగ్గించడము
  3. వినియోగ పేదరికము యొక్క తల గణన రేటును (headcount rate of consumption poverty) 10 శాతం పాయింట్లు తగ్గించడము
  4. ఏ నైపుణ్యమూ లేని కార్మికుల నిజ కూలీ రేటులో 50 శాతం వృద్ధి సాధించడము
View Answer

Answer: 3

వినియోగ పేదరికము యొక్క తల గణన రేటును (headcount rate of consumption poverty) 10 శాతం పాయింట్లు తగ్గించడము

Question: 29

కింద పంచవర్ష ప్రణాళికల్లో ఏది ‘వేగవంతమైన, మరింత సమగ్ర వృద్ధి దిశగా అనే లక్ష్యాన్ని కలిగివుంది?

  1. మొదటి పంచవర్ష ప్రణాళిక
  2. పదకొండవ పంచవర్ష ప్రణాళిక
  3. మూడవ పంచవర్ష ప్రణాళిక
  4. నాలుగో పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 2

పదకొండవ పంచవర్ష ప్రణాళిక

Question: 30

కింది వాటిలో ఏ ప్రణాళికా కాలంలో సగటున అత్యధికంగా 8 శాతానికి పైగా వృద్ధిరేటును సాధించడం జరిగింది?

  1. 11వ పంచవర్ణ ప్రణాళిక
  2. 7వ పంచవర్ష ప్రణాళిక
  3. 8వ పంచవర్ష ప్రణాళిక
  4. 10వ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 1

11వ పంచవర్ణ ప్రణాళిక